ఎన్టీఆర్ ని రెచ్చగొట్టేలా భగవంత్ కేసరి పోస్టర్... ఆపై డిలీట్, ఇంతకీ ఏముందంటే!
ఎన్టీఆర్-బాలయ్య మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న నేపథ్యంలో భగవంత్ కేసరి నిర్మాతలు విడుదల చేసిన పోస్టర్ వివాదాస్పదంగా ఉంది. ఎన్టీఆర్ ని రెచ్చగొట్టేలా ఓ కామెంట్ జోడించారు.
Bhagavanth Kesari
ఎన్టీఆర్ ఒకవైపు నారా, నందమూరి ఫ్యామిలీ మరోవైపు. ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణకు టీడీపీలో ప్రాతినిధ్యం తగ్గించినప్పటి నుండే ఈ లొల్లి ఉంది. అప్పుడప్పుడూ కలిసినట్లు కనిపించినా చాప కింద నీరులా విబేధాలు విస్తరిస్తున్నాయి. 2009లో టీడీపీ తరపున ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ తర్వాత జరిగిన పరిణామాలతో రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. 2019లో టీడీపీ ఓటమి తర్వాత ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు చేపట్టాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. టీడీపీ శ్రేణుల్లో బలపడుతున్న ఈ ఆలోచన అణచివేయాలంటే ఎన్టీఆర్ పై వ్యతిరేకత తేవాలి. అందుకు చంద్రబాబు సమయం దొరికినప్పుడల్లా ఎన్టీఆర్ ని టార్గెట్ చేస్తున్నాడనే వాదన ఉంది.
balakrishna ntr
వైసీపీ వాళ్ళు భువనేశ్వరిని అవమానపరిస్తే ఎన్టీఆర్ సాఫ్ట్ గా ఖండించాడని, తాత ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు హాజరు కాలేదని టీడీపీ శ్రేణుల్లో ఓ వర్గం సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ పై దుమ్మెత్తిపోశారు. తాజాగా చంద్రబాబు అరెస్ట్ పై ఎన్టీఆర్ మౌనం వహించడం పెద్ద చర్చకు దారి తీసింది. ఎవరు ఎంతగా ఇబ్బంది పెట్టినా బాబు అరెస్ట్ మీద ఎన్టీఆర్ మాట్లాడలేదు. ఈ విషయంలో ఎన్టీఆర్ ని దారుణంగా ట్రోల్ చేశారు. ఎన్టీఆర్ పేరు మార్చుకోవాలని మీడియాలో డిబేట్లు పెట్టారు.
ప్రెస్ మీట్లో బాలకృష్ణను బాబు అరెస్ట్ పై ఎన్టీఆర్ స్పందించలేదు. దీనికి మీరేమంటారని అడగ్గా... ఐ డోంట్ కేర్ బ్రదర్ అన్నాడు. ఎన్టీఆర్ స్పందించినా స్పందించకున్నా వచ్చిన నష్టం లేదని పరోక్షంగా చెప్పాడు. ఎన్టీఆర్ ని బాలయ్య ఫ్యాన్స్ ట్రోల్ చేసే క్రమంలో ఈ 'ఐ డోంట్ కేర్' అనే పదం బాగా వాడారు. ఇప్పుడు అదే కామెంట్ తో భగవంత్ కేసరి నిర్మాతలు 'బ్రో ఐ డోంట్ కేర్' అని రాసి కలెక్షన్ పోస్టర్ విడుదల చేశారు.
Bhagavanth Kesari
ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని రెచ్చగొట్టేలా ఉంది. ఎన్టీఆర్ అభిమానులు భగవంత్ కేసరి చిత్రాన్ని బహిష్కరించారని వార్తలు వస్తున్న నేపథ్యంలో మీరు చూడకపోయినా సినిమా ఆడుతుందని చెప్పే ప్రయత్నం కావచ్చు. అయితే ఈ పోస్ట్ ని షైన్ స్క్రీన్ ట్విట్టర్ నుండి తర్వాత తొలగించడం విశేషం.
Bhagavanth Kesari
ఇక భగవంత్ కేసరి కలెక్షన్స్ పోస్టర్ ఫేక్ అనే వాదన వినిపిస్తోంది. మూడో రోజు ఏపీ/తెలంగాణాలలో రూ. 10.65 కోట్ల షేర్ వసూలు చేసినట్లు పోస్టర్ విడుదల చేశారు. ట్రేడ్ వర్గాలు లెక్కలు మాత్రం అందులో మూడో వంతు కలెక్షన్స్ ఉన్నాయి. భగవంత్ కేసరి చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు. శ్రీలీల కీలక రోల్ చేయగా, కాజల్ హీరోయిన్ గా నటించింది.