- Home
- Entertainment
- డేంజర్ జోన్‌లో ఆ కంటెస్టెంట్.. బిగ్ బాస్ తెలుగు 9 ఏడో వారం డబుల్ ఎలిమినేషన్, ఆమె మిడ్ వీక్ వాకౌట్ ?
డేంజర్ జోన్‌లో ఆ కంటెస్టెంట్.. బిగ్ బాస్ తెలుగు 9 ఏడో వారం డబుల్ ఎలిమినేషన్, ఆమె మిడ్ వీక్ వాకౌట్ ?
బిగ్ బాస్ తెలుగు 9 ఏడో వారం ఎలిమినేషన్‌కి సంబంధించిన ఆసక్తికర సమాచారం లీక్ అయ్యింది. ఈ వారం ఇద్దరు ఎలిమినేట్ కాబోతున్నారని సమాచారం. అందులో ఒకటి మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉందని సమాచారం.

ఇమ్మాన్యుయెల్ ఏడో వారం కెప్టెన్
బిగ్ బాస్ తెలుగు 9 ఏడో వారంలో బిగ్ బాస్ ఆడించిన డ్రామా ఆద్యంతం నవ్వులు పూయించింది. కెప్టెన్సీ టాస్క్ కోసం హౌజ్‌లో అందరిని దొంగలుగా మార్చిన వైనం అదిరిపోయింది. ఈ క్రమంలో ఏడో వారం కెప్టెన్సీ టాస్క్ లో ఇమ్యాన్యుయెల్ విన్నర్‌గా నిలిచాడు. అందులో తనూజ సపోర్ట్ తోనే ఆయన కెప్టెన్ కావడం విశేషం. అయితే ఈ వారం ఎలిమినేషన్‌కి సంబంధించి ఆశ్చర్యపరిచే విషయాలు లీక్ అవుతున్నాయి. ఏడో వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉందని సమాచారం. లేటెస్ట్ గా తెలుస్తోన్న సమాచారం మేరకు ఈ వారం హౌజ్‌లో ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయట.
ఆయేషా జీనత్ వాకౌట్
అందులో భాగంగా మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని సమాచారం. అయితే అది ఎలిమినేషన్ కాదు, వాకౌట్ అని తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా ఆయేషా జీనత్ ఆరోగ్యం బాగా ఉండటం లేదు. ఆమెని మెడికల్ రూమ్‌కి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు. థైరాయిడ్ కారణంగా ఆయేషా అనారోగ్యానికి గురైనట్టు సమాచారం. అయితే తాజాగా సమాచారం మేరకు ఆమె వాకౌట్ అయినట్టు తెలుస్తోంది. డాక్టర్ల సూచన మేరకు ఆయేషా హౌజ్‌ని వీడిందట. ఇది శుక్రవారం ఎపిసోడ్‌లో టెలికాస్ట్ కాబోతుందట. అయితే ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.
డేంజర్ జోన్‌లో రాము రాథోడ్
ఇంకోవైపు ఈ వారం ఎలిమినేషన్ విషయానికి వస్తే ఏడో వారం తనూజ, పవన్ కళ్యాణ్, రీతూ చౌదరీ, సంజనా గల్రాని, రాము రాథోడ్, దివ్య, రమ్య మోక్ష, శ్రీనివాస సాయి నామినేట్ అయ్యారు. వీరిలో కళ్యాణ్ ఓటింగ్‌లో టాప్‌లో ఉన్నారు. ఆ తర్వాత తనూజ రెండో స్థానంలో ఉంది. సంజనా మూడో స్థానంలో, రీతూ చౌదరీ నాల్గో స్థానంలో నిలిచింది. ఐదో స్థానంలో రమ్య ఉంది. నిన్నటి వరకు డేంజర్ జోన్‌లో ఉండగా, ఇప్పుడు ఆమె పుంజుకుంది. ఐదో స్థానానికి ఎగబాకింది. ఆ తర్వాత ఆరో స్థానంలో దివ్య, ఏడో స్థానంలో శ్రీనివాస సాయి, చివరగా రాము రాథోడ్ ఉన్నారు.
శ్రీనివాస సాయి కూడా డేంజర్లోనే
ఈ ఓటింగ్ ప్రకారం చూస్తే ఈ వారం రాము రాథోడ్ డేంజర్ జోన్‌లో ఉన్నట్టు సమాచారం. ఆయనతోపాటు శ్రీనివాస సాయి కూడా డేంజర్ జోన్‌లోనే ఉన్నారు. వీరి మధ్య ఓట్ల తేడా చాలా స్వల్పంగానే ఉంది. శుక్రవారం నమోదయ్యే ఓటింగ్‌ని బట్టి ఎవరు ఎలిమినేట్ అవుతారనేది తేలనుంది. ఆరో వారమే రాము రాథోడ్ డేంజర్‌లో ఉన్నాడు. ఇమ్మాన్యుయెల్ కారణంగా సేవ్ అయ్యాడు. మరి ఈ వారం కూడా డేంజర్ జోన్‌లో ఉండటం గమనార్హం. దీంతో ఆయన ఎలిమినేషన్ తప్పదా అనే చర్చ స్టార్ట్ అయ్యింది. మరి ఈ ఒక్క రోజు ఓటింగ్ ఏం చేయబోతుందో చూడాలి.
ఆరుగురు కంటెస్టెంట్లు వైల్డ్ కార్డ్ ఎంట్రీ
సెప్టెంబర్ 7న 15 మందితో ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు 9 ఆరు వారాలు పూర్తి చేసుకుని ఏడోవారం రన్ అవుతుంది. ఇప్పటి వరకు హౌజ్ నుంచి శ్రష్టి వర్మ, ప్రియా, మర్యాద మనీష్, హరీష్, ఫ్లోరా, భరణి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. అదే సమయంలో మధ్యలో దివ్య మిడ్ వీక్ ఎంట్రీ ఇచ్చారు. మరోవైపు వైల్డ్ కార్డ్ ద్వారా దివ్వెల మాధురి, రమ్య మోక్ష, ఆయేషా, గౌరవ్ గుప్తా, నిఖిల్ నాయర్, శ్రీనివాస సాయి ఎంట్రీ ఇచ్చారు. వీరిలో మాధురి, రమ్య, ఆయేషా కంటెంట్ ఇస్తున్నారు. ఎంటర్‌టైన్ చేస్తున్నారు. మిగిలిన వాళ్లు మరీ డల్ గా ఉండటం గమనార్హం.