MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • గ్రాండ్ గా అషురెడ్డి బర్త్ డే పార్టీ... హాజరైన బిగ్ బాస్ సెలెబ్రిటీలు వైరల్ గా ఫోటోలు!

గ్రాండ్ గా అషురెడ్డి బర్త్ డే పార్టీ... హాజరైన బిగ్ బాస్ సెలెబ్రిటీలు వైరల్ గా ఫోటోలు!

జూనియర్ సమంత అషురెడ్డి బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ పార్టీలో బిగ్ బాస్ సెలెబ్రిటీలు, బుల్లితెర తారలతో పాటు కుటుంబ సభ్యులు, సన్నిహితులు పాల్గొన్నారు.  

2 Min read
Author : Sambi Reddy
Published : Sep 16 2022, 01:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Ashureddy

Ashureddy

సెప్టెంబర్ 15న అషురెడ్డి బర్త్ డే. నిన్న రాత్రి అషురెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ బర్త్ డే పార్టీకి బిగ్ బాస్ బ్యాచ్ మొత్తం హాజరయ్యారు. అరియనా, అఖిల్ సార్థక్, సీరియల్ నటుడు అమర్ దీప్ చౌదరితో పాటు పలువురు బుల్లితెర సెలెబ్రిటీలు పాల్గొన్నారు. 

27
Ashureddy

Ashureddy

అషురెడ్డి బర్త్ వేడుకలకు సంబంధించిన ఫోటోలు అరియనా తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేశారు. దీంతో అషురెడ్డి బర్త్ డే పిక్స్ వైరల్ గా మారాయి. ఇక పార్టీలో అషురెడ్డి బ్లాక్ కలర్ మిడ్డీ ధరించింది. ఈ పార్టీలో అందరూ ఫుల్ గా ఎంజాయ్ చేసినట్లు తెలుస్తుంది. 

37
Ashureddy

Ashureddy


ఈ బర్త్ డేకు ఆమెకు ఖరీదైన బహుమతి దక్కింది. మెర్సిడెజ్ బెంజ్ కోప్ ని ఆమెకు బహుమతిగా ఇచ్చారు. ఈ మోడల్ ధర రూ. 72 లక్షలకు పైగా ఉంది. ఇకపై అషురెడ్డి లగ్జరీ కారులో చక్కర్లు కొట్టనుంది. ఆ వైట్ లగ్జరీ కార్ పక్కన స్టైలిష్ ఫోజులిస్తూ అషురెడ్డి నిల్చుంది. 

47
Ashureddy

Ashureddy

ఆ ఖరీదైన గిఫ్ట్ అషురెడ్డికి వాళ్ళ నాన్న ఇచ్చారు. ఆ విషయాన్ని అషురెడ్డి స్వయంగా తెలియజేసింది. ఇంస్టాగ్రామ్ లో తన కొత్త కారు ఫోటోలు అషురెడ్డి పోస్ట్ చేశారు. ఆ ఫొటోల్లో అషురెడ్డి ఫాదర్ కూడా ఉన్నారు. అషురెడ్డి బెంజ్ కారు కొనడంపై నెటిజెన్స్ పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు. 

57
Ashureddy

Ashureddy


ఇక సోషల్ మీడియా  సెలబ్రిటిగా పేరు తెచ్చుకున్న అషురెడ్డి అంచలంచెలుగా ఎదిగారు. ఈమె జూనియర్ సమంతగా ఫేమస్ అయ్యారు. అలా వచ్చిన పాపులారిటీతో బిగ్ బాస్ షోలో పాల్గొనే ఛాన్స్ కొట్టేశారు. 
 

67


బిగ్ బాస్ సీజన్ 3లో అషురెడ్డి పాల్గొన్నారు. హౌస్ లో పొట్టిబట్టలు ధరించి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే అషురెడ్డి ఆటతీరు ప్రేక్షకులకు పెద్దగా నచ్చలేదు. ఆమెను త్వరగా ఇంటికి పంపేశారు. 

77

బిగ్ బాస్ నాన్ స్టాప్ లో సైతం పాల్గొన్న అషురెడ్డికి కాలం కలిసి రాలేదు. ఓటీటీ వర్షన్ లో సైతం అషురెడ్డి తక్కువ వారాలకే ఎలిమినేట్ అయ్యారు. పలు బుల్లితెర షోస్ లో సందడి చేస్తున్న అషురెడ్డి, యూట్యూబ్ ఛానల్ లో ఆసక్తికర వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటారు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Raghavendra Raoకి మాటిచ్చి ఆ కోరిక తీర్చకుండానే వెళ్లిపోయిన స్టార్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా?
Recommended image2
Most Expensive Songs: ఇండియన్ సినిమాలో 8 ఖరీదైన పాటలు.. నెం.1 అమీర్, షారుఖ్ కాదు
Recommended image3
Superstar Krishna: హీరో కృష్ణ పక్కన సావిత్రి ఛాన్స్ ఎలా మిస్సయింది.? ఆ ఒక్క కారణంతో వద్దని తెగేసి చెప్పింది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved