- Home
- Entertainment
- Balayya Guest Role: విజయ్ దేవరకొండ కోసం బాలకృష్ణ రంగంలోకి.. పూరీ ప్రయత్నమంతా దానికోసమేనా?
Balayya Guest Role: విజయ్ దేవరకొండ కోసం బాలకృష్ణ రంగంలోకి.. పూరీ ప్రయత్నమంతా దానికోసమేనా?
రౌడీబాయ్ విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు పూరీ జగన్నాథ్ రూపొందిస్తున్న `లైగర్` పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతుంది. అయితే దీనికి సంబంధించిన బిగ్ సర్‌ప్రైజ్ ఒకటి ఫిల్మ్ నగర్ సర్కిల్‌లో వైరల్ అవుతుంది.

వరుస పరాజయాల్లో ఉన్న విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) హీరోగా `ఇస్మార్ట్ శంకర్`తో సక్సెస్ అందుకున్న పూరీ జగన్నాథ్ రూపొందిస్తున్న చిత్రం `లైగర్`(Liger). పాన్ ఇండియా సినిమాగా దీన్ని రూపొందిస్తున్నారు. బాలీవుడ్ నటి అనన్య పాండే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రపంచ ఛాంపియన్, మాజీ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని పూరీ,ఛార్మి, కరణ్ జోహార్‌లు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆగస్ట్ లో విడుదల కాబోతుంది.
ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది. విజయ్ దేవరకొండ బాక్సర్‌గా మేకోవర్ ఆకట్టుకుంటుంది. పర్‌ఫెక్ట్ బాక్సర్‌గా అదరగొడుతున్నారు. బాక్సింగ్ రింగ్‌లో ఆయన చేసే రచ్చ అంతా ఇంతా కాదని టీజర్‌ని బట్టి అర్థమవుతుంది. ప్రపంచ పాపులర్ గేమ్ `డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ` బాక్సింగ్ గేమ్ ఆధారంగా సినిమా సాగుతుందని తెలుస్తుంది. ఇందులో ముంబయిలో ఓ ఛాయ్ వాలా ఎలా ఛాంపియన్ బాక్సర్‌గా ఎదిగారు. ఈ క్రమంలో ఎలాంటి ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు. ఛాంపియన్‌గా నిలిచాడా? లేడా? అనేది సినిమా కథ అని టాక్.
సినిమా పూర్తిగా పూరీ జగన్నాథ్ మార్క్ లో ఉంటుందని టీజర్‌ని బట్టి అర్థమవుతుంది. పూరీ జగన్నాథ్ అంటే ఆయన సినిమాలో హీరో మాస్, బోల్డ్ నెస్, రఫ్‌నెస్, డేరింగ్ అండ్ డైనమిజంతో కూడి ఉంటాడు. సినిమా కథ కూడా అలానే సాగుతుంది. దీనికి విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ తోడైతే ఇక అది వెండితెరపై రచ్చ రచ్చే అనేలా ఉంటుందట. మొత్తానికి వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చే `లైగర్` నెక్ట్స్ లెవల్‌లో ఉంటుందని అంటున్నారు.
అదే సమయంలో కొంత టెన్షన్‌గానూ యూనిట్ ఉన్నారట. `గీతగోవిందం` తర్వాత విజయ్ దేవరకొండకి సక్సెస్ లేదు. `అర్జున్‌రెడ్డి`, `గీతగోవిందం` చిత్రాలతో వచ్చిన స్టార్‌డమ్‌తోనే కెరీర్‌ని లాక్కొస్తున్నారు. వరుసగా ఆయన నటించిన నాలుగు సినిమాలు ఫెయిల్ అయినా విజయ్ మేనియా, పాపులారిటీ తగ్గలేదు. అయితే దాన్ని ఎక్కువ కాలం సస్టేన్ చేయడం కూడా కష్టమే. అందుకే `లైగర్`పై చాలా ఫోకస్ పెట్టారు. ఎలాగైనా ఈ చిత్రంతో విజయ్ కి పాన్ ఇండియా లెవల్‌లో హిట్ ఇవ్వాలని పూరీ చూస్తున్నారు. అందుకే `లైగర్` విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారు.
అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ లీక్ సోషల్ మీడియాలో, ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా కోసం బాలయ్యని దించుతున్నారట. బాలకృష్ణతో ఓ గెస్ట్ రోల్ చేయిస్తున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయ్యిందనే టాక్ చక్కర్లు కొడుతుంది. అదే సినిమాలో సర్‌ప్రైజింగ్‌గా ఉంటుందని, బట్ కాసేపైనా హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం. ఇటీవల `అఖండ`తో సక్సెస్ అందుకుని జోరులో ఉన్నారు బాలకృష్ణ, ఆ జోరు, సక్సెస్ తాలుకూ ప్రభావం `లైగర్`కి హెల్ప్ అవుతుందని భావిస్తున్నారట. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.
విజయ్ దేవరకొండతో పూరీ జగన్నాథ్ మరో సినిమా చేయబోతున్నారు. `జనగణమన` ఆయనతోనే ఉంటుందనే టాక్ వినిపించింది. ఆ సినిమా ఉండాలంటే `లైగర్` సక్సెస్ కావాల్సిందే. అందుకోసమే చాలా స్పెషల్ కేర్ తీసుకుంటున్నారట. పైగా పూరీ తన కెరీర్‌లో అత్యధిక రోజులు షూట్ చేసిన చిత్రంగా `లైగర్` నిలుస్తుంది. పాన్ ఇండియా సినిమా అంటే ఆ మాత్రం టైమ్ తీసుకుంటుందని క్రిటిక్స్ అంటున్నారు. మరి `లైగర్` మెప్పిస్తాడా? విజయ్‌కి బాలయ్య హెల్ప్ అవుతాడా? అనేది చూడాలి. ఇందులో నిజనిజాలు పక్కన పెడితే ఈ వార్త అటు బాలయ్య ఫ్యాన్స్ కి, ఇటు విజయ్ ఫ్యాన్స్ కే కాదు, జనరల్ ఆడియెన్స్ కి కూడా ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తుండటం విశేషం.