- Home
- Entertainment
- Ashu Reddy : హాయిగా.. హుషారుగా.. షికారు చేస్తున్న ‘అషురెడ్డి’.. లేటెస్ట్ ఫొటోలతో మెస్మరైజ్ చేస్తోంది..
Ashu Reddy : హాయిగా.. హుషారుగా.. షికారు చేస్తున్న ‘అషురెడ్డి’.. లేటెస్ట్ ఫొటోలతో మెస్మరైజ్ చేస్తోంది..
జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న అషు రెడ్డి బైక్ రైడ్ చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తోంది. ఈ సందర్భంగా ఫొటోలకు ఫొజులిచ్చింది. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో తన అభిమానుల కోసం పోస్ట్ చేసింది.

జూనియర్ సమంత(Junior Samantha)గా పాపులారిటీ తెచ్చుకున్న ఆషురెడ్డి బిగ్ బాస్ షోతో మరింత ఫేమస్ అయ్యారు. ఆ షో తర్వాత ఆమె బుల్లితెర సెలబ్రిటీ అయ్యారు. అనేక కామెడీ షోల్లో కనిపించి సందడి చేస్తున్నారు. దీంతో టెలివిజన్ ఆడియన్స్ లోనూ ఆమెకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది.
ఇక అషు (Ashu Reddy)సోషల్ మీడియా ఫోటో షూట్స్ సంచలనం రేపుతున్నాయి. బ్రేక్ లేకుండా హాట్ ఫోటో షూట్స్ చేస్తూ నెటిజెన్స్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. గ్లామర్ షోలో ఎక్కడా తగ్గడం లేదు.
ట్రెండీ అవుట్ ఫిట్ ను ప్రదర్శిస్తున్న అషు రెడ్డి ఫొటోలకు గ్లామర్ ఆరాధకులు ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ని పెంచుకోవడం లేటెస్ట్ ట్రెండ్. ఇంస్టాగ్రామ్ లో మనల్ని అనుసరించే వారి సంఖ్యను బట్టి బ్రాండ్ వాల్యూ ఉంటుంది. ఈ క్రమంలో అషురెడ్డి తన క్రేజ్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది..
గ్లామర్ షో లో ఎలాంటి మోహమాటం లేకుండా రెచ్చిపోతోంది అషు రెడ్డి. ఈ మధ్య ఓ షోలో యాంకర్ అరియానా నడుముపైనా ముద్దుపెట్టింది అషు. ఈ ఇద్దరి తెగింపుకు జనాలు షాక్ అయ్యారు.
తాజాగా అషు రెడ్డి బైక్ రైడ్ చేసింది. ఈ సందర్భంగా తన అభిమానుల కోసం ఫొటోషూట్ లో పాల్గొంది. ట్రెండీ షర్ట్, బ్లాక్ జీన్స్ ధరించి హాట్ స్టల్స్ ఇచ్చిందీ భామ. ఆ ఫొటోలను నెటిజన్లతో పంచుకుంది.
ఎన్ని చేస్తున్నా ఆషుకు ఆశించిన పాపులారిటీ ఇమేజ్ రావడం లేదు. ఆమె బిగ్ బాస్ జర్నీ కూడా సవ్యంగా సాగలేదు. చాలా తక్కువ రోజులకే ఇంటి బాట పట్టారు. బుల్లితెరపై కనీసం స్టార్ హోదా తెచ్చుకుందామనుకుంటున్న ఆమె ఆశలు తీరడం లేదు.