- Home
- Entertainment
- `ఓజీ`కి లైన్ క్లీయర్.. `అఖండ 2`, `ది రాజా సాబ్` రిలీజ్ వాయిదా.. కొత్త తేదీలు ఇవే
`ఓజీ`కి లైన్ క్లీయర్.. `అఖండ 2`, `ది రాజా సాబ్` రిలీజ్ వాయిదా.. కొత్త తేదీలు ఇవే
టాలీవుడ్‌లో రెండు భారీ సినిమాలు వాయిదా పడ్డాయి. ప్రభాస్ `ది రాజాసాబ్`, అలాగే బాలయ్య `అఖండ 2`ని కూడా పోస్ట్ పోన్ చేశారు. దీంతో పవన్ `ఓజీ`కి లైన్ క్లీయర్ అయ్యింది.

జనవరికి `ది రాజాసాబ్`
టాలీవుడ్‌లో రెండు సినిమాలు వాయిదా పడ్డాయి. రెండూ పాన్ ఇండియా మూవీస్ కావడం విశేషం. డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న `ది రాజాసాబ్` వాయిదా పడింది. అదే సమయంలో బాలకృష్ణ నటిస్తోన్న `అఖండ 2`ని కూడా వాయిదా వేశారు. తాజాగా ఈ విషయాన్ని నిర్మాతలు ప్రకటించారు. గురువారం ఉదయం `మిరాయ్` ట్రైలర్ ఈవెంట్ జరిగింది. `ది రాజాసాబ్` మూవీ డిసెంబర్ 5నే విడుదలవుతుందా? అని రిపోర్టర్ ప్రశ్నించగా, నిర్మాత పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ స్పందిస్తూ, డిసెంబర్ 5న రావడం లేదు అని, జనవరి 9న విడుదల చేయబోతున్నామని తెలిపారు. మారతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కామెడీ ఫాంటసీ హర్రర్ థ్రిల్లర్‌గా ఈ మూవీ రూపొందుతుంది.
#TheRajaSaab ON JANUARY 9TH!! #Prabhas@DirectorMaruthi . pic.twitter.com/MIeUZRGhdT
— Prabhas Trends (@TrendsPrabhas) August 28, 2025
`అఖండ 2` వాయిదా
ఇక తాజాగా బాలయ్య కూతురు తేజస్విని కూడా స్పందించారు. `అఖండ 2`ని వాయిదా వేస్తున్నట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. సినిమాకి టెక్నీకల్‌గా చాలా వర్క్ ఉందని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ డిలే అవుతుందని తెలిపారు. వీఎఫ్‌ఎక్స్ విషయంలో ఇంకా కాస్త టైమ్ కావాలని, క్వాలిటీ ఔట్‌పుట్ కోసం టైమ్ తీసుకుంటున్నట్టు తెలిపారు. పాన్ ఇండియా తరహాలో బెస్ట్ ఔట్ పుట్ ఇచ్చేందుకు తమకు సమయం సరిపోవడం లేదని, అందుకే విడుదల విషయంలో అనుకున్న డేట్‌కి రాలేకపోతున్నామని తెలిపారు. ముందుగా ఈ మూవీని సెప్టెంబర్ 25న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు `అఖండ 2` వాయిదా పడింది.
#Akhanda2 - AN IMPORTANT ANNOUNCEMENT.#Akhanda2Thaandavam
'GOD OF MASSES' #NandamuriBalakrishna#BoyapatiSreenu@AadhiOfficial@MusicThaman@14ReelsPlus@iamsamyuktha_@RaamAchanta#GopiAchanta#MTejeswiniNandamuri@kotiparuchuri@ivyofficial2023pic.twitter.com/3cKUSuehyS— 14 Reels Plus (@14ReelsPlus) August 28, 2025
డిసెంబర్‌లో `అఖండ 2`?
కొత్త డేట్‌ని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. తెలుస్తోన్న సమాచారం మేరకు ఈ మూవీని డిసెంబర్‌లో విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. గతంలోనూ `అఖండ` మూవీ డిసెంబర్‌లోనే విడుదలయ్యింది. అది పెద్ద విజయం సాధించింది. ఇప్పుడు కూడా `అఖండ 2` విషయంలో అదే సెంటిమెంట్‌ని ఫాలో అవుతున్నట్టు, సినిమాని డిసెంబర్‌లో విడుదల చేసే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్టు సమాచారం. ఇక బాలయ్య హీరోగా నటిస్తోన్న `అఖండ 2`కి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. బాలయ్య కూతురు తేజస్విని సమర్పణలో 14 రీల్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ మూవీని నిర్మిస్తున్నారు.
`ఓజీ`కి లైన్ క్లీయర్
దీంతో ఇప్పుడిది పవన్ కళ్యాణ్ `ఓజీ`కి పెద్ద ఊరటనిస్తుంది. `ఓజీ` విడుదలకు లైన్ క్లీయర్ అయినట్టయ్యింది. పవన్ కళ్యాణ్ నటించిన `ఓజీ` మూవీని కూడా సెప్టెంబర్ 25నే విడుదల చేస్తున్నారు. మొదట `అఖండ 2`, `ఓజీ`లు ఇదే తేదీన విడుదల తేదీ ప్రకటించారు. దీంతో ఈ రెండు సినిమాల మధ్య తీవ్ర పోటీ ఉంటుందని భావించారు. దసరా పండుగ ఉండటంతో పోటీ ఉన్నా, రెండు సినిమాలు ఆడుతాయని, కాకపోతే కలెక్షన్ల పరంగా ఇబ్బంది ఎదురవుతుందని భావించారు. కానీ `అఖండ 2` వాయిదా పడటంతో ఇప్పుడు `ఓజీ`కి లైన్ క్లీయర్ అయ్యిందని చెప్పొచ్చు. ఇక పవన్ హీరోగా రూపొందుతున్న `ఓజీ` చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, ఇమ్రాన్ హష్మీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.