- Home
- Entertainment
- Ashu Reddy : నెటిజన్ ను ఆటాడుకున్న ‘అషురెడ్డి’.. ఫోన్ నంబర్ అడిగినందుకు బుద్ధి చెప్పిందిగా..
Ashu Reddy : నెటిజన్ ను ఆటాడుకున్న ‘అషురెడ్డి’.. ఫోన్ నంబర్ అడిగినందుకు బుద్ధి చెప్పిందిగా..
బిగ్ బాస్ ఫేమ్ అషురెడ్డికి గ్లామర్ తో ఆకట్టుకోవడమే కాదు.. కొంటే కుర్రాళ్ల ఆటలు కూడా కట్టించడం తెలుసు. ఇటీవల తనను ఓ నెటిజన్ ఫోన్ నంబర్ అడిగాడు. అంతే.. ఇక అషు రెడ్డి అతనికి చుక్కలు చూపించింది. చివరికి దండం పెట్టినా వదల్లేదు..

జూనియర్ సమంతగా పేరుపొందిన అషురెడ్డి సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ గురించి బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. బిగ్‌బాస్ అనంతరం స్టార్‌గా ఎదిగిన అషు, ఆ తర్వాత హాట్‌హాట్‌గా ఫొటోషూట్‌లతో తన క్రేజ్ ను మరింతగా పెంచుకుంటోంది.
తాజా తాజా ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తుంటుంది. అంతేకాదు ఆర్జీవీతో ఆమె చేసిన బోల్డ్ ఇంటర్య్వూ ఎంతగా వైరల్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ ఇంటర్వ్యూ తర్వాత అషురెడ్డి మరింత ఫేమ్ వచ్చింది. ఇందుకు సోషల్ మీడియా వేదికన ఆర్టీజీ (RGV)కి పలుమార్లు థ్యాంక్స్ కూడా చెప్పింది అషు.
అప్పటి నుంచి అషు రెడ్డిని బోల్డ్ బ్యూటీ అని కూడా పిలుస్తున్నారు. అయితే సెలబ్రెటీలను కామెంట్లతో ఆకాశానికెత్తే నెటిజన్లు ఎంత మంది ఉంటారో.. అలాగే కొద్దోగొప్పో వారికి ఇబ్బంది కలిగించే సోషల్ మీడియా యూజర్లు కూడా ఉంటారు. అయితే అలాంటోళ్లకు బుద్ధి చెప్పే అవకాశం సెలబ్స్ కు అప్పుడప్పుడే వస్తుంది. ఆ ఛాన్స్ అషురెడ్డి సరిగ్గా వాడింది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అషురెడ్డిని లైవ్ చాట్ లో ఓ నెటిజన్ నెంబర్ అడుగుతూ మేసేజ్ పెట్టాడు. అయితే ఎవ్వరినీ నమ్మకూడదనే ఉద్దేశంతో అషు తన నంబర్ ను పంపలేదు. కానీ బదులుగా ఆ నెటిజన్ నెంబర్ ను ఇన్ స్టా స్టోరీలో యాడ్ చేసింది. ‘ఎంజాయ్ ద సర్వీస్’ అంటూ క్యాప్షన్ పెట్టింది.
దీంతో పలువురు నెటిజన్లు ఆ నెంబర్ కు ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ ఆ నంబర్ అపురెడ్డిది కాకపోవడంతో ఆ నెటిజన్ ఇరుక్కుపోయాడు. అషుతో మాట్లాడాలంటూ ఫోన్లమీద ఫోన్లు రావడంతో దిమ్మతిరిగిపోయిందా నెటిజన్ కు.
ఇక చేసేదీ లేక మళ్లీ అషురెడ్డికి ‘అక్క కాల్స్ తో చంపుతున్నారు కొంచేం పోస్ట్ డిలీజ్ చేయు అక్క’ అంటూ దండం పెట్టాడు. అప్పుడు కనుకరించిన అషురెడ్డి డిలీట్ చేసి విముక్తి కలిపించింది. అయితే ఈ పోస్ట్ చూసిన పలువురు నెటిజన్లు స్పందిస్తూ అమ్మాయిలు కూడా తమ భద్రత పట్ల అషురెడ్డిలా తెలివిగా ప్రవర్తించాలంటూ అభిప్రాయాలు తెలిపారు.