మహేంద్ర `బాహుబలి` చిన్నారి పాప ఇప్పుడెలా ఉందో తెలుసా?.. ఫోటోస్ వైరల్
`బాహుబలి` సినిమా దేశ వ్యాప్తంగా ఎంతటి సంచలనాలు క్రియేట్ చేసిందో తెలిసిందే. తెలుగు సినిమా సత్తాని ప్రపంచ వ్యాప్తం చేసింది. అయితే ఇందులో మహేంద్ర బాహుబలిగా నటించింది ఓ చిన్నారి కావడం విశేషం. తాజాగా ఆ చిన్నారి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
`బాహుబలి` సినిమాలో ఫస్ట్ వచ్చిన పోస్టర్ నీటిలో ఓ చెయ్యి, ఆ చేతిలో చిన్నారి ఉంటుంది. ఈ పోస్టర్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.
అంతా ఈ పోస్టర్ గురించే మాట్లాడుకున్నారు. ముఖ్యంగా చేతిలో చిన్నారి అనేది హాట్ టాపిక్‌గా మారింది.
ప్రభాస్ ఇందులో అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలిగా నటించారు. అమరేంద్ర బాహుబలి కొడుకు, మహేంద్ర బాహుబలిని తల్లి అయిన రాజమాత శివగామి అందరికి పరిచయం చేస్తుంది. కానీ రాజ్యంపై భల్లాలదేవ సేన కుట్ర చేసి ప్రభాస్‌ని చంపేస్తారు. ఆయన కుమారుడైన చిన్నారిని కూడా చంపాలని ప్లాన్ చేస్తారు.
ఈ విషయం తెలుసుకున్న రాజమాత తప్పించుకుని పారిపోతుంది. ఈ క్రమంలో నది కలువని దాటే క్రమంలో ఆమె కన్నుమూస్తుంది. అయినా ఆ చిన్నారిని రక్షిస్తుంది. ఈ సినిమా సినిమాలో హైలైట్‌గానిలిచింది.
అయితే ప్రభాస్‌కి చిన్ననాటి పాత్రలో నటించింది ఓ చిన్నారి కావడం విశేషం. ఆమె పేరు తన్వి(అక్షిత). అప్పటికీ ఆ పాప వయసు కేవలం 18 రోజులే.
కేవలం 18 రోజుల్లోనే భారతదేశం గర్వించదగ్గ పాత్రలో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది.
ఇదిలా ఉంటే తాజాగా ఆ పాప పెరిగింది. ఏడేళ్లకు చేరుకుంది. ప్రస్తుతం ఆ చిన్నారి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
తండ్రి చేతిలో ఉన్న ఆ చిన్నారి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి.
బాహుబలి టీమ్‌కి చెందిన ఎగ్జిక్యూటివ్ టీమ్‌కి చెందిన ఒకరి కూతురని తెలుస్తుంది.
క్యూట్ లుక్ లో ఆకట్టుకుంటుంది ఆ చిన్నారి తన్వి ఫోటోలు. ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ న్యూస్‌గా మార్చేసింది.
ప్రభాస్, రానా హీరోలుగా, అనుష్క, తమన్నా కథానాయికలుగా, రమ్యకృష్ణ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకి రాజమౌళి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఇది రెండు పార్ట్ లుగా విడుదలై సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఫస్ట్ పార్ట్ దాదాపు ఐదు వందల కోట్లు వసూలు చేయగా, రెండో భాగంగా 18వందల కోట్లు వసూలు చేసినట్టు టాక్.