- Home
- Entertainment
- శ్రీను,సుధీర్ లేరు ఒంటరోడిని అయ్యాను, ఎవరితో స్కిట్ చేయాలి.. అందరిని కంటతడి పెట్టించిన ఆటో రామ్ ప్రసాద్
శ్రీను,సుధీర్ లేరు ఒంటరోడిని అయ్యాను, ఎవరితో స్కిట్ చేయాలి.. అందరిని కంటతడి పెట్టించిన ఆటో రామ్ ప్రసాద్
జబర్థస్త్ అంటే ఎవరికైనా వెంటనే గుర్తుకు వచ్చేది సుడిగాలి సుధీర్ టీమ్. ప్రస్తుతం ఆటీమ్ కనుమరుగు అవ్వడంతో ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. ఆటో రామ్ ప్రసాద్ ఒక్కడే ఉండటంతో తన స్నేహితులను తలుచుకుని ఎమోషనల్ అయ్యాడు, అందరిని కంటతడి పెట్టించాడు రామ్ ప్రసాద్.

దాదాపు పది సంవత్సరాలుగా జబర్థస్త్ నిర్విరామంగా నడుస్తుంటే.. అందులో దాదాపు 8 ఏళ్లుగా సుధీర్ టీమ్ అద్భుతాలు చేసుకుంటూ వచ్చింది. సుధీర్ రామ్ ప్రాసాద్, గెటప్ శ్రీను ఈ ముగ్గురు స్కిట్ లో ఉన్నారంటే ఫ్యాన్స్ కు పండగే. అందులో ఏ ఒక్కరు మిస్ అయినా.. ఆడియన్స్ వెల్తిగా ఫీల్ అయ్యేవారు.
సుడిగాలి సుధీర్ టీమ్ టీడర్ గా.. ఆటో రామ్ ప్రసాద్ రైటింగ్,పంచులు, గెటప్ శ్రీను యాక్టింగ్ తో స్కిట్ లు అదిరిపోయేవి. ముగ్గురి కాంబినేషన్ కు ఓ బ్రాండ్ ఉంది తెలుగు రాష్ట్రాల్లో.. కాని రాను రాను మారుతున్న పరిస్థితుల వల్ల.. ఒక్కొక్కరుగా జబర్థస్త్ ను వీడవల్సి వస్తోంది.
జబర్థస్త్ కు ఫిక్స్ గా ఉన్న నాగబాబు, రోజ ఒకరి తరువాత మరొకరు ఈ ప్రోగ్రామ్ కు దూరం అయ్యారు. ఆతరువాత చిన్నగా కంటెస్టెంట్స్ చాలామంది దూరం అవుతూ వస్తున్నారు. ప్రస్తుతం గెస్ట్ లు కూడా ఎవరు వస్తున్నారో.. ఎప్పుడు వెళ్తున్నారో తెలియని పరిస్థితి. ఈ క్రమంలో సుడిగాలి సుధీర్ తో పాటు, గెటప్ శ్రీను కూడా జబర్థస్త్ ను వదిలేశారు. అటు హైపర్ ఆది కూడా జబర్థస్త్ ను వదిలేశారు.
తన స్నేహితులు లేకపోయేసరికి ఆటో రామ్ ప్రసాద్ డల్ అయ్యాడు. ఇతర కంటెస్టెంట్స్ తో స్కిట్స్ చేస్తున్నా.. ఎన్నో ఏళ్ళుగా ఉన్న తన స్నేహితులు లేకపోయేసరికి రామ్ ప్రసాద్ ఎమోషనల్ అయ్యాడు. తన స్నేహితులను తలుచుకుని కంటినిడా నీళ్లు పెట్టుకు్న్నారు.
రీసెంట్ గా జబర్థస్త్ ప్రోమో రిలీజ్ అయ్యింది. అందులో రాకేష్,కార్తీక్ టీమ్ కలిసి సుధీర్ టీమ్ ఫ్రెండ్షిప్ గురించి ఓ స్కిట్ చేశారు. ఆ స్కిట్ తో అటు రామ్ ప్రసాద్ తో పాటు జర్జిలుగా ఉన్న ఇంద్రజ, యాంకర్ రష్మి, జబర్థస్త్ టీమ్ అంతా కన్నీటి పర్యంతం అయ్యారు. ఆతరువాత రామ్ ప్రసాద్ ఎమోషనల్ గా మాట్లాడాడు.
నేను రైటర్ ను కదా.... నాకు ఇబ్బంది లేదు అనుకున్నాను. కాని స్కిట్ అంటే నాఫ్రెండ్స్ గుర్తుకు వస్తున్నారు. ఒంటరోడిని అయ్యాను అన్న ఫీలింగ్ పెరిగిపోయింది అంటూ స్టేజ్ పైనే ఏడ్చేశాడు రామ్ ప్రసాద్. దాంతో ఇంద్రజ, స్టేజ్ మీదకు వెళ్లి దగ్గరకు తీసుకుని ఓదార్చింది.
అటు యాంకర్ రష్మితో పాటు అందరూ ఒక్క సారిగా ఎమోషనల్ అయ్యారు. రష్మీ స్కిట్ జరుగుతున్నంత సేపు ఏడుస్తూనే ఉంది. అటు టీమ్ మెంబర్స్ లో కూడా బాధ ఆవహించింది.
అంతే కాదు మీ టీమ్ కు దిష్టి తగిలినట్టుంది. అందుకే ఇంత మంచి టీమ ఇలా అయ్యింది అంటూ ఇంద్రజ ఏడుస్తూనే రామ్ ప్రసాద్ ను ఓదార్చే ప్రయత్నం చేసింది. మొత్తానికి జబర్థస్త్ ఎపిసోడ్ ఈసారి ఆడియన్స్ చేత కూడా కంటతడిపెట్టించేలా ఉంది.