రామారావు ఆన్ డ్యూటీ థియేటర్స్ లో ఈలలు... రవితేజ కోసం కాదు ఈ క్రేజీ కపుల్ కోసం!
రామారావు ఆన్ డ్యూటీ మూవీ ఆడుతున్న థియేటర్స్ లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంటుంది. హీరోకి బదులు క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ కనిపించగానే ప్రేక్షకులు విజిల్స్ వేస్తున్నారట. ఈ పరిణామానికి గల కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు.

ramarao on duty
ప్రేక్షకుల విజిల్స్ అందుకుంటున్న ఆ ఆర్టిస్ట్స్ ఎవరో కాదు పవిత్ర లోకేష్, నరేష్. దర్శకుడు శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన రామారావు ఆన్ డ్యూటీ చిత్రం నేడు విడుదలైంది. ఈ మూవీలో నరేష్, పవిత్ర లోకేష్ నటించడం జరిగింది. వీరిద్దరూ అన్నా చెల్లెలు పాత్ర చేశారు.కాగా మీడియాలో ఈ మధ్య వీరి పేరు మారుమ్రోగగా... స్క్రీన్ పై ఈ జంటను చూసి జనాలు విజిల్స్ వేస్తున్నారు.
రామారావు ఆన్ డ్యూటీ(Ramarao Onduty) ప్రదర్శిస్తున్న చాలా థియేటర్స్ లో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు సోషల్ మీడియా కామెంట్స్ ద్వారా తెలుస్తుంది. నరేష్ తో ఆమె పెట్టుకున్న రిలేషన్ బయటపడే వరకు పవిత్ర లోకేష్ గురించి పెద్దగా తెలియదు. సాధారణ ప్రేక్షకులు ఆమెను గుర్తు పడతారు కానీ... పేరు కూడా తెలియదు. నెలల తరబడి సాగిన వివాదంలో ఆమె పేరు మీడియా కథనాల్లో ప్రముఖంగా వినిపించింది.
ఇటీవల నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ఓపెన్ గా తమ రిలేషన్ బయటపెట్టారు. కొన్నాళ్లుగా తాము సహజీవనం చేస్తున్నట్లు ఒప్పుకున్నారు. నరేష్, పవిత్ర మహారాష్ట్రలోని మహాబలేశ్వరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో ఈ జంట రహస్య వివాహం చేసుకున్నారన్న ప్రచారం జరిగింది. నరేష్ పెళ్లి వార్తలను ఖండించారు. మేము కలిసి జీవిస్తున్న మాట వాస్తవమే కానీ.. వివాహం చేసుకోలేదు అన్నారు.
మరోవైపు నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి దీనిని తీవ్రంగా ఖండిస్తున్నారు. తనకు చట్టబద్ధంగా విడాకులు ఇవ్వకుండా మరో మహిళలతో ఆయన ఎలా రిలేషన్ పెట్టుకుంటాడని ఆమె వాదిస్తున్నారు. నరేష్, పవిత్ర లోకేష్ మైసూర్ లోని ఓ హోటల్ గదిలో ఉన్నారన్న విషయం తెలుసుకున్న రమ్య అక్కడికి పోయి హైడ్రామా సృష్టించారు. హోటల్ గది నుండి బయటికి వస్తున్న నరేష్, పవిత్రల(Pavitra Lokesh)పై చెప్పుతో దాడి చేయ ప్రయత్నించారు.
నరేష్-పవిత్ర-రమ్య ల ట్రైయాంగిల్ ఫ్యామిలీ డ్రామా రోజుల తరబడి సాగింది. మీడియాలో పతాక శీర్షికలకు ఎక్కింది. దీంతో నరేష్, పవిత్ర లోకేష్ ల రహస్య బంధం బట్టబయలైంది. గతంలో నరేష్, పవిత్రలపై ప్రేక్షకుల్లో ఉన్న అభిప్రాయం వేరు, ప్రస్తుతం ఉన్న అభిప్రాయం వేరు. పవిత్ర లోకేష్ అంటే ఓ పద్ధతి గల తల్లి, అత్త, పిన్ని గానే తెలుసు . ఆమె వెండితెరపై అలాంటి పాత్రలు మాత్రమే చేశారు.
సడన్ గా ఆమెలోని కొత్త కోణం బయటపడడంతో ప్రేక్షకులు వెండితెరపై చూసి డిఫరెంట్ గా ఫీల్ అవుతున్నారు. దాని ప్రభావంతోనే రామారావు ఆన్ డ్యూటీ మూవీ థియేటర్స్ లో నరేష్, పవిత్రలను చూసి విజిల్స్ వేస్తున్నారు. ఇక ఈ మూవీలో నరేష్, పవిత్ర అన్నా చెల్లిగా కనిపించడం విశేషం. ఆ క్రేజీ కపుల్ ని అన్నా చెల్లిగా చూపించాలని నీకు ఎలా అనిపించిందని దర్శకుడు శరత్ పై కూడా సెటైర్స్ పేలుతున్నాయి.