ప్రభాస్ ని ఇరకాటంలో పెట్టిన టాప్ ప్రొడ్యూసర్.. ఇక పెళ్ళెప్పుడు జరుగుతుంది ?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రతి ఏడాది రెండు మూడు భారీ చిత్రాలతో బిజీగా ఉండాల్సి వస్తోంది. బాహుబలి మొదలైనప్పటి నుంచి ప్రభాస్ కి తీరిక అనేది లేదు. ప్రతి చిత్రం పాన్ ఇండియా చిత్రమే. వందల కోట్ల బడ్జెట్ తో ముడిపడి ఉంటుంది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రతి ఏడాది రెండు మూడు భారీ చిత్రాలతో బిజీగా ఉండాల్సి వస్తోంది. బాహుబలి మొదలైనప్పటి నుంచి ప్రభాస్ కి తీరిక అనేది లేదు. ప్రతి చిత్రం పాన్ ఇండియా చిత్రమే. వందల కోట్ల బడ్జెట్ తో ముడిపడి ఉంటుంది. ప్రభాస్ గత ఏడాది కల్కి చిత్రంతో తిరుగులేని బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ ఏడాది ప్రభాస్ రెండు భారీ చిత్రాలకు కమిటయ్యారు.
అందులో ఒకటి హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజి చిత్రం కాగా మరొకటి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కబోయే స్పిరిట్ చిత్రం. ఈ రెండు చిత్రాలు భారీ బడ్జెట్ లో రూపొందనున్నాయి. ఫౌజి చిత్రం అయితే పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది. సలార్ 2 ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. ఎందుకంటే ప్రశాంత్ నీల్ కి ఎన్టీఆర్ తో కమిట్మెంట్ ఉంది.
ఇంతలో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ లో ఒకరైన అశ్విని దత్ ఊహించని కామెంట్స్ చేశారు. కల్కి 2 చిత్రం జూన్ నుంచి షూటింగ్ ప్రారంభం అవుతుందని ప్రకటించారు. కల్కి చిత్రాన్ని నాగ్ అశ్విన్ అంతర్జాతీయ ప్రమాణాలతో కళ్ళు చెదిరే విజువల్ వండర్ గా తీర్చిదిద్దారు. కల్కి ఘనవిజయం సాధించింది. ఇక కల్కి 2 ఏ రేంజ్ లో ఉండబోతోందో ఊహించుకోవచ్చు. అలాంటి కల్కి 2 చిత్రాన్ని కూడా ఈ ఏడాదే ప్రారంభిస్తారట.
అంటే ప్రభాస్ ఈ ఏడాది 3 పాన్ ఇండియా చిత్రాల్లో నటించాల్సి ఉంటుంది. ప్రభాస్ కి ఇది ఊహించని షాక్ అని చెప్పొచ్చు. మూడు పాన్ ఇండియా చిత్రాలని మేనేజ్ చేయడం అంత సులువు కాదు. ఇటీవల ప్రభాస్ ఈ ఏడాదే పెళ్లి చేసుకోబోతున్నాడు అని.. గణపవరం కి చెందిన అమ్మాయితో మ్యాచ్ ఫిక్స్ అయిందని వార్తలు వచ్చాయి. 3 పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉంటే ఇక పెళ్లి చేసుకునే టైం ఎక్కడుంటుంది అటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సెటైర్లు మొదలు పెట్టారు. మొత్తంగా అశ్విని దత్ ప్రభాస్ కి క్షణం తీరిక లేకుండా చేసి ఇరకాటంలో పెడుతున్నారు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.