బ్లాక్ డ్రెస్ లో బలగం బ్యూటీ బ్లాస్టింగ్ ఫోజులు, వైరల్ అవుతున్న కావ్య కళ్యాణ్ రామ్ పిక్స్
బలగం సినిమాతో దూసుకొచ్చింది యంగ్ హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్. బాల నటిగా మెప్పించిన ఈబ్యూటీకి.. హీరోయిన్ గా బలగం ఊపునిచ్చింది.
హీరోయిన్ గా తానేంటో నిరూపించుకునే పనిలో ఉంది బలగం బ్యూటీ కావ్య కళ్యాణ్ రామ్. బలగం ఇచ్చిన బలంతో.. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకుంటూ.. వరుస ఫోటోషూట్లతో అదరగొడుతోంది.
చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కావ్య కళ్యాణ్ రామ్. బాల నటిగా మెప్పించింది. గంగోత్రి లాంటి సినిమాల్లో ఆమె నటనకు జనాలు ఫిదా అయ్యారు. అలా చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. ఇక ప్రస్తుతం హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది కావ్య కళ్యాణ్ రామ్. మసూద సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది కావ్య.
మసూద సినిమాతో హీరోయిన్ గా మెప్పించింది కాని.. పెద్దగా అందరికి తెలియలేదు కావ్య. కాని ఆతరువాత జబర్థస్త్ కమెడియన్ వేణు డైరెక్షన్ లో వచ్చిన బలగం సినిమాతో హీరోయిన్ గా టర్న్ తీసుకుంది కావ్య కెరీర్. నిజానికి ఈ సినిమాలో ఆమె పాత్రకు పెద్దగా యాక్టింగ్ స్కోప్ లేకున్నా.. కావ్య పేరు మారుమోగింది.
ఇక ఈ చిన్నదానికి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఈ చిన్నదానికి క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయని తెలుస్తోంది. ఇక ఆక్రేజ్ ను పెంచుకోవడం కోసం.. సోషల్ మీడియాను గట్టిగా వాడేస్తోంది బ్యూటీ. వరుస ఫోటో షూట్లతో అదరగొడుతోంది. తాజాగా కావ్య ఇన్ స్టాలో పోస్ట్ చేసిన ఫోటో షూట్ కు మంచి రెస్పాన్వస్ వచ్చింది.
Kavya Kalyanram
తాజాగా కావ్య కళ్యాణ్ రామ్ బ్లాక్ కలర్ డ్రస్ లో బ్లాస్టింగ్ ఫోజులిచ్చింది. అదిరిపోయే ఫోటోలు షేర్ చేసింది. కుర్రకారు కిర్రెక్కించేలా ఉన్న ఆ పిక్స్ కు వరుసగా లైక్ లు కామెంట్లు వచ్చి పడుతున్నాయి.
అటు టాలీవుడ్ లో కూడా అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నట్టు తెలుస్తోంది. కాని కావ్య మాత్రం ఆచి తూచి అడుగులు వేస్తోంది. సినిమాల విషయంలో ఆమె సెలక్టీవ్ గా ఉన్నట్టు తెలుస్తోంది.