లాంచింగ్ కి సిద్ధంగా ఉన్న స్టార్ హీరోల వారసులు వీరే! స్టార్ అయ్యేది ఎవరు?
మూడో తరం, నాలుగో తరం వారసులు వచ్చేస్తున్నారు. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, వెంకటేష్ కుమారులు హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. వారు ఎలా ఉన్నారో? ఏం చేస్తున్నారో? చూద్దాం..

పరిశ్రమ ఏదైనా వారసత్వం అనేది చాలా కామన్. రాజకీయాలు, సినిమాల్లో ఇది బలమైన సెంటిమెంట్. ఒక స్టార్ హీరో కొడుకు హీరో కావాలని ఫ్యాన్స్ కోరుకుంటారు. తండ్రి లెగసీని ముందుకు తీసుకెళ్లాలని భావిస్తారు. ఇక టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరూ నెపోకిడ్సే. కాగా వీరి వారసులు కూడా లాంచింగ్ కి సిద్ధంగా ఉన్నారు.
ఎన్టీఆర్ నటవారసుల్లో ఒకడైన బాలకృష్ణ స్టార్ గా ఎదిగారు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. అయితే ఆయన కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ మాత్రం లేట్ అయ్యింది. మోక్షజ్ఞను సిల్వర్ స్క్రీన్ పై చూడాలని ఫ్యాన్స్ తహతహలాడుతున్నారు.
మోక్షజ్ఞ వయసు దాదాపు 30 ఏళ్ళు . ఈపాటికి అతడు కనీసం అరడజను సినిమాలు చేయాల్సింది. మోక్షజ్ఞ అన్నయ్య జూనియర్ ఎన్టీఆర్ అయితే ఆ వయసుకు మాస్ హీరోగా స్టార్డం కూడా తెచ్చుకున్నాడు. కాగా ఈ ఏడాది మోక్షజ్ఞ హీరోగా అరంగేట్రం చేయడం ఖాయం అంటున్నారు. త్వరలో వివరాలు రానున్నాయట.
సూపర్ స్టార్ కృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమ మీద చెరగని వేశారు. ప్రయోగాత్మక చిత్రాలు చేసి విజయం సాధించారు. కొత్త సాంకేతికత టాలీవుడ్ కి పరిచయం చేశాడు. ఆయన కుమారుడు మహేష్ బాబు అతిపెద్ద స్టార్ గా ఎదిగాడు. ఇక మహేష్ కుమారుడు గౌతమ్ కృష్ణ హీరోగా త్వరలో ఎంట్రీ ఇవ్వనున్నాడు.
గౌతమ్ కృష్ణ చైల్డ్ ఆర్టిస్ట్ గా వన్ నేనొక్కడినే చిత్రం చేశాడు. మహేష్ బాబు చిన్నప్పటి పాత్ర చేశాడు. రెండు పదుల వయసుకు దగ్గర పడింది గౌతమ్ కృష్ణ ఇటీవల గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఒకటి రెండేళ్లలో హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడని సమాచారం.
ఇక పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ హీరోగా ఎంట్రీ ఇవ్వాలని ఫ్యాన్స్ చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. అకీరాకు హీరో అయ్యే వయసు వచ్చేసింది. చక్కని హెయిర్ స్టైల్, హైట్, పర్సనాలిటీతో అకీరా అద్భుతంగా ఉన్నాడు.
అకీరా మ్యూజిక్, ఫిల్మ్ మేకింగ్ కోర్సులు చేశాడు. ఈ ఆరున్నర అడుగుల కుర్రాడు వచ్చే ఏడాది హీరోగా లాంచ్ అయ్యే సూచనలు గట్టిగా కనిపిస్తున్నాయి. అయితే అకీరా బాధ్యతలు రేణు దేశాయ్ చూసుకుంటున్నారు. కాబట్టి ఆమెదే అంతిమ నిర్ణయం.
లాంచింగ్ కి సిద్ధంగా ఉన్న మరో స్టార్ కిడ్ అర్జున్ దగ్గుబాటి. వెంకటేష్ నటవారసుడిగా అతడు సిల్వర్ స్క్రీన్ కి పరిచయం కానున్నాడు. వెంకటేష్ ఫార్మ్ తగ్గింది. ఆయన ముల్టీస్టారర్స్ చేస్తున్నారు. కాబట్టి కొడుకును లైన్లోకి తెచ్చే ప్రయత్నాలు స్టార్ట్ చేశాడట.
కాగా నందమూరి నాలుగో తరం హీరో నందమూరి తారక రామారావు హీరోగా లాంచ్ అయ్యాడు. హరికృష్ణ మనవడైన యంగ్ ఎన్టీఆర్ ని దర్శకుడు వైవిఎస్ చౌదరి హీరోగా పరిచయం చేస్తున్నాడు. మరి ఈ వారసుల్లో స్టార్స్ గా ఎదిగి వారసత్వాన్ని నిలబెట్టేది ఎవరో చూడాలి...