బాలకృష్ణ రిస్క్ చేస్తాడా?.. 20ఏళ్ల తర్వాత రీమేక్ గ్రీన్ సిగ్నల్?.. ఈ టైమ్‌లో అంటే కష్టమే!
బాలకృష్ణ మాస్ యాక్షన్ సినిమాలకు కేరాఫ్. అలానే ఉంటేనే ఆడియెన్స్ కి నచ్చుతాయి. ఈ క్రమంలో తాజాగా ఆయన ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడట బాలయ్య.
నందమూరి బాలకృష్ణ.. హీరోగా నిలబడే సమయంలో రీమేక్ సినిమాలు చేశారు. స్టార్ హీరోగా ఎదగడంలో కొంత వరకు రీమేక్‌ల పాత్ర ఉంది. కానీ ఆ తర్వాత ఆయన రీమేక్‌ల జోలికి వెళ్లలేదు. గత 20ఏళ్లలో వాటికి దూరంగా ఉంటూ వచ్చారు బాలయ్య. చివరగా ఆయన `లక్ష్మీ నరసింహ` చిత్రాన్ని రీమేక్ గా చేశాడు. ఇది బాగానే ఆడింది.
Balakrishna
ఆ తర్వాత ఆయన వరుసగా స్ట్రెయిట్ మూవీస్ చేసుకుంటూ వస్తున్నాయి. ఈ క్రమంలో ఆయనకు నాలుగైదు మంచి విజయాలే దక్కాయి. ఇటీవల కాలంలో `సింహా`, `లెజెండ్`, `అఖండ`, `వీరసింహారెడ్డి` చిత్రాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. బాలయ్య మార్క్ యాక్షన్, ఎలివేషన్లు, మాస్ ఎలిమెంట్లతో సాగే చిత్రాలివి. పైగా వీటిలో సెంటిమెంటు కూడా బాగానే ఉన్నాయి. అందుకే ఈ మూవీస్ బాగానే ఆడాయి.
aavesham
ఇన్నాళ్లు రీమేక్‌ల జోలికి వెళ్లని బాలయ్య ఇప్పుడు రీమేక్ ల వైపు చూస్తున్నాడట. ఆయన తాజాగా ఓ రీమేక్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. మలయాళంలో విజయం సాధించిన `ఆవేశం` సినిమాని తెలుగులో రీమేక్‌కి ప్లాన్ జరుగుతుంది. ఇందులో నటించేందుకు బాలయ్య సుముఖంగా ఉన్నాడని టాక్. `పుష్ప` ఫేమ్ ఫహద్ ఫాజిల్ హీరోగా నటించిన ఈ బ్లాక్ కామెడీ యాక్షన్ మూవీ అక్కడ పెద్ద హిట్ అయ్యింది. దీని గురించి తెలుగు మీడియా కూడా చర్చించింది.
ఈ నేపథ్యంలో మైత్రీ మూవీ మేకర్స్ సినిమా రీమేక్ హక్కులు తీసుకున్నారట. తెలుగులో బాలకృష్ణతో చేయాలని భావిస్తున్నారట. ఈ మేరకు చర్చలు జరిగినట్టు తెలుస్తుంది. మరి నిజంగానే బాలయ్య గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడా? అనేది తెలియాల్సి ఉంది. వరుసగా స్ట్రెయిట్ చిత్రాలతో దుమ్ములేపుతున్నాడు బాలయ్య. ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. ఇలాంటి టైమ్‌లో ఆయన రీమేక్‌తో రిస్క్ చేస్తాడా? అనేది పెద్ద ప్రశ్నగా మారింది.
ఈ సినిమాకి ఎవరు దర్శకత్వం వహిస్తారనేది ప్రశ్న. అయితే హరీష్ శంకర్ పేరు వినిపిస్తుంది. బాలయ్యతో హరీష్‌కి ఓ కమిట్మెంట్ ఉంది. అలాగే మైత్రీలో ఆయనకు కమిట్ మెంట్ ఉంది. అందుకే ఈ కాంబోలో సినిమా ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరి ఏంజరుగుతుందో చూడాలి. ప్రస్తుతం బాలయ్య.. బాబీ దర్శకత్వంలో `ఎన్బీకే109` చిత్రంలో నటిస్తున్నాడు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ ఏడాది చివర్లో గానీ, వచ్చే ఏడాదిలోగానీ ఇది విడుదల కానుందట.