- Home
- Entertainment
- Prema Entha Madhuram: మాన్సీని మెడ పట్టుకొని గెంటేసిన నీరజ్.. నడిరోడ్డు మీద కుప్పకూలిపోయిన శారదమ్మ!
Prema Entha Madhuram: మాన్సీని మెడ పట్టుకొని గెంటేసిన నీరజ్.. నడిరోడ్డు మీద కుప్పకూలిపోయిన శారదమ్మ!
Prema Entha Madhuram: జీ తెలుగులో ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ టాప్ సీరియల్స్ కి గట్టి పోటీ ఇస్తూ మంచి రేటింగ్ తో దూసుకుపోతుంది. భార్యాబిడ్డల కోసం, కుటుంబ గౌరవం కోసం ఎంత దూరమైనా వెళ్లే ఒక వ్యక్తి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మార్చి 31 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో ఈ విషయాలన్నీ నాకు ఇన్కమ్ టాక్స్ రైడ్ జరుగుతున్నప్పుడు మెయిల్స్ చెక్ చేసినప్పుడు తెలిసింది. కానీ నా తమ్ముడు కాపురంలో నిప్పులు పోయటం ఇష్టం లేక ఊరుకున్నాను. ఇప్పుడు కూడా నా భార్య ని నిందిస్తూ తనని బాధ పెడుతున్నావని నిజం బయట పెట్టాను అంటాడు ఆర్య. ఇంకా ఈ నీచురాలితో కాపురం ఏంటి అంటాడు నీరజ్. వెంటనే మాన్సీ అను కాళ్లు పట్టుకొని నన్ను క్షమించు పొరపాటు జరిగిపోయింది అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆమెని పైకి లేపబోతుంటే తనని ముట్టుకోవద్దు.
ముట్టుకొని మీ చేతుల్ని అపవిత్రం చేసుకోవద్దు అంటాడు నీరజ్. కోడలివైనా కూతురు లాగా చూసుకున్నాను. అలాంటిది నా కొడుకు జీవితంతోనే ఆటలాడుతావా అంటుంది శారదమ్మ. తోబుట్టువులు లేని నా కూతురు నిన్నే తోబుట్టువు అనుకుంది అలాంటి మంచి వాళ్ళకా నువ్వు ద్రోహం చేయాలనుకున్నది అంటూ మందలిస్తుంది పద్దు. మీరు ఇప్పుడు అనుభవిస్తున్న గౌరవం ఆస్తి అన్ని ఆర్య సంపాదించినవి అంటాడు జెండే. ఇంక ఆపండి మా ఆయనకి ఉన్న ఆస్తి అంతస్తు అని బ్రో ఇన్ లా ఇచ్చినవి అంటే నాకు నచ్చటం లేదు. నా భర్త చేతకాని వాడు అనే ఫీలింగ్ నాకు నచ్చటం లేదు.
ఆర్య వర్ధన్ సపోర్ట్ లేకపోతే నీరజ్ వర్ధన్ ఎందుకు పనికిరాడు అని ఫీలింగ్ నాకు నచ్చట్లేదు. అదే నన్ను క్రూయల్ గా ఆలోచించేలా చేస్తుంది. అందుకే ఇదంతా నేను చేశాను అంటూ ఫ్రెస్టేట్ అవుతుంది మాన్సీ. నా స్వతంత్రం కోసం నా భర్త గుర్తింపు కోసం ఇదంతా స్వార్థంతోనే చేశాను అంటుంది. అప్పటికే కోపంతో రగిలిపోతున్న నీరజ్ నువ్వు ఒక నిమిషం కూడా ఇక్కడ ఉండటానికి వీల్లేదు అంటూ మెడ పట్టుకొని గెంటేస్తాడు. కానీ ఆర్య ఆపి భార్య అంటే భర్తలో సగభాగం అంటే తను చేసిన తప్పులో ఎక్కడో నీకు కూడా భాగం ఉంటుంది. పెళ్లి అంటే ఇష్టం వచ్చినప్పుడు కలిసి ఉండి ఇష్టం లేనప్పుడు విడిపోవడం కాదు..
అవతలి మనిషిలో లోపాలని మార్చుకోవాలి అంటాడు ఆర్య. నీలో ఉండే అసూయ నిన్నే తినేస్తుంది. నలుగురితో మంచి అనిపించుకునేలాగా ప్రవర్తించు. అప్పుడు నీకు ఎటు చూసినా ఆనందమే కనిపిస్తుంది. ఎప్పుడైనా చెడు మీద మంచే గెలుస్తుంది. మంచి వైపు నిలబడు లేదంటే ఎప్పుడో ఒకరోజు ఒంటరివయిపోతావు అంటూ మాన్సీకి చెప్తాడు ఆర్య. దేవుడు మీకు మంచి కుటుంబాన్ని ఇచ్చాడు దయచేసి దాన్ని వదులుకోకండి అంటుంది అను. వెళ్ళిపోతున్న ఆర్య వాళ్ళని ఆపుతాడు నీరజ్.
జరిగింది చూశావు కదా ఇలాంటివి మళ్లీ జరగకుండా ఉండాలంటే తనలో నిజమైన మార్పు రావాలి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆర్య దంపతులు. నువ్వు నా భార్య అని చెప్పుకోవటానికి అసహ్యం వేస్తుంది అంటూ నీరజ్ కూడా వెళ్ళిపోతాడు. అందరూ తలా ఒక మాట అని మాన్సీని ఒంటరిగా వదిలేసి వెళ్లిపోతారు. ఇక ఏడుస్తూ కూర్చుంటుంది మాన్సీ.అందరూ వెళ్లిపోవడం గమనించి ఏడుపు ఆపేసి ఈ సారికి ఎలాగో ఒకలాగా గట్టెక్కేసాను కాకపోతే కొన్ని రోజులు నిరసన చేస్తారు దులిపేసుకుంటే సరిపోతుంది.
మొత్తానికి అనువాళ్ళు ఇంటికి రాలేదు నాకు అదే చాలు అనుకుంటుంది మాన్సీ. ఇంటికి వచ్చిన మాన్సీని చెంప మీద కొడతాడు నీరజ్. దీని మాయమాటలతో నన్ను పొల్యూట్ చేసింది.నా వల్లే దాదా వాళ్ళు ఇల్లు వదిలి వెళ్ళిపోయారు అంటూ కోపంతో రెచ్చిపోతాడు నీరజ్. అంజలి ప్రాజెక్టు కూడా ఫెయిల్ అవ్వాలని చూస్తోంది తను మారదు అంటాడు నీరజ్. ఎందుకు మారాలి? ఎవరికోసం మారాలి ఇదంతా నీ కోసమే చేశాను నిన్ను నెంబర్ వన్ పొజిషన్లో చూడాలని చేశాను అంటుంది మాన్సీ. ఇంట్లో తను లేకపోతే మీదే నెంబర్ వన్ స్థానం అవుతుంది అనుకున్నాను కానీ అలా జరగట్లేదు.
ఆర్య వర్ధన్ తమ్ముడు అనే టాగ్ నిన్ను వదలట్లేదు అంటుంది మాన్సీ. నాకు ఆ గుర్తింపు కావాలి అంటాడు నీరజ్. అది నాకు గర్వకారణం అంటాడు. కలిసి ఉండి గొడవలతో బ్రతకడం కంటే విడిపోయి ప్రశాంతంగా బ్రతకడం మంచిది అంటాడు. మాన్సీ కూడా ఆవేశంగా లెట్స్ గెట్ డివోర్స్ అంటుంది. ఇద్దరు ఆవేశంగా అక్కడ నుంచి వెళ్లిపోతారు. మరోవైపు నడుచుకుంటూ వస్తున్న అనుని చూసి కారు ఆపుతుంది అంజలి. ఇంటికే కదా వెళ్తున్నావు పద డ్రాప్ చేస్తాను అంటుంది. వద్దులేండి మేడం.. దగ్గరే కదా నేను వెళ్తాను అంటుంది.
అంతలోనే ఆటోలో వచ్చిన శారదమ్మ ఆటో దిగి డబ్బులు ఇవ్వకపోవడంతో ఆటో వాడు పిలుస్తాడు. నా దగ్గర డబ్బులు లేవు అంటూనే కుప్పకూలిపోతుంది శారదమ్మ. ఆ హడావుడికి తిరిగి చూస్తుంది అను. శారదమ్మ ని గుర్తించి పరిగెత్తుకొని ఆమె దగ్గరికి వెళుతుంది. అంజలి కూడా వచ్చి ఈమె నీరజ్ వాళ్ళ మమ్మీ కదా అంటూ కంగారుగా ఆమెని హాస్పిటల్ కి తీసుకెళ్తారు అను, అంజలి. విషయం తెలుసుకున్న నీరజ్ పరిగెత్తుకుంటూ హాస్పిటల్ కి వస్తాడు. ట్రీట్మెంట్ తీసుకుంటున్న శారదమ్మ ఆర్యని కలవరిస్తూ ఉంటుంది.
బయటికి వచ్చిన డాక్టర్ ప్రస్తుతానికి ఆమె పరిస్థితి బానే ఉంది కరెక్ట్ టైం కి హాస్పిటల్ కి తీసుకువచ్చారు అంటుంది. ఆర్య ఎవరు అని అడుగుతుంది డాక్టర్. మా అన్నయ్య అంటాడు నీరజ్. ఆవిడ ఆ పేరే కలవరిస్తుంది అంటుంది డాక్టర్. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.