Nayanthara : నయనతార - విఘ్నేశ్ శివన్ పెళ్లి... వేణు స్వామి చెప్పినట్టే జరుగుతుందా!
స్టార్ హీరోయిన్ నయనతార (Nayanthara) వివాహ బంధంపై ప్రముఖ జ్యోతిష్యుడు వ్యాఖ్యలు నిజమవుతాయా? అనే ఆందోళన నెలకొంది. నయన్ చేసిన పనికి ఇప్పుడు ఆయన మాటలు వైరల్ గా మారాయి.

స్టార్ హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సౌత్ ఇండస్ట్రీలో ఈమెకు ఉన్న క్రేజ్ అలాంది. ఎందరో స్టార్ హీరోల సరసన నటించిన మెప్పించింది. ఇప్పటికీ భారీ చిత్రాల్లో నటిస్తోంది.
కెరీర్ విషయంలో నయన్ దుమ్ములేపుతున్న విషయం తెలిసిందే. కానీ వ్యక్తిగత విషయాలే కాస్తా ఆందోళనకరంగా మారాయి. ముఖ్యంగా నయనతార వివాహ బంధంపై మరింత ఆసక్తి నెలకొంది.
2022 జూన్ 9న నయనతార కోలీవుడ్ దర్శకుడు విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan)ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి (Venu Swamy) సంచలన వ్యాఖ్యలు చేశారు.
Venu Swamy
ఆయన గతంలో నయనతార వివాహ బంధం గురించి మాట్లాడుతూ... ‘వారిద్దరు పెళ్లి చేసుకుంటే జాతకాల ప్రకారం చాలా కష్టాలు పడుతారు. నష్టాలు జరుగుతాయి. విడిపోయే ప్రమాదం కూడా ఉంది.’ అని పేర్కొన్నారు.
ఇక సరిగ్గా నయనతార పెళ్లి తర్వాత జీవితం అంత సాఫీగా ఏం సాగలేదు. పిల్లల్ని సరోగసి ద్వారా కనడం.. ఆ తర్వాత పలు వివాదాలు, కేసులను ఎదుర్కుంది. ఇక రీసెంట్ గా భర్త విఘ్నేశ్ ను సోషల్ మీడియాలో అన్ ఫాలో చేయడం సంచలనంగా మారింది.
అయితే.. అది పొరపాటున జరిగినట్టు ఉందని తెలుస్తోంది. ఏదేమైనా గతంలో వేణు స్వామి చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. సమంత విషయంలో ఆయన చెప్పినట్టే జరగడంతో ఇప్పుడు నయనతార విషయంలోనూ అలాగే జరుగుతుందా? అనే ఆందోళన నెలకొంది.