MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఎన్టీఆర్ ని దెబ్బతీసేందుకు మోక్షజ్ఞతో బాలయ్య భారీ స్కెచ్... కొండను ఢీ కొట్టడం అయ్యేపనేనా!

ఎన్టీఆర్ ని దెబ్బతీసేందుకు మోక్షజ్ఞతో బాలయ్య భారీ స్కెచ్... కొండను ఢీ కొట్టడం అయ్యేపనేనా!

సీఎం జగన్ పొలిటికల్ ట్రాప్ లో టీపీడీ చిక్కుకుంది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు పిచ్చి నిర్ణయమని భావించినవారు ప్రస్తుత పరిణామాలు చూశాక... ఇది మామూలు స్కెచ్ కాదంటున్నారు. సైలెంట్ గా నందమూరి అభిమానుల మధ్య చిచ్చుపెట్టి వైసీపీ వర్గాలు చోద్యం చూస్తున్నాయి.  

2 Min read
Author : Sambi Reddy
Published : Sep 27 2022, 12:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
ntr

ntr


ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీగా మొదలైన పేరు మార్పు వివాదం కాస్త... బాలయ్య వర్సెస్ ఎన్టీఆర్ అన్నట్లుగా మారింది. ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్సార్ పేరుపెట్టడాన్ని మనవడిగా జూనియర్ ఖండించారు. అయితే డిప్లొమాటిక్ గా స్పందించారు. ఎన్టీఆర్, వైఎస్సార్ లను సమాన స్థాయి నాయకులుగా అభివర్ణించాడు. పేరు మార్పు చర్య వైఎస్సార్ స్థాయి పెంచదు, ఎన్టీఆర్ స్థాయి తగ్గించదు.. అంటూ ట్వీట్ చేశాడు.
 

27
Balakrishna

Balakrishna

ఇది టీడీపీ వర్గాలకు నచ్చలేదు. కనీసం రెండు మూడు బూతులు, పరుష పదాలు లేకుండా ఎలా ఖండిస్తావ్? అయినా ఎన్టీఆర్, వైఎస్సార్ సమాన స్థాయి నాయకులు ఎలా అవుతారు? అంటూ దాడికి దిగారు. వారు దిగారు అనడం కంటే చంద్రబాబు వాళ్ళను ఉసిగొల్పాడని చెప్పడం సబబు. టీడీపీ అసలైన వారసుడు ఎన్టీఆరే అంటూ బాబుని టీడీపీలోని ఒక వర్గం ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. కొడుకు లోకేష్ రాజకీయ భవిష్యత్ కి అడ్డుగా తయారైన ఈ సమస్య పరిష్కారం కోసం బాబు చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నారు. 
 

37

ఏ మాత్రం అవకాశం దొరికినా ఎన్టీఆర్ ని టీడీపీ వర్గాల్లో చులకన చేయాలని చూస్తున్నాడు. ఎన్టీఆర్ ని టీడీపీ ద్రోహిగా చిత్రీకరించి పార్టీకి పూర్తిగా దూరం చేయాలనేది బాబు కల. అలాగే బామ్మర్ది బాలయ్య కోరిక కూడాను. ఆ మధ్య భువనేశ్వరిని వైసీపీ నాయకులు కించపరిచారనే వివాదంలో కూడా ఇదే పద్ధతి అవలంబించారు. ఆడవాళ్లను రాజకీయాల్లోకి లాగడం, దూషించడం సరికాదని ఎన్టీఆర్ ఖండించారు. అయినప్పటికీ అది సరిపోదని కార్నర్ చేసి దారుణమైన కామెంట్స్ చేశారు.

47

ఎన్టీఆర్ ని ఎంత తొక్కేయలన్నా టీడీపీలో ఆయనకున్న మద్దతు తగ్గడం లేదు. పైగా టీడీపీ రెండు వర్గాలుగా చీలిపోయి మరీ ఎన్టీఆర్  తరపున బాబు, బాలయ్య వర్గంపై యుద్దానికి దిగుతుంది.   దీనికంతటికి కారణం.. ఎన్టీఆర్ కున్న స్టార్ డమ్ అని బాబు వర్గం భావిస్తున్నారు. హీరోగా ఎన్టీఆర్ ని దెబ్బతీస్తేనే  అతని అడ్డు తొలగించుకోగలమని భావిస్తున్నారు.

57


దీనికి మోక్షజ్ఞ వెండితెర ఎంట్రీనే మార్గం అనుకుంటున్నారట. నందమూరి ఫ్యామిలీలో మరో స్టార్ లేకపోవడం వలనే ఫ్యాన్స్ ఎన్టీఆర్ వెనుక పడుతున్నారు. మోక్షజ్ఞ స్టార్ గా అవతరిస్తే ఎన్టీఆర్ కి చెక్ పెట్టొచ్చని బాలయ్య, బాబు ప్లాన్ అట. అందుకే లేటు లేకుండా మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేయాలని భావిస్తున్నారట. నందమూరి హీరోలు అంటే మోక్షజ్ఞ, బాలయ్య మాత్రమే అన్న ప్రచారం చేయాలనుకుంటున్నారట.
 

67
Mokshagna Birthday

Mokshagna Birthday

 
అయితే అదంత ఈజీ కాదు. ఎన్టీఆర్ ని ఢీ కొట్టే హీరోగా మోక్షజ్ఞ ఎదుగుతాడు అనుకోవడం పొరపాటే. ఎందుకంటే స్టార్ డమ్ ఎవరూ ఇచ్చేది కాదు, కష్టపడి తెచ్చుకోవాల్సింది. ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా టాలెంట్ తో మాత్రమే మాస్ ఇమేజ్ వస్తుంది. ఎన్టీఆర్ తన ప్రతిభతో పాన్ ఇండియా రేంజ్ కి ఎదిగాడు. వందల కోట్ల మార్కెట్ సంపాదించారు. 
 

77

 
అయితే అదంత ఈజీ కాదు. ఎన్టీఆర్ ని ఢీ కొట్టే హీరోగా మోక్షజ్ఞ ఎదుగుతాడు అనుకోవడం పొరపాటే. ఎందుకంటే స్టార్ డమ్ ఎవరూ ఇచ్చేది కాదు, కష్టపడి తెచ్చుకోవాల్సింది. ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా టాలెంట్ తో మాత్రమే మాస్ ఇమేజ్ వస్తుంది. ఎన్టీఆర్ తన ప్రతిభతో పాన్ ఇండియా రేంజ్ కి ఎదిగాడు. వందల కోట్ల మార్కెట్ సంపాదించారు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
సినిమాల్లోకి రాక‌ముందు.. ఈ హీరోయిన్ల పేర్లు ఏంటో తెలుసా.?
Recommended image2
Mahesh Babu: మహేష్ బాబు నటిస్తూ నిజంగానే ఏడ్చేసిన సన్నివేశం, సినిమా ఏదో తెలుసా?
Recommended image3
Thalapathy Vijay: 2 లక్షల నుంచి 9 కోట్ల వరకు.. దళపతి గ్యారేజ్ లో ఖరీదైన కార్లు ఇవే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved