MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • Pragya Jaiswal: `మీరు మనిషేనా?`.. బాలయ్యని పట్టుకుని అంత మాట అనేసిందేంటి?

Pragya Jaiswal: `మీరు మనిషేనా?`.. బాలయ్యని పట్టుకుని అంత మాట అనేసిందేంటి?

ప్రగ్యా జైశ్వాల్‌.. నందమూరి బాలకృష్ణపై ఓ షాకింట్‌ కామెంట్‌ చేసింది. ఏకంగా బాలయ్య ముఖం పట్టుకుని `అసలు మీరు మనిషేనా?` అంటూ వ్యాఖ్యానించిందట. బాలకృష్ణపై ప్రగ్యా జైశ్వాల్‌ చేసిన కామెంట్‌ ఇప్పుడు హల్‌చల్‌ చేస్తుంది. ఆ వివరాల్లోకి వెళితే.. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Nov 27 2021, 10:22 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ప్రగ్యాజైశ్వాల్‌(Pragya Jaiswal) ఫస్ట్ టైమ్‌ బాలకృష్ణ(Balakrishna)తో కలిసి `అఖండ`(Akhanda) చిత్రంలో నటిస్తుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. శ్రీకాంత్‌, జగపతిబాబు విలన్‌ పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమా డిసెంబర్‌ 2న విడుదల కాబోతుంది. దీంతో సినిమాపై సర్వత్రా అంచనాలు నెలకొన్నాయి. పైగా ఈ రోజు(శనివారం) సాయంత్రం సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరగబోతుంది. దీనికి ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, రాజమౌళి గెస్ట్ లుగా వస్తున్నాయి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

సినిమా ప్రమోషన్‌లో భాగంగా Pragya Jaiswal మీడియాతో ముచ్చటిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బాలయ్యని పట్టుకుని మీరు మనిషేనా? అని అడిగేసిందట. తాజాగా ఈ విషయాన్ని ప్రగ్యా వెల్లడించింది. చిత్ర షూటింగ్‌లో ఈ సంఘటన చోటు చేసుకుందట. దీనిపై ప్రగ్యా చెబుతూ, బాలకృష్ణ తెల్లవారు జామున మూడు గంటలకే నిద్రలేచి 6 గంటల సమయానికి సెట్‌లో ఉంటారు. ఆయన ఎనర్జీ చూసి షాకయ్యేదాన్ని. ఓ సందర్భంలో `అసలు మీరు మనిషేనా?` అని ఆయన్ను సరదాగా అడిగా` అని చెప్పింది. అదన్నమాట విషయం. ఆయన ఎనర్జీ లెవల్‌ని చూసి ప్రగ్యా అలా అడిగిందట.

36

`అఖండ` సినిమాకి ఎంపిక కాకముందే వివిధ సందర్భాల్లో బాలకృష్ణగారిని కలిశా. కానీ, ఆయనతో నటిస్తున్నాననే విషయం తెలియగానే కాస్త భయపడ్డా. అంత సీనియర్‌ యాక్టర్‌ పక్కన నటించడమంటే సవాలే కదా. సెట్‌లో అడుగుపెట్టిన రోజే ఆయన నా టెన్షన్‌ పోగొట్టారు. బాలకృష్ణ ఎప్పుడూ పాజిటివ్‌గా ఉంటారు. క్రమశిక్షణ, సమయపాలన విషయంలో ఆయన చాలా స్ట్రిక్ట్‌. అలాంటి నటుడితో తెరను పంచుకోవడం ఆనందంగా ఉంది` అని చెప్పింది ప్రగ్యాజైశ్వాల్‌.

46

తన పాత్ర గురించి చెబుతూ, `కొవిడ్‌ లాక్‌డౌన్‌ తర్వాత నాకు ఈ అవకాశం వచ్చింది. తాను రాసుకున్న పాత్రలకు ఎవరు న్యాయం చేయగలరో వారినే ఎంపిక చేసుకుంటారు దర్శకుడు బోయపాటి శ్రీను. అలా నేనీ ప్రాజెక్టులో అడుగుపెట్టాను. ఆయనపై నాకున్న నమ్మకంతో కథను పూర్తిగా వినకుండానే ఈ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పా. నేనీ చిత్రంలో ఐఏఎస్‌ శ్రావణ్య అనే పాత్ర పోషించా. గతంలో ఎప్పుడూ చేయనటువంటిపాత్రలో కనిపిస్తాను. పాత్ర కోసం ఎంతో శ్రమించా.  సినిమాకే కీలకంగా నిలిచే పాత్ర అది. ఆ క్యారెక్టర్‌ చుట్టే కథ తిరుగుతుంది. ఆ పాత్రకు ఎదురైన కొన్ని సంఘటనల వల్ల కథానాయకుడి రెండో క్యారెక్టర్‌ `అఖండ` దర్శనమిస్తుంద`ని తెలిపింది. ఈ సినిమాతో తాను కమ్‌ బ్యాక్‌ అవుతానని ఆశాభావం వ్యక్తం చేసింది.
 

56

తన కెరీర్‌ గురించి చెబుతూ, `నా వరకు వచ్చిన కథల్లోంచి మంచి పాత్రల్ని ఎంచుకున్నా. కొన్ని ఫలితాల్నిచ్చాయి, కొన్ని ఇవ్వలేదు. ఫలితాలనేవి మన చేతుల్లో ఉండవు కదా. నేను మాత్రం మంచి కథలపై దృష్టిపెడుతూ, మంచి పాత్రల్ని ఎంచుకుంటూ వస్తున్నా. ఏడేళ్లుగా సాగుతున్న సినీ ప్రయాణం నాది. పనిని అర్థం చేసుకోవడానికి కొంచెం సమయం తీసుకున్నా. డిజిటల్‌ వేదికలా లేక సినిమానా? అని సంబంధం లేకుండా... మంచి కథలు, మంచి బృందంతో కలిసి ప్రయాణం చేయాలనేది నా ప్లాన్‌` అని వెల్లడించింది ప్రగ్యా. 

66

ఈ సందర్భంగా ఆమె గ్లామరస్‌గా ముస్తాబై మెరిసింది. క్లీవేజ్‌ లుక్‌లో అదరగొట్టింది. ప్రస్తుతం ప్రగ్యా లేటెస్ట్ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఇటీవల కూడా ప్రగ్యా తన ఘాటైన ఫోటోలని అభిమానులతో షేర్‌ చేస్తూ ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తుంది. 

also read: Sreemukhi: అనసూయకి షాకిస్తున్న శ్రీముఖి.. శ్రియాతో రాములమ్మ నాన్‌ స్టాప్‌ హంగామా.. యాంకర్ల రచ్చ అన్‌లిమిటెడ్‌

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Recommended image2
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image3
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved