MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నాగ చైతన్యను అల్లుడు చేసుకుందామనుకున్న బాలయ్య.... ఇరు కుటుంబాలు ఓకే అన్నాక చివర్లో ఎందుకు చెడింది?

నాగ చైతన్యను అల్లుడు చేసుకుందామనుకున్న బాలయ్య.... ఇరు కుటుంబాలు ఓకే అన్నాక చివర్లో ఎందుకు చెడింది?

హీరో నాగ చైతన్య బాలయ్య అల్లుడు కావాల్సిందట. ఇరు కుటుంబాల సభ్యులు ఒకే అనుకున్నాక సంబంధం చెడిపోయిందట. దానికి కారణం ఏమిటో ఓ సందర్భంలో నాగార్జున స్వయంగా తెలియజేశారు.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Sep 03 2022, 02:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Balakrishna

Balakrishna


వెండితెరను ఏలిన లెజెండ్స్ ఎన్టీఆర్, ఏఎన్నార్ నటవారసులుగా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున, బాలకృష్ణ తండ్రులకు తగ్గ తనయులు అనిపించుకున్నారు. మూడో తరం స్టార్స్ గా వాళ్ళు ఎదిగారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలం నుండి ఈ రెండు కుటుంబాల మధ్య సాన్నిహిత్యం ఉండేది. ఒకరింటికి మరొకరు రావడం పోవడం, వేడుకలకు హాజరు కావడం చేసేవారు. 
 

26
Balakrishna

Balakrishna

ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక ఎన్టీఆర్ తో ఏఎన్నార్ కి విబేధాలు వచ్చాయి. ఓ మీటింగ్ లో ఏఎన్నార్ చేసిన నెగిటివ్  కామెంట్ తన రాజకీయ ప్రవేశం గురించే అని భావించిన ఎన్టీఆర్ దూరం మైంటైన్ చేశారు. ఈ విషయాన్ని నాగేశ్వరరావు స్వయంగా చెప్పడం విశేషం. తర్వాత ఆ మనస్పర్థలు వీడి, ఎప్పటిలా కలిసిపోయారు. 
 

36
Balakrishna

Balakrishna

ఇక బాలయ్య, నాగార్జున కూడా మంచి మిత్రులు. అత్యంత సన్నిహితంగా ఉంటారు. ఈ క్రమంలో వియ్యంకులు అవ్వాలనుకున్నారట. నాగ్ పెద్ద కొడుకు నాగ చైతన్యతో బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని వివాహం చేయాలని భావించారట. ఈ సంబంధం పట్ల నాగార్జున, బాలయ్య చాలా సంతోషం వ్యక్తం చేశారట. ఇరు కుటుంబ సభ్యులు ఒక నిర్ణయానికి వచ్చాక నాగ చైతన్య షాక్ ఇచ్చాడట. 
 

46
Balakrishna

Balakrishna


అప్పటికే నాగ చైతన్య హీరోయిన్ సమంతను ప్రేమిస్తున్నాడు. ఆమెతో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయిన నాగ చైతన్య బాలయ్య కూతురిని చేసుకోవడం కుదరదు అన్నాడట. తండ్రి నాగార్జునతో ఆయన ఇదే చెప్పారట. సమంతను మాత్రమే వివాహం చేసుకుంటాను అన్నారట. ఇక చేసేది లేక చైతన్య, తేజస్విని పెళ్లి నిర్ణయం పెద్దలు వెనక్కి తీసుకున్నారట. 
 

56

ఒక వేళ నాగ చైతన్య సమంతను ప్రేమించకుండా ఉంటే బాలయ్య ఇంటి అల్లుడు అయ్యేవాడు. అంటారు కదా.. పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయని. అనంతరం బాలయ్య తేజస్విని వైజాగ్ కి చెందిన విద్యాసంస్థల అధినేత భరత్ కి ఇచ్చి వివాహం చేశారు. 2013లో వారి వివాహం జరిగింది.

66


సమంత మొదటి చిత్రం నాగ చైతన్య రెండో చిత్రం ఏమాయ చేశావే. ఈ చిత్ర షూటింగ్ టైం లో వాళ్ళ మధ్య ప్రేమ చిగురించింది. దాదాపు 8 ఏళ్ళు ప్రేమించుకున్న ఈ జంట 2018లో వివాహం చేసుకున్నారు.పెళ్ళైన నాలుగేళ్ళకు విడిపోయారు. 2021 అక్టోబర్ నెలలో సమంత, నాగ చైతన్య విడాకుల ప్రకటన చేశారు. 35 ఏళ్ల నాగ చైతన్య రెండో వివాహం ఎప్పుడు చేసుకుంటారో చూడాలి. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
నాగ చైతన్య

Latest Videos
Recommended Stories
Recommended image1
Thaai Kizhavi Review: రాధిక అరాచకం... `తాయ్ కిళవి` రివ్యూ, సినిమా ఎలా ఉందంటే?
Recommended image2
Gunde Ninda Gudi Gantalu: మౌనిక ప్రెగ్నెంట్, సంజూ కి ఫ్యూజులు ఔట్..ఉడకని రోహిణి పప్పులు
Recommended image3
4000 కోట్ల సినిమా ఫస్ట్ స్క్రీనింగ్.. రామాయణం ఫస్ట్ రివ్యూ VFX పై టాక్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved