అనాథాశ్రమంలో కుటుంబంతో క్రేజీ హీరో పుట్టినరోజు వేడుకలు, బ్యూటిఫుల్ ఫోటోస్ వైరల్
Arun Vijay: నటుడు అరుణ్ విజయ్ తన పుట్టినరోజును సామాజిక స్పృహతో, అనాథాశ్రమంలో నిరాడంబరంగా జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

అరుణ్ విజయ్ పుట్టినరోజు
తమిళ హీరో అరుణ్ విజయ్ తన పట్టుదల, క్రమశిక్షణతో కూడిన నటన, స్టైలిష్ లుక్స్‌తో ప్రత్యేక అభిమానులను సంపాదించుకున్నారు. బుధవారం రోజు అరుణ్ విజయ్ తన 48వ పుట్టిన రోజు సెలెబ్రేట్ చేసుకున్నాడు. పుట్టినరోజున అరుణ్ విజయ్ సామజిక సేవతో తన గొప్ప మనసు చాటుకున్నాడు.
అరుణ్ విజయ్ గొప్ప ఆలోచన
విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ, ప్రతి సినిమాలో తనను తాను కొత్తగా నిరూపించుకునే అరుణ్ విజయ్, తన జీవితంలోని ఈ ముఖ్యమైన రోజును అనాథలతో పంచుకోవడాన్ని కొన్నేళ్లుగా పాటిస్తున్నారు.పుట్టిన రోజున సైతం సమాజ సేవ చేయాలనే గొప్ప ఆలోచనతో అరుణ్ విజయ్ ముందుకు వెళ్లారు.
అనాథాశ్రమంలో పుట్టినరోజు
ఈ ఏడాది కూడా 'ఉదవుమ్ కరంగల్' అనే అనాథాశ్రమంలో తన పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ ఉదయం చెన్నై సమీపంలోని ఈ ఆశ్రమానికి కుటుంబంతో వెళ్లి, అక్కడి పిల్లలు, వృద్ధులతో సమయం గడిపారు.
వైరల్ అవుతున్న ఫోటోస్
వృద్ధుల ఆరోగ్యం, అవసరాల గురించి అడిగి తెలుసుకుని, సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. పిల్లలకు ఆహారం వడ్డించి, వారితో కలిసి భోజనం చేశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వారి నవ్వే నాకు పెద్ద బహుమతి
“సినిమా నా జీవితం. కానీ ఈ పిల్లలతో గడిపే క్షణాలు మనసుకు నిజమైన సంతోషాన్నిస్తాయి. నా పుట్టినరోజుకి వారి నవ్వే నాకు పెద్ద బహుమతి” అని అరుణ్ విజయ్ అన్నారు. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
అరుణ్ విజయ్ తదుపరి ప్రాజెక్ట్స్
అరుణ్ విజయ్ ప్రస్తుతం తన 34వ చిత్రంలో నటిస్తున్నారు. ఇది కాకుండా, 'భీరంగి కోట్టై' అనే చారిత్రక చిత్రంలో, ఒక వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తున్నారు.

