- Home
- Entertainment
- Mokshagna Entry: స్లిమ్ గా బాలయ్య వారసుడు మోక్షజ్ఞ.. నందమూరి అభిమానుల్లో చిగురించిన ఆశలు!
Mokshagna Entry: స్లిమ్ గా బాలయ్య వారసుడు మోక్షజ్ఞ.. నందమూరి అభిమానుల్లో చిగురించిన ఆశలు!
నందమూరి మోక్షజ్ఞ లేటెస్ట్ క్లిక్ బయటికి రాగా స్లిమ్ గా కనిపించారు. దీంతో బాబు ఎంట్రీకి సిద్ధం అంటూ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Balakrishna - Mokshagna
నందమూరి డై హార్డ్ అభిమానులను చాలా కాలంగా ఓ సమస్య వేధిస్తుంది. తమ అభిమాన హీరో బాలయ్య కొడుకు, ఆరాధ్య దేవుడు ఎన్టీఆర్ మనవడు మోక్షజ్ఞ(Mokshagna) వెండితెర ఎంట్రీ ఇవ్వాలని వారు గట్టిగా కోరుకుంటున్నారు. ఎప్పటి నుండో బాలయ్య బర్త్ డే సెలెబ్రేషన్స్ కి ఏమాత్రం తగ్గకుండా మోక్షజ్ఞ పుట్టినరోజు వేడుకలు కూడా నిర్వహిస్తున్నారు.
Balakrishna - Mokshagna
మోక్షజ్ఞను లాంచ్ చేయాలంటూ బాలయ్యపై ఒత్తిడి తెస్తున్నారు. గుర్రాన్ని చెరువు దగ్గరకు తీసుకెళ్ళం గానీ నీళ్లు తాగించలేం అన్నట్లు... మోక్షజ్ఞ ఇష్టం లేకపోతే ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా దండగే. ఫ్యాన్స్ తో పాటు బాలయ్య (Balakrishna)కూడా ఈ విషయంలో బాధ పడుతున్నారు. మోక్షజ్ఞ ఎస్ అంటే... భారీ బడ్జెట్ తో స్టార్ దర్శకుడితో లాంచ్ చేయడానికి రెడీగా ఉన్నాడు.
మోక్షజ్ఞకు హీరో కావడం ఇష్టం లేదని ఎప్పటి నుండో వినిపిస్తున్న టాక్. అక్క బ్రాహ్మణి మాదిరి బిజినెస్ చేయాలనేది అతడి ఆకాంక్ష అట. 25 ఏళ్ళు దాటినా ముఖానికి రంగేసుకోకపోవడంతో పాటు శరీరంపై కనీస శ్రద్ధ తీసుకోకపోవడంతో ఈ మాట నిజమే అనిపిస్తుంది. మోక్షజ్ఞ అన్న జూనియర్ ఎన్టీఆర్(NTR) పసిప్రాయంలోనే రామాయణం వంటి పౌరాణిక చిత్రం చేశాడు. 20 ఏళ్ళు నిండకుండానే ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చి స్టార్ అయ్యాడు.
దీనికి మోక్షజ్ఞ పూర్తి భిన్నంగా ఉన్నాడు. గత రెండేళ్లుగా మోక్షజ్ఞ ఎంట్రీ పై ఊహాగానాలు ఎక్కువయ్యాయి. బాలయ్య కూడా తన కుమారుడు హీరో అవుతున్నాడంటూ పలు సంధర్భాల్లో ఓపెన్ అయ్యాడు. అనిల్ రావిపూడి, బోయపాటి అంటూ కొందరు దర్శకుల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. అధికారిక ప్రకటన మాత్రం ఇంత వరకు జరగలేదు.
కాగా మోక్షజ్ఞ కుటుంబ సభ్యులతో దిగిన లేటెస్ట్ ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ ఫోటోలో మోక్షజ్ఞ కొంచెం స్లిమ్ గా కనిపించాడు. గతంలో పోల్చితే ఆయన లుక్ కొంచెం మారింది. రెండేళ్ల క్రితం మోక్షజ్ఞను చూసి నందమూరి అభిమానులు షాక్ అయ్యారు. పెద్ద పొట్టతో అతడు పూర్తిగా షేప్ అవుట్ లుక్ లో కనిపించారు. అప్పటి లుక్ తో పోల్చితే మోక్షజ్ఞ ప్రస్తుత లుక్ బాగుంది.
ఈ నేపథ్యంలో మోక్షజ్ఞ ఎంట్రీకి సిద్దమయ్యాడు. అందుకే స్లిమ్ గా తయారయ్యాడంటూ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి వాళ్ళ ఊహాగానాలు నిజమైతే అంతకన్నా గుడ్ న్యూస్ వేరొకటి ఉండదు. మోక్షజ్ఞ బర్త్ డే సెప్టెంబర్ 6 కాగా అప్పటికైనా అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి.