మోక్షజ్ఞతో `ఆదిత్య 999`, ప్రకటించిన బాలకృష్ణ.. షూటింగ్, రిలీజ్, టైటిల్, క్రేజీ డిటెయిల్స్
బాలకృష్ణ క్రేజీ ప్రాజెక్ట్ ని ప్రకటించారు. కొడుకు మోక్షజ్ఞతో సినిమా చేయబోతున్నారు. `ఆదిత్య 369`కి సీక్వెల్‌ని తెరకెక్కించబోతున్నారు.
ఆదిత్యా 369
నందమూరి బాలకృష్ణ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రాలు, తన కెరీర్‌లో మైలురాలి లాంటి సినిమాల్లో `ఆదిత్య 369` ఒకటి. దీనికి సింగీతం శ్రీనివాస్ రావు దర్శకత్వం వహించగా, సోషియో ఫాంటసీ సైన్స్ ఫిక్షన్‌గా 1991లో ఈ మూవీ రూపొందింది. 33 ఏళ్ల క్రితం వచ్చిన ఈ మూవీ అప్పట్లోనే సంచలనం సృష్టించింది. అందరిని ఆశ్చర్యపరిచింది. బాలయ్యని నటుడిగా, హీరోగా స్టార్ ఇమేజ్ పరంగా పది మెట్లు ఎక్కించిన చిత్రమిది.
దీనికి సీక్వెల్ చేయాలని చాలా రోజులుగా అనుకుంటున్నారు బాలకృష్ణ. సింగీతం శ్రీనివాసరావు సినిమా చేయాలని ఉందని గతంలోనూ ప్రకటించారు. బాలయ్య కూడా పదే పదే చెప్పారు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా దీన్ని రూపొందిస్తానని అన్నారు. అంతేకాదు మోక్షజ్ఞని పరిచయం చేస్తూ సినిమా చేయాలని ఉందని, తానే దర్శకత్వం వహిస్తానని కూడా ఆయన చెప్పారు. తానే స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్టు కూడా తెలిపారు.
కానీ మోక్షజ్ఞని ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో పరిచయం చేయస్తున్నారు బాలయ్య. `సింబా` పేరుతో ఈ మూవీ రూపొందుతుంది. బాలయ్య చిన్న కూతురు తేజస్విని ఈ మూవీతో నిర్మాతగానూ పరిచయం కాబోతుంది. ఈ సినిమాకి సంబంధించిన పనుల్లో మోక్షజ్ఞ బిజీగా ఉన్నారు. త్వరలోనే ఈ సినిమా అధికారికంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కాబోతుందట. ఈ వారంలోనే ఉంటుందని సమాచారం.
ఇదిలా ఉంటే తాజాగా బాలయ్య తన డ్రీమ్ ప్రాజెక్ట్ ని ప్రకటించబోతున్నారట. `ఆదిత్య 369`కి సీక్వెల్‌గా `ఆదిత్య 999 మ్యాక్స్`ని రూపొందించబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని త్వరలోనే దీన్ని పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.
అంతేకాదు మోక్షజ్ఞ మెయిన్ హీరోగా ఈ సినిమాని తీయబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ విషయాన్ని బాలయ్య `అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే` షోలో ప్రకటించనున్నారట. ప్రస్తుతం నాల్గో సీజన్ `అన్ స్టాపబుల్` విజయవంతంగా రన్ అవుతున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, అల్లు అర్జున్, సూర్య, కంగువా టీమ్, లక్కీ భాస్కర్ టీమ్ సందడి చేసింది. ఇప్పుడు శ్రీలీలా, నవీన్ పొలిశెట్టి రచ్చ చేయబోతున్నారు. ఈ నెల 6న ఆరో ఎపిసోడ్ ప్రసారం కాబోతుంది. ఇందులో బాలకృష్ణ తన కొత్త ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేయబోతున్నారట. మోక్షజ్ఞతో `ఆదిత్య 999`ని తెరకెక్కించనున్నట్టు ఆయన ప్రకటించనున్నారట.
దీనికి సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించే స్థితిలో లేరు. దీంతో ఈ మూవీని బాలయ్యనే డైరెక్ట్ చేసే అవకాశం ఉందని సమాచారం. అంతేకాదు వచ్చే ఏడాదిలోనే దీన్ని విడుదల చేయాలనుకుంటున్నారట.
Daaku Maharaaj, balakrishna, bobby
ఇక ప్రస్తుతం బాలకృష్ణ `డాకు మహారాజ్` అనే సినిమాలో నటిస్తున్నారు. సరికొత్త కథ, కథనాలతో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు బాబీ. శ్రద్ధా శ్రీనాథ్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది. బాబీ డియోల్ నెగటివ్ రోల్ చేస్తున్నట్టు సమాచారం. దీనిపై క్లారిటీ రానుంది. ఇక ఇటీవల విడుదల చేసిన టీజర్ గూస్ బంమ్స్ తెప్పిస్తుంది.
యాక్షన్, థ్రిల్లర్, పీరియాడికల్ అంశాలు మతిపోయేలా ఉన్నాయి. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. సితార ఎంటర్టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ పూర్తయ్యింది. సంక్రాంతికి విడుదల కాబోతుంది.
read more:యష్మి మరోసారి ప్రేమలో పడిందా? అతని జాకెట్‌తో పబ్లిక్‌గా దొరికిపోయిన బిగ్ బాస్ కంటెస్టెంట్
also rea:21 ఏళ్లకే మాతృత్వం.. స్టార్ హీరోయిన్ శ్రీలీల గురించి తెలియని నిజాలు