- Home
- Entertainment
- సౌండ్ కంట్రోల్‌లో పెట్టుకోవాలంటూ బాలయ్య వార్నింగ్.. అఖండ 2 బ్లాస్టింగ్ రోర్ ఔట్
సౌండ్ కంట్రోల్‌లో పెట్టుకోవాలంటూ బాలయ్య వార్నింగ్.. అఖండ 2 బ్లాస్టింగ్ రోర్ ఔట్
బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న `అఖండ 2 ః తాండవం` మూవీ త్వరలో రాబోతుంది. తాజాగా `అఖండ 2ః బ్లాస్టింగ్ రోర్` పేరుతో గ్లింప్స్ ని విడుదల చేశారు. ఇది పూనకాలు తెప్పించేలా ఉంది.

`అఖండ 2` బ్లాస్టింగ్ గ్లింప్స్ ఔట్
నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ `అఖండ 2`. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. శివతత్వం ప్రధానంగా ఈ మూవీ రూపొందుతుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ గూస్ బంమ్స్ తెప్పించింది. అందులో అఘోర పాత్ర విశ్వరూపం చూపించారు. ఇప్పుడు మరో గ్లింప్స్ ని విడుదల చేవారు. ఇందులో బాలయ్య మరో పాత్రని ఆవిష్కరించారు. మొదటి భాగంలో బాలయ్య స్థానిక నాయకుడిగా, అఘోరగా కనిపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు స్థానిక నాయకుడి పాత్రకి సంబంధించిన గ్లింప్స్ ని విడుదల చేశారు. ఇది ఆద్యంతం కట్టిపడేస్తోంది. ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తోంది.
బాలయ్య మాస్ వార్నింగ్
ఇందులో బాలయ్య మరోసారి రెచ్చిపోయారు. యంగ్ లుక్‌లో అదరగొట్టారు. మొత్తం యాక్షన్ తోనే ఈ గ్లింప్స్ సాగింది. ప్రారంభంలో ఓ విలన్‌ని బాలయ్య తొక్కుతూ కనిపించారు. ఆ తర్వాత విలన్లు ఆయన్ని చుట్టుముట్టారు. కారులో ఆయన చుట్టూ సర్కిల్ కొడుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన బాలయ్య ఒక్కొక్కరి ఉతికి ఆరేశారు. అంతేకాదు విలన్‌ని పట్టికుని అదిరిపోయే మాస్ డైలాగ్ చెప్పారు. `సౌండ్ కంట్రోల్‌లో పెట్టుకో, ఏ సౌండ్‌కి నవ్వుతానో, ఏ సౌండ్‌కి నడుకుతానో నాకే తెలియదు కొడకా, ఊహకు కూడా అందదు` అని బాలయ్య ఇచ్చే వార్నింగ్ అదిరిపోయింది. అత్యంత పవర్‌ఫుల్‌గా ఈ గ్లింప్స్ సాగింది. యాక్షన్ సీన్లు, బాలయ్య పవర్‌ఫుల్ లుక్ అదిరిపోయింది. సినిమా వేరే లెవల్లో ఉండబోతుందని అర్థమవుతుంది.
`అఖండ 2`లో బాలయ్య ద్విపాత్రాభినయం
బాలయ్య ద్విపాత్రాభినయం చేసిన `అఖండ 2 ః తాండవం` డిసెంబర్ 5న విడుదల కాబోతుంది. ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో విడుదల చేస్తున్నట్టు ఇందులో ప్రకటించారు. గతంలోనూ బాలయ్య చిత్రాలను పాన్ ఇండియా లెవల్లో రిలీజ్‌కి ప్లాన్ చేశారు. కానీ తీర రిలీజ్ టైమ్‌లో డ్రాప్ అయ్యారు. కానీ ఇప్పుడు ప్రాపర్ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. శివతత్వం ప్రధానంగా రూపొందుతున్న మూవీ కావడంతో ఇది నార్త్ ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. అందుకే నార్త్ ఆడియెన్స్ ని దృష్టిలో పెట్టుకుని సినిమా గట్టిగా ప్లాన్ చేస్తున్నారట.
నిర్మాతగా బాలయ్య కూతురు తేజస్విని
14 రీల్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. బాలయ్య కూతురు తేజస్విని సమర్పకురాలిగా వ్యవహరిస్తోంది. ఆమె నిర్మాతగా మారిన తొలి చిత్రమిదే కావడం విశేషం. థమన్ సంగీతం అందిస్తున్నారు. `అఖండ 2`ని మించిన బీజీఎం ఉండబోతుందని, థమన్ బీజీఎంతోనే పూనకాలు తెప్పిస్తారని సమాచారం.