MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • 23 ఏళ్లకే 250 కోట్ల సంపాదన: జన్నత్ జుబైర్ క్రేజ్ నెక్ట్స్ లెవెల్

23 ఏళ్లకే 250 కోట్ల సంపాదన: జన్నత్ జుబైర్ క్రేజ్ నెక్ట్స్ లెవెల్

చిన్న వయసులోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జన్నత్ జుబైర్, బాలీవుడ్ కింగ్ షారుఖ్ కంటే ఎక్కువ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్‌ను కలిగి ఉంది. టీవీ షోలలో నటిగా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా రాణిస్తున్న జన్నత్, అధిక పారితోషికం తీసుకునే నటీమణుల్లో ఒకరు.

2 Min read
Author : Galam Venkata Rao
| Updated : Jan 24 2025, 11:08 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
11

తక్కువ సమయంలో కోట్లు సంపాదించే రంగాల్లో క్రీడలు, సినిమాలు మొదటి స్థానంలో ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతో మంది నటీనటులు అత్యంత తక్కువ సమయంలో కోటీశ్వరుల జాబితాలో చేరారు. మరీ ముఖ్యంగా హీరోయిన్లు ఈ జాబితాలో ముందు వరుసలో ఉంటారు. అలాంటి ఒక నటీమణి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చిన్న వయసులోనే తన అద్భుత నటనతో నేషనల్ వైడ్‌గా క్రేజ్‌ సంపాదించుకున్న ఈ చిన్నది అనతి కాలంలోనే ఆకాశమంత క్రేజ్ సొంతం చేసుకుంది.

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వారికి జన్నత్ జుబైర్ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సోషల్‌ మీడియా భారీ క్రేజ్‌ సంపాదించుకున్న ఈ చిన్నది పలు టీవీ సీరియల్స్‌లో కూడా నటించింది. తన అందంతో మాత్రమే కాకుండా ఫ్యాన్‌ ఫాలోయింగ్ విషయంలో కూడా తగ్గేదేలే అన్నట్లు దూసుకుపోతోందీ చిన్నది. టీవీ షోలలో మాత్రమే కాకుండా సోషల్‌ మీడియా ఇన్‌ప్లుయెన్సర్‌గా కూడా మంచి పేరును సంపాదించుకుందీ చిన్నది. 

ఎంతలా ఉంటే ఏకంగా షారుఖ్‌ ఖాన్‌నే దాటేసింది. జన్నత్ జుబైర్ ఫాలోవర్స్ విషయంలో బాలీవుడ్ కింగ్‌ను మించిపోయింది. షారుక్‌కి ఇన్‌స్టాగ్రామ్‌లో 46 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. కానీ, జన్నత్ జుబైర్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 49.7 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అంటే షారుఖ్ కంటే జన్నత్ ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ.

ఇక జన్నత్‌ కెరీర్ విషయానికొస్తే.. ఈ బ్యూటీ 2001 ఆగస్టు 29న ముంబైలో జన్మించింది. టీవీ షోలలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆమె మొదటి టీవీ షో 2008లో 'చాంద్ కే పర్ చలో'. దీని తర్వాత, ఆమె 'దిల్ మిల్ గయే', 'కాశీ: అబ్ నా రహే తేరా కాగ్ కోరా', 'ఫుల్వా', 'మహారాణా ప్రతాప్', 'తు ఆషికి', 'ఫియర్ ఫైల్స్' వంటి టీవీ షోస్ లలో యాక్ట్ చేసింది. అలాగే రాణి ముఖర్జీ నటించిన 'హిచ్కీ' చిత్రంలో కూడా ఈ అందాల తార తళుక్కుమంది. జన్నత్ అనేక రియాల్టీ షోలలో కూడా పనిచేసింది.

'ఫియర్ ఫ్యాక్టర్ ఖత్రోన్ కే ఖిలాడీ 12', 'లాఫ్టర్ చెఫ్' షోలలో ఆమె కనిపించింది. 'ఖత్రోన్ కే ఖిలాడీ' షోలో జన్నత్ అత్యధిక పారితోషికం పొందిన కంటెస్టెంట్. ఒక్కో ఎపిసోడ్‌కు 18 లక్షలు తీసుకుంది. అలాగే 'నవ్వు చెఫ్'లో ఒక్కో ఎపిసోడ్‌కి ఆమె రూ.2 లక్షల రెమ్యునరేషన్‌ను అందుకుంది. ఆమె ఒక్కో పోస్టుకు 1.5 నుంచి 2 లక్షల రూపాయలు వసూలు చేస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

About the Author

GV
Galam Venkata Rao
వెంకట్ 8 సంవత్సరాలకు పైగా ప్రింట్, టెలివిజన్, డిజిటల్ మీడియా రంగాల్లో అనుభవం కలిగిన జర్నలిస్ట్. ఈనాడులో జర్నలిజం ప్రయాణాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో వీడియో - సోషల్ మీడియా విభాగాలను పర్యవేక్షిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Ranabaali Release Date: రణబాలి మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌.. విజయ్‌ దేవరకొండ, రష్మికకి అసలైన పండగ
Recommended image2
Irumudi Controversy: వివాదంలో రవితేజ 'ఇరుముడి' సినిమా.. టీచర్ల నుంచి తీవ్ర అభ్యంతరం, ఎందుకంటే?
Recommended image3
Chiranjeevi: చిరంజీవి హీరో కావడానికి కారణమైన సూపర్‌ స్టార్‌ ఎవరో తెలుసా? ఆ ఒక్క మాటతో మెగాస్టార్‌ లైఫే మారిపోయింది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved