- Home
- Entertainment
- Prema Entha Madhuram: మాన్సీ పరువు తీసేసిన కంపెనీ స్టాఫ్.. ఊరు వదిలి వెళ్ళిపోతున్న ఆర్య దంపతులు?
Prema Entha Madhuram: మాన్సీ పరువు తీసేసిన కంపెనీ స్టాఫ్.. ఊరు వదిలి వెళ్ళిపోతున్న ఆర్య దంపతులు?
Prema Entha Madhuram: జీ తెలుగులో ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ ప్రేక్షకుల హృదయాలని గెలుచుకొని మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. మితిమీరిన అహంకారాన్ని ప్రదర్శించి తన కాపురాన్ని రిస్క్ లో పెట్టుకున్న ఒక ఆడదాని కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 12 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే మదన్, అను ఇంటి దగ్గరికి వచ్చి ఇల్లు ఖాళీ చేయండి ఇది నా ప్లేస్ మీరు ఉండడానికి వీల్లేదు అని కోపంగా అంటాడు. అప్పుడు అను ఇందాక పది నిమిషాలు అని చెప్పా కదా కానీ ఇప్పుడు చెప్తున్నాను.. ఆర్య సార్ వచ్చిన వరకూ ఇక్కడ నుంచి కదలేదే లేదు అని అంటుంది. నా ప్లేస్ లో ఉంటూ నేను ఇచ్చిన జీతం తీసుకుంటూ నన్నే ఎదిరిస్తారా అని చెప్పి అను మీద మదన్ చెయ్యవేసేలోగా వెనకాతల నుంచి ఆర్య గట్టిగా మదన్ చేయ పట్టుకుని విరగగొట్టేస్తాడు.
అప్పటివరకు అరుస్తున్న యాదగిరి ఆ దృశ్యం చూసి ఒకేసారి వెనక్కి తిరిగి పారిపోతాడు. ఆర్య కొట్టిన దెబ్బకి బాధతో మదన్ గట్టిగా అరుస్తూ కింద పడిపోతాడు. ఏం జరిగింది అని అడగగా అను జరిగిన విషయం చెబుతుంది దానికి కోపంతో ఆర్య పెద్ద గొడ్డలి తీసుకుని మదన్ మెడ నరికే ప్రయత్నం చేసి గొడ్డలిని పక్కన పారేస్తాడు. నువ్వు ఎవరి మీద చేయ వేస్తున్నావో తెలుసా? నా భార్య మీద చేయి వేస్తున్నావు.
తన మీద చేయి వేయడానికి ప్రయత్నిస్తేనే ఇంత జరిగిందంటే చేయివేస్తే ఏం జరుగుతుందో ఆలోచించు తన మీద నీడ పడినా సరే చంపేస్తాను అని కోపంతో అరుస్తాడు ఆర్య. ఆర్య వెళ్ళిపోయిన తర్వాత అను వచ్చి ఒక ఆడదాని మీద చెయ్యి వేస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా అని మదన్ ని తిట్టి వెళ్ళిపోతుంది. తర్వాత యాదగిరి, మదన్ దగ్గరికి వచ్చి తనని లేపి అక్కడ నుంచి తీసుకొని వెళ్తాడు.
ఆ తర్వాత సీన్లో మాన్సీ ఇంట్లో ఉండగా తనకి ఒక న్యూస్ వస్తుంది. అంజలి రాజనందిని టెక్స్టైల్స్ కి ఎండిగా అపాయింట్ అయింది అని తెలుసుకున్న మాన్సీ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అసలు తనకి ఈ పొజిషన్ ఎలా ఇస్తారు బోర్డు మెంబర్ గా నా ఒపీనియన్ తీసుకోకుండా డెసిషన్ ఎలా తీసుకుంటారు ఇప్పుడే వెళ్లి తేల్చుకుంటాను అని అనుకుంటుంది మాన్సీ.
మరోవైపు శారదమ్మ, నీరజ్ అందరూ రాజనందిని టెక్స్టైల్స్ దగ్గరికి వెళ్తారు. అంజలిని తీసుకుని వెళ్లి తనకి శుభవార్త చెప్తారు. అంజలి ఆశ్చర్యపోతుంది నాకు తెలుసమ్మ నువ్వు మా కోసం ఎంతో సహాయం చేశావు ఈ కంపెనీ నీకు అప్పజెప్తున్నాను. నువ్వు కచ్చితంగా దీన్ని పై స్థాయికి తీసుకువస్తావని మాకు తెలుసు అని శారదమ్మ చెప్తుంది. ఇంతలోనే అక్కడికి కోపంగా వస్తుంది మాన్సీ.
అసలు ఇక్కడ ఏం జరుగుతుంది నా పర్మిషన్ లేకుండా తనని ఎండి ఎలా చేయగలరు. తను ఎండి అవ్వడం నాకు ఇష్టం లేదు అంటుంది. మనం కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేసింది అంజలి. మనం తనకి రుణపడి ఉన్నాము అంటాడు నీరజ్. కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేస్తే తిరిగి సహాయం చేయాలి గానీ ఎండి పొజిషన్ ఇవ్వడం ఏంటి? అయినా ఎవరినడిగి నిర్ణయం తీసుకున్నారు.
బోర్డ్ మెంబర్స్ లో ఒకదానిగా నేను ఈ నిర్ణయాన్ని ఒప్పుకోను నేను రిజెక్ట్ చేస్తున్నాను అని కోపంగా అంటుంది. నువ్వు ఎవరు చెప్తే వింటావో వాళ్ల చేతే చెప్పిస్తాను. ఆర్యతోనే చెప్పించాలనుకుంటున్నావా అని అంటుంది శారదమ్మ. ఇంతలో అక్కడ ఉన్న ఎంప్లాయిస్ అందరూ ఐడి కార్డ్స్ కింద పారేసి ఆర్య సార్ నిర్ణయం మీద మాకు నమ్మకం ఉన్నది.
ఒకవేళ ఆయననే ఎదిరిస్తే మేము ఇక్కడ రిజైన్ చేసి వెళ్ళిపోతాము అని వెళ్ళిపోతారు. మరోవైపు శారదమ్మ, నీరజ్ లు ఆర్య దగ్గరికి వెళ్తారు. ఎక్కడికి వెళ్తున్నారు అని ఆర్య వాళ్ళని అడగగా ఇక్కడ మాకు వర్క్ లేదు అందుకే ఇంకొక ప్లేస్ కి వెళ్లి వర్క్ చూసుకుంటున్నాము అని అంటాడు ఆర్య. నువ్వు వర్క్ కోసం తిరగడం ఏంటి ఆర్య అని బాధపడుతుంది శారదమ్మ.
ఇంతలో నీరజ్ ఆఫీసులో జరిగిన విషయం అంతా అర్యకు చెప్పి గతంలో ఏ ఆడదానికి జరగలేనంత అవమానం అంజలికి జరిగింది మాన్సీ అంజలిని చాలా దారుణంగా అవమానించింది అని బాధపడతాడు. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.