MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • తూతూ మంత్రంగా ప్రమోషన్స్ చేస్తే అంతే.. సలార్ వసూళ్లు తగ్గడంపై బాహుబలి నిర్మాత కామెంట్

తూతూ మంత్రంగా ప్రమోషన్స్ చేస్తే అంతే.. సలార్ వసూళ్లు తగ్గడంపై బాహుబలి నిర్మాత కామెంట్

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ చిత్రం డిసెంబర్ 22న విడుదలైన అద్భుతమైన వసూళ్లు రాబడుతోంది. కెజిఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రం ఇది. పైగా ప్రభాస్ అభిమానులు బాహుబలి స్థాయి విజయం కోసం ఎదురుచూస్తున్నారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Dec 31 2023, 03:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ చిత్రం డిసెంబర్ 22న విడుదలైన అద్భుతమైన వసూళ్లు రాబడుతోంది. కెజిఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రం ఇది. పైగా ప్రభాస్ అభిమానులు బాహుబలి స్థాయి విజయం కోసం ఎదురుచూస్తున్నారు. సలార్ చిత్రంతో తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ మొదలైంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

ఈ క్రమంలో వరల్డ్ వైడ్ గా 1000 కోట్లు గ్యారెంటీ అనే అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ప్రస్తుతం కలెక్షన్స్ ట్రెండ్ చూస్తుంటే సలార్ చిత్రం 1000 కోట్ల క్లబ్ లో చేరే పరిస్థితి కనిపించడం లేదు. ప్రభాస్ ని ప్రశాంత్ నీల్ యాక్షన్ సన్నివేశాల్లో కళ్ళు చెదిరేలా ప్రజెంట్ చేశాడు. శృతి హాసన్, పృథ్వీరాజ్ అందరూ బాగా నటించారు. ప్రస్తుతం ఈ చిత్ర గ్రాస్ 600 కోట్ల వరకు ఉంది. 

37

అయితే కొన్ని ఏరియాల్లో బయ్యర్లకు లాభాలు రావడం కష్టం అనే టాక్ కూడా వినిపిస్తోంది. సలార్ తో పాటు రిలీజైన షారుఖ్ డుంకి కి నెగిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి. అయితే నార్త్ లో ఈ చిత్రం సలార్ కి గట్టి పోటీ ఇస్తోంది. ఓపెనింగ్స్ అదిరిపోయినప్పటికీ ఇలా సలార్ మూవీ బాక్సాఫీస్ వద్ద చల్లబడిపోవడానికి అనేక కారణాలు వినిపిస్తున్నాయి. 

47

దీనిపై బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోలార్ కలెక్షన్స్ డ్రాప్ కావడానికి తూతూ మంత్రంగా చేసిన ప్రమోషన్సే కారణం అని చెప్పారు. ఫిలిం మేకర్స్ తో జరిగిన ఓ రౌండ్ టేబుల్ సమావేశంలో  శోభు మాట్లాడుతూ సలార్ కలెక్షన్స్ తగ్గడానికి కారణం సరిగ్గా ప్రచార కార్యక్రమాలు నిర్వహించకపోవడమే అని అన్నారు. 

57

సలార్ నిర్మాతలు ముందుగానే ఖాన్సార్ ప్రపంచాన్ని ప్రేక్షకులకి పరిచయం చేసి ఉండాల్సింది. ఒక్కొక్క పాత్రని పరిచయం చేస్తూ ప్రచార కార్యక్రమాలు ఆసక్తికరంగా నిర్వహించి ఉండాల్సింది. అప్పుడే థియేటర్ కి వెళ్లిన ప్రేక్షకులు ఆ అంచనాలతో సినిమాని బాగా ఎంజాయ్ చేసేవారు. బాహుబలి మాహిష్మతి ప్రపంచాన్ని మేము అలాగే ప్రేక్షకులకు పరిచయం చేశాం అని అన్నారు. 

67
Salaar

Salaar

నేను కనుక సలార్ నిర్మాతని అయితే ఖాన్సార్ ప్రపంచాన్ని ప్రేక్షకులకు చెప్పాల్సిన విధంగా ముందే చెప్పేవాడిని అని అన్నారు. శోభు యార్లగడ్డ చెప్పిన విషయాల్లో వాస్తవం లేకపోలేదు అని నెటిజన్లు అంటున్నారు. సలార్ మేకర్స్ అసలు ఏమాత్రం ప్రచార కార్యక్రమాలు సరిగ్గా నిర్వహించలేదు. కనీసం ప్రీ రిలీజ్ ఈవెంట్ లేదు.. ప్రధాన నగరాలకు వెళ్లి చిత్రాన్ని ప్రమోట్ చేయలేదు. తూతూ మంత్రంగా రాజమౌళితో ఒక ఇంటర్వ్యూ మాత్రం చేశారు. 

77

అలాంటప్పుడు సినిమా గురించి ఎవరికైనా ఎలా తెలుస్తుంది. ప్రభాస్ కి ఉన్న పాన్ ఇండియా ఇమేజ్ తో ఆ మాత్రం వసూళ్లు అయినా దక్కాయి అని అంటున్నారు. ఇంకా సంక్రాంతి సినిమాలు రావడానికి 12 రోజుల సమయం ఉంది. ఈ లోగా సలార్ ఏ స్థాయి వసూళ్లు రాబడుతుందో చూడాలి. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
ప్రభాస్
ప్రశాంత్ నీల్

Latest Videos
Recommended Stories
Recommended image1
Sai Pallavi Crush: నా ఫస్ట్ క్రష్ అతనే.. సీక్రెట్ రివీల్ చేసిన సాయి పల్లవి
Recommended image2
Mothers Day : 20 ఏళ్లు పెద్ద హీరోలకు తల్లులుగా నటించిన స్టార్ హీరోయిన్లు
Recommended image3
Simran: హోటల్, టికెట్ల కోసం బేరాలాడతారు.. బాలీవుడ్‌పై సిమ్రాన్ సంచలన వ్యాఖ్యలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved