ఆ ఒక్క దర్శకుడి మూవీలో బాలయ్య విలన్ గా చేయడానికి సిద్ధం, నేరుగా చెప్పాడు!
ఎన్టీఆర్ నటవారసుడిగా పరిశ్రమలో అడుగుపెట్టిన బాలకృష్ణ విలన్ రోల్ చేసింది లేదు. అయితే ఒక దర్శకుడి మూవీలో మాత్రం ఛాన్స్ ఇస్తే చేస్తాను అంటున్నారు. ఆ దర్శకుడు ఎవరో తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవుతుంది.
నందమూరి బాలకృష్ణ విలన్ రోల్ చేయలేదు. ఆయన స్టార్ కిడ్ కావడంతో మంచి ఆరంభం దొరికింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమై హీరో అయ్యాడు. చిరంజీవి, రజినీకాంత్ వంటి హీరోలు కెరీర్ ఆరంభంలో విలన్ గా నటించి మెప్పించారు. కాగా బాలకృష్ణ కొన్ని సినిమాల్లో నెగిటివ్ షేడ్స్ తో కూడిన పాత్రలు చేశాడు. సుల్తాన్ మూవీలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ చేశారు. ఒక పాత్రలో ఆయన టెర్రరిస్ట్. ఆ రోల్ చాలా వైల్డ్ గా ఉంటుంది.
Balakrishna
పాండురంగడు మూవీలో సైతం బాలకృష్ణ నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్ర చేశాడు. స్త్రీలోలుడిగా ఆయన కనిపించారు. కెరీర్లో ఒక్కసారి కూడా పూర్తి స్థాయి ప్రతినాయకుడిగా నటించలేదు. కానీ బాలయ్యలో ఆ కోరిక ఉన్నట్లు ఉంది. ఈ మేరకు ఆయన చేసిన లేటెస్ట్ కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి.
Balakrishna
ఆహాలో స్ట్రీమ్ అవుతున్న అన్ స్టాపబుల్ సీజన్ 4 సక్సెస్ఫుల్ గా సాగుతుంది . హోస్ట్ బాలకృష్ణ తన మార్క్ వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటున్నాడు. అల్లు అర్జున్ తో పాటు పలువురు ప్రముఖులు అన్ స్టాపబుల్ షోకి గెస్ట్స్ గా విచ్చేశారు. శ్రీలీల, నవీన్ పోలిశెట్టి లేటెస్ట్ ఎపిసోడ్ లో పాల్గొన్నారు. యంగ్ స్టర్స్ ఇద్దరిని బాలకృష్ణ క్రేజీ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కరి చేశాడు.
Balakrishna
రాజమౌళి, సందీప్ రెడ్డి వంగ లతో సినిమా ఆఫర్ వస్తే ఏ దర్శకుడితో చేస్తావ్? అని నవీన్ పోలిశెట్టిని బాలకృష్ణ అడిగారు. రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో మూవీ చేస్తున్నారు. అది పూర్తి కావడానికి మూడేళ్ళ సమయం ఉంది. ఇక సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ తో స్పిరిట్ చేస్తున్నారు. ఈ మూవీ విడుదల కావడానికి కనీసం రెండేళ్ల సమయం తీసుకుంటుంది. కాబట్టి నేను ఫస్ట్ సందీప్ రెడ్డి వంగతో చేసి నెక్స్ట్ రాజమౌళితో చేస్తానని సమాధానం చెప్పాడు.
అనంతరం బాలయ్య మాట్లాడుతూ... నేనైతే రాజమౌళి మూవీలో హీరోగా, సందీప్ రెడ్డి వంగ మూవీలో విలన్ గా చేస్తాను, అన్నారు. ఈ కామెంట్ అందరి మైండ్ బ్లాక్ చేసింది. రాజమౌళితో హీరోగా చేస్తాను అనడంలో ప్రత్యేకత లేదు. సందీప్ రెడ్డి వంగ ఛాన్స్ ఇస్తే.. విలన్ గా అయినా చేస్తానని బాలకృష్ణ చెప్పడం కొసమెరుపు..
Sandeep Reddy Vanga,arjun reddy, animal
సందీప్ రెడ్డి వంగ చిత్రాల్లో పాత్రలు చాలా ఇంటెన్సిటీతో కూడి ఉంటాయి. వైల్డ్ క్యారెక్టరైజేషన్ సందీప్ రెడ్డి వంగ స్పెషాలిటీ. దీనిపై విమర్శలు వచ్చినా తగ్గడు. యానిమల్ తో వైలెన్స్ కి మరో అర్థం చెప్పాడు. రన్బీర్ కపూర్ పాత్రకు మించి వైల్డ్ గా బాబీ డియోల్ రోల్ ఉంటుంది. యానిమల్ మూవీలోని బాబీ డియోల్ పాత్ర బాలయ్యకు నచ్చిందేమో కానీ, ఆయన చిత్రంలో విలన్ రోల్ చేయడానికి ఓకే అన్నారు.