- Home
- Entertainment
- 19 సినిమాల్లో డబుల్ రోల్స్, వరుసగా వంద కోట్ల చిత్రాలతో రచ్చ.. బాలయ్య కెరీర్‌లో అరుదైన రికార్డులు
19 సినిమాల్లో డబుల్ రోల్స్, వరుసగా వంద కోట్ల చిత్రాలతో రచ్చ.. బాలయ్య కెరీర్‌లో అరుదైన రికార్డులు
నందమూరి బాలకృష్ణ టాలీవుడ్‌లో టాప్ హీరోల్లో ఒకరిగా రాణిస్తున్నారు. నేడు ఆయన 65వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా బాలయ్య కెరీర్‌లో అత్యధిక వసూళ్లని రాబట్టిన చిత్రాలేంటో చూద్దాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
`తాతమ్మ కల` చిత్రంతో నటుడిగా బాలయ్య ఎంట్రీ
1974లో 'తాతమ్మ కల' సినిమాతో బాలకృష్ణ తెలుగు సినీ రంగ ప్రవేశం. ఇప్పటివరకు 109 సినిమాలు చేశారు. ఒక టీవీ షో (అన్ స్టాపబుల్) చేశారు.
`అఖండ` తో తొలి వంద కోట్ల మూవీ
2021లో 'అఖండ' బాలకృష్ణ కెరీర్ లో తొలి రూ.100 కోట్ల సినిమా. ప్రపంచవ్యాప్తంగా ఇది రూ.124 కోట్లు వసూలు చేసింది.
వరుసగా నాలుగు వంద కోట్ల చిత్రాలు
2023లో 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి' రూ.100 కోట్లకు పైగా వసూలు చేశాయి. వీటి వసూళ్లు వరుసగా రూ.132.5 కోట్లు, రూ.118.2 కోట్లు.
`డాకు మహారాజ్`తో వరుసగా నాల్గో వంద కోట్ల మూవీ
2025లో 'డాకూ మహారాజ్' బాలకృష్ణ కెరీర్ లో అత్యధిక వసూళ్లు (రూ.133.1 కోట్లు) సాధించిన సినిమా. ఇలా వరుసగా బాలయ్య నాలుగు చిత్రాలు వంద కోట్లకుపైగా వసూళ్లని రాబట్టాయి. టాలీవుడ్‌లో ఇలా వరుసగా నాలుగు వంద కోట్ల మూవీస్ చేసిన ఏకైక హీరోగా బాలయ్య నిలవడం విశేషం.
`అఖండ 2`తో రెండు వంద కోట్లపై కన్ను
బాలకృష్ణ తదుపరి సినిమాలు 'అఖండ 2', 'జైలర్ 2'. ఈ రెండూ కూడా 100 కోట్లకు పైగా వసూలు చేస్తాయని అంచనా. `అఖండ 2` టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది. సినిమాపై అంచనాలు పెంచింది. దీన్ని పాన్ ఇండియా మూవీగా విడుదల చేయబోతున్నారు. ఇది నార్త్ ఆడియెన్స్ కి కనెక్ట్ అయితే రెండు వంద కోట్లు పక్కా.
మరోవైపు రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న `జైలర్ 2`లో గెస్ట్ గా మెరవబోతున్నాని తెలుస్తుంది. ఇదే నిజమైతే మరో రెండు వంద కోట్ల మూవీ రెడీ అవుతుందని చెప్పొచ్చు.
డబుల్ రోల్స్ లో బాలయ్య రికార్డు
బాలయ్య కెరీర్‌లో మరో అరుదైన రికార్డు ఉంది. ఆయన ఏకంగా 18 సినిమాల్లో ద్విపాత్రాభినయం చేశారు. ఒక మూవీలో త్రిబుల్ రోల్ చేశారు. తన తరం వారిలో ఇది అరుదైన రికార్డుగా చెప్పొచ్చు. ఎవరికీ ఇది సాధ్యం కాలేదు.
ఎమ్మెల్యేగా బాలయ్య సంచలనం
నందమూరి బాలకృష్ణ మూడుసార్లు హిందూపురం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. వరుసగా గెలుపొందడం విశేషం. ఇలా ఆయన హ్యాట్రిక్ కొట్టాడు.