బాలకృష్ణ ముహూర్తం పెడితే.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన యంగ్ హీరో ఎవరో తెలుసా?
నందమూరి నటసింహం బాలయ్య బాబుకు సెంటిమెంట్లు చాలా ఎక్కువ.. ముహుర్తాలు చూడకుండా ఆయన ఏపనిచేయరు.. బాలయ్య బాబు ముహూర్తం పెట్టడంతో.. చాలా కాలంగా ఫెయిల్యూర్స్ చూస్తున్న యంగ్ హీరో.. హిట్టు కొట్టాడని మీకు తెలుసా? ఇంతకీ ఎవరా యంగ్ స్టార్.. ఏంటా సినిమా?

బాలకృష్ణ సెంటిమెంట్
నందమూరి నటసింహం బాలకృష్ణకు సెంటిమెంట్లు చాలా ఎక్కువ. దైవ ధ్యానం..ముహూర్తాలు, పూజలు, హోమాలు లాంటివి ఎక్కువగా చేస్తుంటాడు బాలకృష్ణ. ఏదైనా మొదలు పెట్టాలన్నా... ఏదైనా కథ వినాలన్నా.. సినిమా రిలీజ్ కానీ, ప్రయాణం కానీ.. ఏదైనా సరే ముహుర్తాలు చూసుకుని చేస్తుంటారు బాలయ్య బాబు. ఆయనే కాదు తన చుట్టు ఉన్నవారికి కూడా వీటికి సంబంధించి సలహాలు సూచనలు ఇస్తుంటారు.
తండ్రి ఎన్టీఆర్ నుంచి వచ్చిన అలవాటు..
బాలకృష్ణకు దైవ భక్తి ,ముహూర్తపు సెంటిమెంట్ తన తండ్రి ఎన్టీఆర్ నుంచి వచ్చింది. ఆయన కూడా ఉదయాన్నే మూడు గంటలకే నిద్ర లేచి.. 4 గంటలకు పూజ పూర్తి చేసేవారట. 5 గంటలకు అభిమానులను చూసి.. ఇతర కార్యక్రమాలకు వెళ్లిపోయేవారట. బాలయ్య బాబు కూడా అంతే... ఉదయాన్నే 4 గంటలకు లేచి.. వ్యాయామం చేసి.. గంటకు పైగా పూజ చేస్తారట. ఎన్నో రకాల శ్లోకాలు కూడా చదువుతారట నటసింహం. ఈ విషయాన్ని బాలకృష్ణ కూడా పలు సందర్బాల్లో వెల్లడించారు. ఎన్టీఆర్ లాగానే బాలయ్య కూడా ముహూర్తాలు చూసుకుని ఏదైన పని మొదలు పెడుతుంటారు.
యంగ్ హీరో సినిమాకు ముహూర్తం పెట్టిన బాలకృష్ణ
బాలకృష్ణ తను మాత్రమే కాదు తన చుట్టు ఉన్నవారిలో నమ్మకం ఉన్నవారికి కూడా ముహుర్త బలం గురించి చెపుతుంటారు. టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ సినిమాకు ముహూర్తం పెట్టి మరీ ఆశీర్వదించారు బాలకృష్ణ. చాలా కాలంగా హిట్ సినిమా లేక ఇబ్బందిపడుతున్న శర్వానంద్... రీసెంట్ గా నారి నారి నడుమ మురారి సినిమాతో మంచి సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈమూవీ అనుకున్నప్పుడు టైటిల్ గురించి చాలా ఆలోచించారట. గతంలో బాలయ్య ఈటైటిల్ తో సినిమా చేసి హిట్ కొట్టాడు. కథకు కరెక్ట్ గా సరిపోతుండటంతో.. ఈ టైటిల్ ను ఫిక్స్ అయ్యారు. అయితే బాలయ్య బాబు దగ్గర అనుమతి తీసుకోవాలని.. శర్వానంద్ ఫోన్ చేశారట.
బాలకృష్ణకు శర్వానంద్ కృతజ్ఞతలు..
శర్వానంద్ ఫోన్ చేసి.. సినిమా గురించి.. టైటిల్ పెడుతున్న సంగతి గురించి చెప్పి..అనుమతి అడిగారట. బాలకృష్ణ వెంటనే.. పర్మీషన్ అడగాల్సిన అవసరం లేదు.. నువ్వు నా వాడివి..నీకు కాకుండా ఎవరికి ఇస్తాను.. టైటిల్ వాడుకోమని చెప్పి.. సినిమాకోసం మంచి ముహూర్తం కూడా పెట్టారట . అంతే కాదు సినిమా హిట్ అయిన తరువాత ఫోన్ చేసి.. నా పరువు నిలబెట్టావు, కంగ్రాట్స్ అని సంతోషంగా చెప్పారట బాలకృష్ణ. ఆయన ముహూర్తం పెట్టడం కూడా తమ సినిమాకు బాగా కలిసి వచ్చిందని.. బాలయ్య బాబు గురించి.. టైటిల్ కథ గురించి శర్వానంద్ ఓ ఇంటర్వ్యూలో గొప్పగా చెప్పుకొచ్చారు.
దూసుకుపోతున్న బాలయ్య..
నందమూరి నటసింహం బాలకృష్ణ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అరుదైన రికార్డులతో ఆటాడుకుంటున్నాడు. అఖండ నుంచి వరుసగా ఐదు సినిమాలతో విజయయాత్ర కొనసాగిస్తున్నాడు బాలకృష్ణ. 65 ఏళ్ల వయసులో.. డబుల్ హ్యాట్రిక్ హిట్ కు దగ్గరగా ఉన్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన అఖండ2 సినిమా బ్లాక్ బస్టర్ కాకపోయినా..మంచి విజయాన్ని అందించింది. వరుస సినిమాలతో హిట్ల మీద హిట్లు సాధిస్తూ, సినిమాల్లో.. రాజకీయాల్లో కూడా విజయపతాకం ఎగరేస్తున్నాడు బాలకృష్ణ. ప్రస్తుతం బాలయ్య మలినేని గోపీచంద్ తో తన నెక్ట్స్ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు.

