- Home
- Entertainment
- పూరీ జగన్నాథ్‌తోపాటు అసిస్టెంట్‌గా చేసి స్టార్ అయిన హీరో ఎవరో తెలుసా? చిన్నప్పుడు ఇంటి నుంచి పారిపోయాడు
పూరీ జగన్నాథ్‌తోపాటు అసిస్టెంట్‌గా చేసి స్టార్ అయిన హీరో ఎవరో తెలుసా? చిన్నప్పుడు ఇంటి నుంచి పారిపోయాడు
పూరీ జగన్నాథ్‌తోపాటు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసి ఇప్పుడు సూపర్ స్టార్ అయ్యాడు ఒక రవితేజ. ఆయన చిన్నప్పుడు ఇంటి నుంచి పారిపోయాడట. మరి ఇంతకి ఏం జరిగిందంటే?

పూరీతోపాటు అసిస్టెంట్‌గా చేసి స్టార్ అయిన హీరో
పూరీ జగన్నాథ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్నారు. ఆయన దాదాపు అందరు స్టార్ హీరోలకు హిట్లు ఇచ్చారు. ప్రతి హీరో ఒక్కసారైనా పూరీతో చేయాలని కోరుకుంటున్నారు. ఆయన సినిమాల్లో క్యారెక్టరైజేషన్స్ ఆ రేంజ్‌లో పవర్‌ఫుల్‌గా, స్ట్రాంగ్ గా ఉంటాయి. అదే సమయంలో మాస్ హీరోగా ఎలివేట్ చేయడంలో పూరీ తర్వాతనే ఎవరైనా అనేలా ఉంటాయి. అయితే తనలాగే ఒక హీరో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసి ఆ తర్వాత స్టార్ హీరో అయ్యాడు. కానీ తనని మాత్రం నమ్మలేదట. ఆ విషయాలను పూరీ వెల్లడించారు.
పూరీతోపాటు అసిస్టెంట్‌గా చేసిన హీరో రవితేజ
పూరీ జగన్నాథ్ డైరెక్టర్ కావడానికి ముందు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు. ఎక్కువగా రామ్ గోపాల్ వర్మ వద్ద పనిచేసిన విషయం తెలిసిందే. అయితే తాను అసిస్టెంట్‌గా పనిచేసినప్పుడే ఓ హీరో కూడా అసిస్టెంట్‌గా పనిచేశాడు. పూరీ దర్శకుడు అయితే, ఆయన హీరో అయ్యాడు. ఇప్పుడు సూపర్ స్టార్‌గా ఎదిగాడు. ఆయన ఎవరో కాదు మాస్ మహారాజా రవితేజ. ఆయన కూడా అసిస్టెంట్‌గానే కెరీర్‌ని ప్రారంభించిన విషయం తెలిసిందే. `ప్రతిబంధ్`, `ఆజ్ కా గుండా రాజ్`, `క్రిమినల్` వంటి చిత్రాలకు అసిస్టెంట్గా చేశాడు. అలాగే కృష్ణవంశీ వద్ద `నిన్నే పెళ్లాడతా` వంటి పలు చిత్రాలకు అసిస్టెంట్గా చేశాడు. ఇతర దర్శకుల వద్ద కూడా అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసి నటుడిగా మారారు. ప్రారంభంలో `కర్తవ్యం`, `అభిమాన్యు`, `చైతన్య`, `కలెక్టర్ గారి అల్లుడు` వంటి చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేశారు. ఓ వైపు అసిస్టెంట్‌గా చేస్తూనే సినిమాల్లో నటిస్తూ వచ్చాడు రవితేజ. `సింధూరం` మూవీతో నటుడిగా మంచి గుర్తింపు దక్కింది. చాలా సినిమాల్లో స్మాల్ రోల్స్ చేస్తూ వచ్చిన ఆయన్ని శ్రీను వైట్ల `నీకోసం`తో హీరోని చేశాడు. ఆ తర్వాత రవితేజ `ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం`తో బిగ్ హిట్ అందుకున్నాడు. `ఇడియట్`తో బిగ్ బ్రేక్ అందుకున్నాక ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
పూరీ జగన్నాథ్‌ని నమ్మని రవితేజ
అయితే అసిస్టెంట్‌గా పనిచేసేటప్పుడు పూరీ జగన్నాథ్, రవితేజ మంచి స్నేహితులు. మాస్ రాజాలోని స్పార్క్, ఈజ్ చూసి వీడు ఎప్పటికైనా స్టార్ అవుతాడని అనుకునేవాడట పూరీ. అదే విషయం రవితేజతోనూ చాలా సార్లు చెప్పాడట. నువ్వు ఎప్పటికైనా స్టార్ అవుతావు, నీతో నేను సినిమా చేస్తా అని చెప్పాడట. అప్పుడు రవితేజ నమ్మేవాడు కాదట. మొదట పూరీజగన్నాథ్ `బద్రి` చిత్రంతో దర్శకుడిగా మారిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయ్యింది. అందరి చూపు పూరీపై పడింది. ఆయన ఆ వెంటనే` బాచి` చేశాడు. అలాగే కన్నడలో `యువరాజ్` సినిమా చేశారు. వరుసగా విజయాలు అందుకున్నారు. ఏడాది గ్యాప్ లోనే మూడు సినిమాలు పూర్తి చేశాడు. ఆ తర్వాత రవితేజ వద్దకు వచ్చాడు పూరీ. నీతో సినిమా చేస్తానని చెప్పాడట. అప్పుడు మాస్ మహారాజా షాక్. `పవన్ కళ్యాణ్‌తో సినిమా చేశాక, నాతో చేస్తానని అస్సలు ఊహించలేదు, నిన్ను నమ్మలేదు` అని అన్నాడట. ఆ తర్వాత ఇద్దరు కలిసి `ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం` సినిమా చేశారు. ఇది పెద్ద హిట్ అయ్యింది. రవితేజ అందరికి తెలిసేలా చేసింది. ఆ తర్వాత మాస్ మహారాజా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదని చెప్పొచ్చు.
పూరీ, రవితేజ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు
పూరీ, రవితేజ కాంబినేషన్‌లోనే మరో మూవీ వచ్చింది. అదే `ఇడియట్`. ఇది ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. అప్పట్లో యూత్‌ని ఊపేసిన మూవీ. రవితేజని స్టార్‌ని చేసిన మూవీ అని చెప్పొచ్చు. ఆ వెంటనే `అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి`తో మరో హిట్ అందుకున్నారు. వీరి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ హిట్ కొట్టారు. అనంతరం `నేనింతే`, `దేవుడు చేసిన మనుషులు` వంటి చిత్రాలు చేశారు. పూరీ ఎక్కువ సినిమాలు చేసింది రవితేజతోనే కావడం విశేషం.
ఇంటి నుంచి పారిపోయిన రవితేజ
ఇదిలా ఉంటే రవితేజ చిన్నప్పుడు చాలా అల్లరిగా ఉండేవాడట. సినిమాలంటే పిచ్చి. అమితాబ్ బచ్చన్ అంటే మరీ పిచ్చి. ఇంట్లో అమ్మా నాన్న లేని సమయంలో యాక్షన్ చేస్తుండేవాడట. చాలా స్టంట్లు చేసేవాడట. ఓ సారి ఫైర్‌తో స్టంట్ చేయగా, అది మిస్ ఫైర్ అయి ఇంట్లో సోఫాలకు నిప్పు అంటుకుందట. దీంతో బాగా బయపడి పోయాడట రవితేజ. ఎప్పుడూ స్కూల్ బంక్ కొట్టి సినిమాలు చూసేవాడట. ఒక సారి థియేటర్ వద్ద గొడవ అయ్యింది. ఈ విషయం ఇంట్లో తెలిసిందట. తమ్ముడు వచ్చి ఇంట్లో మ్యాటర్ లీక్ అయ్యిందని చెప్పడంతో ఇక లాభం లేదని చెప్పి ముంబై ట్రైన్ ఎక్కాడట రవితేజ. కొద్ది దూరం వెళ్లాక ఆకలేసి మధ్యలో దిగి తెల్లారి ఇంటికి వచ్చాడట. అప్పటికే అమ్మానాన్నకి కోపం తగ్గిపోయిందని, ఇంకా ఏమనలేదని తెలిపారు రవితేజ. యాంకర్ ప్రదీప్‌తో `కొంచెం టచ్ లో ఉంటే చెబుతా` టాక్ షోలో రవితేజ ఈ విషయాన్ని పంచుకున్నారు. అలాంటిది రవితేజ హీరో కావడం, సూపర్ స్టార్‌గా ఎదగడం విశేషం. ఆయన జర్నీ ఎంతో మందికి ఇన్‌స్పిరేషన్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం రవితేజ `మాస్ జాతర` చిత్రంలో నటించారు. భాను భోగవరపు దర్శకుడు. ఇందులో శ్రీలీల హీరోయిన్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగవంశీ నిర్మించారు. ఈ మూవీ ఈ నెల 31న విడుదల కానుంది.