వావ్, మందార పువ్వులా అవికా గోర్ అందం చూశారా.. అయస్కాంతంలా లాగేస్తున్న యంగ్ బ్యూటీ
చిన్నారి పెళ్లికూతురు టీవీ సీరియల్ తో తెలుగువారిలో గుర్తింపు పొందింది అవికా గోర్. కాస్త వయసొచ్చాక హీరోయిన్ గా మారిపోయింది.
చిన్నారి పెళ్లికూతురు టీవీ సీరియల్ తో తెలుగువారిలో గుర్తింపు పొందింది అవికా గోర్. కాస్త వయసొచ్చాక హీరోయిన్ గా మారిపోయింది. ఉయ్యాలా జంపాల చిత్రంలో రాజ్ తరుణ్ తో కలసి చేసిన సందడి అంతా ఇంతా కాదు.
ఆ తర్వాత సినిమా చూపిస్తమావ , ఎక్కడికిపోతావు చిన్నవాడా లాంటి సూపర్ హిట్ చిత్రాలు అవికా గోర్ ఖాతాలో పడిపోయాయి. కానీ ఇటీవల అవికా గోర్ కి సరైన విజయం లేదు. ప్రస్తుతం అవికా కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. ఆ మూవీస్ పై అవికా చాలానే హోప్స్ పెట్టుకుని ఉంది.
ఈ చిన్నారి పెళ్లి కూతురు వెండితెరపై గ్లామర్ ఒలకబోసింది చాలా తక్కువ. హద్దుల్లోనే ఉంటూ క్యూట్ లుక్స్, నటనతో మెప్పిస్తూ వస్తోంది. ఇక రాజుగారి గది 3లో హర్రర్ రోల్ లో కూడా మెప్పించింది.
ఇప్పుడిప్పుడే అవికా గ్లామర్ పై ఫోకస్ పెట్టింది. వెండితెరపై గ్లామర్ గా కనిపించడం ఎంత అవసరమో గుర్తించింది ఈ బ్యూటీ. సోషల్ మీడియాలో వరుసగా గ్లామర్ పిక్స్ షేర్ చేస్తూ నెటిజన్లని ఊరిస్తోంది.
ఇప్పటి వరకు అవికా గోర్ చిలిపి పిల్లలా కనిపిస్తూ క్యూట్ నెస్ తో కట్టిపడేస్తూ వచ్చింది. దీనితో అవికా గోర్ తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. అయితే పరాజయాలు ఎక్కువ ఎదురుకావడంతో అవికా గోర్ హీరోయిన్ గా నెక్స్ట్ లెవల్ కు చేరుకోలేకపోయింది.
కానీ ఇప్పుడు మాత్రం అవికా తనలోని కొత్త యాంగిల్ ని బయట పెట్టింది. క్యూట్ గానే కాదు మతిపోగోట్టే హాట్ నెస్ తో కూడా అవికా కుర్రాళ్లని తనవైపు తిప్పుకుంటోంది. సినిమాల్లో గ్లామర్ రోల్స్ కి కూడా తాను సిద్దమే అన్నట్లుగా అవికా సంకేతాలు పంపుతోంది.
తాజాగా అవికా ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మందార పువ్వుల రెడ్ డ్రెస్ లో మెరిసిపోతూ.. కళ్ళు చెదిరే స్కిన్ టోన్ లో అవికా ఇస్తున్న ఫోజులు కిరాక్ అనే చెప్పాలి. అవికా గోర్ తాజాగా ఓంకార్ తెరకెక్కించిన మాన్షన్ 24 వెబ్ సిరీస్ లో నటించింది.