MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Balakrishna Birthday: ఎన్టీఆర్ వారసుడు బాలయ్యకు ఎన్ని వందల కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా...!

Balakrishna Birthday: ఎన్టీఆర్ వారసుడు బాలయ్యకు ఎన్ని వందల కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా...!

సెలెబ్రెటీలకు సంబంధించిన ప్రతి సంగతి ఆసక్తికరమే. ఇక బాలయ్య లాంటి టాప్ హీరో వ్యక్తిగత విషయాలు తెలుసుకోవాలని అందరూ అనుకుంటారు. ఆయన ఫ్యాన్స్ కి అయితే ఈ ఆసక్తి మరింతగా ఉంటుంది. కాగా నటసింహం బాలయ్య ఆస్తుల విలువ ఎంత, ఆయన సినిమాకు ఎంత తీసుకుంటారో చూద్దాం..  

2 Min read
Author : Sambi Reddy
Published : Jun 10 2022, 05:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

నటుడిగా బాలయ్యది దాదాపు ఐదు దశాబ్దాల ప్రయాణం. 1974లో విడుదలైన తాతమ్మ కల మూవీతో బాలయ్య వెండితెరకు పరిచయమయ్యాడు. అప్పటికి ఆయన వయసు 14 ఏళ్ళు మాత్రమే. ఆయన సోలో హీరోగా నటించిన చిత్రం మాత్రం సాహసమే జీవితం(1984). హీరోగా మారిన మొదటి ఏడాదిలోనే బాలకృష్ణ 7 చిత్రాలు చేశారు. వీటిలో మంగమ్మగారి మనవడు ఇండస్ట్రీ హిట్ అందుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

తండ్రి వారసత్వం కొనసాగిస్తూ... బాలయ్య టాలీవుడ్ టాప్ హీరోగా ఎదిగారు. సుదీర్ఘ ప్రస్థానం లో అన్ని రకాల జోనర్స్ ట్రై చేశారు. సాంఘిక, పౌరాణిక, జానపద, సైన్స్ ఫిక్షన్, కామెడీ, యాక్షన్ వంటి విభిన్న జోనర్స్ లో చిత్రాలు చేశారు. అందుకే బాలకృష్ణను ప్రయోగాల హీరోగా చెప్తారు. 
 

37

వందకు పైగా చిత్రాలు చేసిన బాలకృష్ణ కెరీర్లో అనేక బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చారు. అలాగే ఆయన్ని దర్శకుల హీరో అంటారు. ఒక మూవీ ఒప్పుకుంటే దాన్ని పూర్తి చేసేవరకూ నిద్రపోరు. యూనిట్ ని బాలకృష్ణ పరుగులు పెట్టిస్తారు. ఈ పరిణామం, దర్శకులకు, నిర్మాతలకు మేలు చేస్తుంది. దర్శకుడిలో సత్తా ఉండాలే కానీ మూడు నెలల్లో మూవీ పూర్తి చేసేస్తాడు బాలకృష్ణ.

47

మరి ఇన్నేళ్ల కెరీర్ లో బాలకృష్ణ ఎంత సంపాదించారనే ఓ క్యూరియాసిటీ ఉంటుంది. స్టార్ గా ఎన్టీఆర్ దశాబ్దాల పాటు టాలీవుడ్ ని ఏలారు. ఈ క్రమంలో ఆయన కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించారు. ప్రముఖ నగరాల్లో ఇళ్ళు, థియేటర్స్, స్టూడియోలు కట్టించారు. పొలాలు, ఎస్టేట్స్ కొన్నారు.

57

అలా వారసత్వంగానే బాలకృష్ణకు చాలా ఆస్థి సంక్రమించింది. బాలయ్య నికర ఆస్థి విలువ రూ . 200 కోట్లకు పై మాటే. అలాగే లగ్జరీ కార్లు ఉన్నాయి. సినిమాకు బాలకృష్ణ రూ.. 10 నుండి 15 కోట్లు తీసుకుంటారు. బాలకృష్ణ కుటుంబానికి కొన్ని వ్యాపారాలు కూడా ఉన్నాయి. మొత్తం కలుపుకుంటే బాలయ్య ఆస్థి విలువ వేయి కోట్లు వరకు ఉండవచ్చు.

67

ఇక వరుస పరాజయాలతో ఇబ్బంది పడ్డ బాలకృష్ణ అఖండ మూవీతో మరపురాని విజయం సొంతం చేసుకున్నారు. రూ. 120 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టిన అఖండ భారీ లాభాలు పంచింది. ప్రస్తుతం ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 107వ చిత్రం చేస్తున్నారు. బాలయ్య బర్త్ డే కానుగా విడుదలైన ఫస్ట్ గ్లిమ్ప్స్ కి మంచి రెస్పాన్స్ దక్కింది.

77

కాగా స్టార్ గా కెరీర్ లో హైట్స్ చూసిన బాలయ్యకు ఒక్కటే నిరాశ. కొడుకు మోక్షజ్ఞను వెండితెరకు పరిచయం చేయాలి. ఓ స్టార్ గా నిలబెట్టాలి. చాలా కాలంగా బాలయ్య ఈ ప్రయత్నాల్లో ఉన్నారు. మోక్షజ్ఞ ఎంట్రీ మాత్రం కార్యరూపం దాల్చడం లేదు. ఫ్యాన్స్ సైతం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: చిరంజీవికి బిస్కెట్ వేయాల్సిన అవసరం నాకు లేదు.. రాంచరణ్, అల్లు అర్జున్ కాచుకుని కూర్చున్నారు
Recommended image2
Rashmika Mandanna: కాక్‌టెయిల్ 2.. దియా రెడ్డి పాత్రకు ఎమోషనల్ గుడ్‌బై చెప్పిన రష్మిక
Recommended image3
Epic Movie: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి రొమాన్స్ తో పెరిగిపోయిన అంచనాలు.. 'ఎపిక్' రిలీజ్ డేట్ ఇదేనా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved