బాలీవుడ్ లో మరో వేణు స్వామి, సల్మాన్, షారుఖ్ మరణం ఆరోజే అంటూ జోస్యం, మండిపడుతున్న నెటిజన్లు
టాలీవుడ్ లో వేణు స్వామిలాగే.. బాలీవుడ్ లో కూడా ఓ వేణుస్వామి హడావిడి చేస్తున్నాడు. స్టార్ హీరోల మరణాల గురించి జోస్యం చేపుతున్నాడు. అతను చెప్పిన జాతకం ప్రకారం సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ మరణం ఎప్పుడో తెలుసా?

అయ్యో, ఇదేం భవిష్యత్తు అని కంగారు పడుతున్నారా? ఓ పేరుమోసిన జ్యోతిష్యుడు స్టూడియోలో కూర్చొని స్టార్ హీరోల మరణం గురించి అలవోకగా చెప్పేస్తున్నాడు. అతను చెప్పిన జాతకం ప్రకారం షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ చనిపోయే వయస్సు దగ్గరలోనే ఉంది. అంతే కాదు సైఫ్-కరీనా విడాకులు తీసుకుంటారంటూ మరో బాంబ్ పేల్చిన బాలీవుడ్ వేణు స్వామి ఎవరు? ఇంకా ఏం చెప్పాడు.

ఇండియన్ సూపర్ స్టార్లైన సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ ఇద్దరూ మంచి స్నేహితులు, మంచి మంచి సినిమాలు చేస్తూ బాలీవుడ్ కు రెండు కళ్లలా ఉన్నారు. వాళ్ళని చూస్తే అరవై ఏళ్ళ దగ్గరలో ఉన్నారంటే ఎవ్వరూ నమ్మరు. ప్రేక్షకులను అలరిస్తూ, యంగ్ హీరోల్లా మెరిసిపోతున్నారు.
ఇక ఈ టైమ్ లోనే ఈ ఇద్దరి జాతకాల గురించి షాకింగ్ న్యూస్ వెల్లడించాడు ఒక జ్యోతిష్యుడు, వాళ్ళిద్దరి చావు గురించి జోస్యం చెప్పాడు. ఇంతకీ ఆయన ఎవరో కాదు సుశీల్ కుమార్ సింగ్. సిద్ధార్థ్ కణ్ణన్ ఇంటర్వ్యలో మాట్లాడినప్పుడు, సుశీల్ కుమార్ సింగ్ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఎప్పుడు చనిపోతారో చెప్పాడు.
షారుఖ్, సల్మాన్ ఇద్దరికీ 2025 ఎలా ఉంటుందని యాంకర్ అడిగారు. దానికి జ్యోతిష్యుడు బదులిస్తూ, “షారుఖ్ ఖాన్ టైమ్ బాగుంది. కానీ సల్మాన్ ఖాన్ టైమ్ మాత్రం బాలేదు అన్నారు. 2025, 2026, 2027 లో ఆయనకు టైమ్ బాలేదు. వాళ్ళిద్దరి మధ్య ఒక పోలిక ఉంది. సల్మాన్‌కి పెద్ద జబ్బు ఉందని తెలుస్తుంది. నేను దాని పేరు కూడా చెప్పను. సల్మాన్, షారుఖ్ ఖాన్ ఒకే ఏడాదిలో చనిపోతారు. 67 ఏళ్ల వయస్సులో వాళ్ళు ఈ లోకాన్ని వదిలేస్తారు” అని అన్నాడు. ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
సల్మాన్ జాతకంలో ఒక జబ్బు ఉందని నాకు ఆ జాతకంలో కనిపిస్తుంది. అది నయం చేయలేని జబ్బు. సల్మాన్ చివరి రోజులు చాలా దారుణంగా ఉంటాయి అని అన్నాడు. అయితే అందరు ఆ వింత జబ్బును క్యాన్సరేమో అని అనుకుంటున్నారు. ఇవి మాత్రమే కాదు సైఫ్ అలీఖాన్ మీద దాడి గురించి అడగగా.. “నేను 2010లోనే ఈ విషయం చెప్పాను దాడి జరుగుతందని, అంతే కాదు సైఫ్-కరీనా పెళ్లి నిలబడదు అని నా బ్లాగ్‌లో రాశాను. వీళ్ళ విషయం ఒకటిన్నర సంవత్సరంలో విడాకులు తీసుకునే ఛాన్స్ ఉంది అన్నాడు.
టాలీవుడ్ లో కూడా వేణు స్వామి సంచలన జ్యోతీష్యం గురించి అందరికి తెలిసిందే. ఇక సుశీల్ కుమార్ ను బాలీవుడ్ వేణు స్వామిగా చెప్పుతున్నారు జనాలు. అంతే కాదు ఈ జ్యోతీష్యుడిపై నెటిజన్లు మండిపడుతున్నారు. "మంచి జ్యోతిష్యులు ఎప్పుడూ ఒక మనిషి చావు గురించి మాట్లాడరు" అని ఒక నెటిజన్ అనగా.. . "భయంకరమైన భవిష్యత్తు. కానీ ఇతన్ని నమ్మడం ఎలా?" అని ఇంకొకరు కామెంట్ చేశారు. మరొక యూజర్, "మా తాతయ్య జ్యోతిష్యుడు. జ్యోతిష్యుడి మొదటి రూల్ ఏంటంటే మనిషి చావు గురించి ఎప్పుడూ చెప్పకూడదు. సుశీల్ కుమార్ చెబుతున్నది విచిత్రంగా ఉంది" అని కామెంట్ చేశారు.
ఒక యూజర్, "అన్ని నెగెటివ్ విషయాలు నిజం కానవసరం లేదు అని నేను అనుకుంటున్నాను. పెద్దవాళ్ళ, మంచి కోరుకునే వాళ్ళ ప్రార్థనలు, ఆశీర్వాదాలు మార్పు తీసుకురావచ్చు. దేవుడు దయగలవాడు" అని అన్నారు. "ఇతరుల చావు గురించి చెప్పే ఈ జ్యోతిష్యుడికి తన చావు ఎప్పుడో తెలుసా?" అని ఇంకొకరు ప్రశ్నించారు. "ఈయన మాటలను బాండ్ పేపర్‌లో రాయించుకోవాలి, అది నిజం కాకపోతే ఇతన్ని జైలుకి పంపించాలి. అబద్ధం చెప్పే జ్యోతిష్యులకు ఇది గుణపాఠం కావాలి" అని ఇంకొక నెటిజన్ కామెంట్ చేయడం విశేషం.