గెట్ రెడీ, డిసెంబర్ 5 నుంచి 'లాక్ డౌన్'..అధికారిక ప్రకటన వచ్చేసింది
Lock Down: డిసెంబర్ 5వ తేదీ నుంచి లాక్‌డౌన్ రాబోతున్నట్లు ఈ ఉదయం ఒక ప్రకటన వెలువడింది. దీనికి సంబంధించిన పూర్తి అప్‌డేట్‌ను ఈ కథనంలో వివరంగా చూద్దాం.

త్వరలో లాక్ డౌన్
లాక్ డౌన్ అని వినగానే భయంకరమైన కరోనా విళయతాండవం గుర్తుకు వస్తుంది. కరోనా ప్రభావంతో 2020లో ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. దీనితో జన జీవనం స్తంభించిపోయింది. కరోనా ప్రభావం తగ్గేవరకు ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ కథనం అప్పటి లాక్ డౌన్ గురించి కాదు. అదే టైటిల్ తో అనుపమ పరమేశ్వరన్ నటించిన లాక్ డౌన్ అనే సినిమా గురించి.
ఇది అనుపమ పరమేశ్వరన్ లాక్ డౌన్
అనుపమ పరమేశ్వరన్ నటించిన లాక్ డౌన్ చిత్రం చాలా కాలంగా వాయిదా పడుతోంది. వాస్తవానికి ఈ చిత్రం గతేడాది రిలీజ్ కావాల్సింది. కానీ పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఎట్టకేలకు లాక్ డౌన్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. డిసెంబర్ 5 నుంచి ఈ చిత్రం థియేటర్స్ లో సందడి చేయబోతోంది. రిలీజ్ డేట్ ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. ఏ.ఆర్. జీవా దర్శకత్వం వహించారు.
అనుపమ వరుస చిత్రాలు
ఈ ఏడాది అనుపమ పరమేశ్వరన్ వరుస చిత్రాలతో దున్నేస్తున్నారు. వరుస విజయాలు అందుకుంటున్నారు. డ్రాగన్, పరదా, కిష్కింధపురి, జేఎస్కె, ది పెట్ డిటెక్టివ్, బైసన్ చిత్రాలు ఈ ఏడాది అనుపమ నుంచి వచ్చాయి. ఇప్పటికే అనుపమ నుంచి 6 చిత్రాలు రిలీజ్ కాగా లాక్ డౌన్ మూవీ ఏడవది.
అధికారిక ప్రకటన
అదే రోజు కార్తీ నటించిన 'వా వాతియారే' సినిమా కూడా విడుదలవుతుందని ప్రకటించారు. కానీ తాజా సమాచారం ప్రకారం, ఆ సినిమా విడుదల తేదీ వాయిదా పడినట్లు తెలుస్తోంది. అందుకే ఆ తేదీని లాక్‌డౌన్ చిత్ర బృందం ఖరారు చేసుకుంది.
అ..ఆ చిత్రంతో ఎంట్రీ
లాక్ డౌన్ మూవీతో అనుపమ మరో హిట్ కొడుతుందా అనే అంచనాలు మొదలయ్యాయి. అనుపమకి తెలుగు, తమిళం, మలయాళం మూడు భాషల్లో మంచి క్రేజ్ ఉంది. తెలుగులో ఆమె అ..ఆ చిత్రంతో అడుగుపెట్టింది. ఆ తర్వాత అనుపమ శతమానం భవతి, కార్తికేయ 2 లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించింది. చివరగా ఆమె తెలుగులో నటించిన కిష్కింధపురి చిత్రం కూడా మంచి విజయం సాధించింది.

