- Home
- Entertainment
- యాంకర్ రష్మీపై ఆటో రాంప్రసాద్ వల్గర్ కామెంట్.. వేదికపైనే ఆ మాట, దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
యాంకర్ రష్మీపై ఆటో రాంప్రసాద్ వల్గర్ కామెంట్.. వేదికపైనే ఆ మాట, దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
జబర్దస్త్ లో ఆటో రాంప్రసాద్ తన పంచ్ డైలాగ్స్ తో సందడి చేస్తుంటాడు. జబర్దస్త్ లో బూతు కామెంట్స్, డబుల్ మీనింగ్ డైలాగులు ఎక్కువవుతున్నాయని ఇటీవల ఎక్కువగా విమర్శలు వినిపిస్తున్నాయి.

జబర్దస్త్ షో తో క్రేజీ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది రష్మీ గౌతమ్. బుల్లితెరపై రష్మీ యాంకరింగ్ చేస్తూ అప్పుడప్పుడూ నటిగా కూడా రాణిస్తూ ఉంది. ఒకప్పుడు రష్మీ, సుధీర్ రొమాన్స్ బుల్లితెరపై ఆడియన్స్ కి మంచి వినోదాన్ని అందించింది. రష్మీ జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో కూడా సందడి చేస్తోంది.
ఇక జబర్దస్త్ లో ఆటో రాంప్రసాద్ తన పంచ్ డైలాగ్స్ తో సందడి చేస్తుంటాడు. జబర్దస్త్ లో బూతు కామెంట్స్, డబుల్ మీనింగ్ డైలాగులు ఎక్కువవుతున్నాయని ఇటీవల ఎక్కువగా విమర్శలు వినిపిస్తున్నాయి. సుధీర్, హైపర్ ఆది ఈ విషయంలో గతంలో విమర్శలు ఎదుర్కొన్నారు.
ఇప్పుడు ఆటో రాంప్రసాద్ వివాదంలో చిక్కుకున్నాడు. కామెడీ పండించాలి, పాపులారిటీ పెంచుకోవాలి అనే తాపత్రయంలో స్కిట్ లలో హద్దులు మీరే డైలాగులు ఎక్కువవుతున్నాయి. ఫ్యామిలిలో చూసే కార్యక్రమాల్లో ఇలాంటి డైలాగులు పెడితే ఎలా అని విమర్శలు ఎక్కువవుతున్నాయి.
ఇటీవల జరిగిన శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ఆటో రాంప్రసాద్.. యాంకర్ రష్మీపై చేసిన వల్గర్ కామెంట్ ఇప్పుడు వివాదంగా మారింది. స్కిట్ లో భాగంగా ఆటో రాంప్రసాద్.. రష్మితో రాత్రికి వస్తావా అంటూ డబుల్ మీనింగ్ డైలాగ్ చెబుతాడు. అసలు నేనెందుకు రాత్రికి రావాలి అని రష్మీ అడుగుతుంది. దీనితో రాంప్రసాద్ అసభ్యకరంగా నైట్ కి ఎందుకు పిలుస్తారో తెలియదా నీకు ? అని అంటాడు.
పక్కనే ఉన్న ఇంద్రజ ఏయ్ అంటూ గట్టిగా అరవడంతో.. అదే మా ఊర్లో రాత్రికి జాతర ఉంది.. దానికి పిలుస్తున్నా అని కవర్ చేస్తాడు. ఇలా డబుల్ మీనింగ్ డైలాగులతోనే కామెడీ పండించాలా అంటూ రాంప్రసాద్ ని నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు.
ఇలా రాంప్రసాద్ ట్రోలింగ్ కి గురి కావడం ఇదే మొదటి సారి కాదు. గతంలో విష్ణు ప్రియ శరీరంపై, ముక్కుపై రాంప్రసాద్ చేసిన డబుల్ మీనింగ్ డైలాగులు వివాదం అయ్యాయి. అయినా కూడా రాంప్రసాద్ అదే పంథా కొనసాగిస్తున్నాడు అంటూ నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.