- Home
- Entertainment
- బ్లాక్ అండ్ వైట్ అందాలతో మతిపోగొడుతున్న షాలినీ పాండే.. గ్లామర్ షోతో అదరగొడుతున్న ‘అర్జున్ రెడ్డి’ హీరోయిన్..
బ్లాక్ అండ్ వైట్ అందాలతో మతిపోగొడుతున్న షాలినీ పాండే.. గ్లామర్ షోతో అదరగొడుతున్న ‘అర్జున్ రెడ్డి’ హీరోయిన్..
హీరోయిన్ షాలినీ పాండే (Shalini Pandey) ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. తను నటించిన ‘జయేష్ బాయ్ జోర్దార్’ ఇటీవల రిలీజ్ అయ్యింది. ఈ సందర్భంగా వరుసగా ఫొటోషూట్స్ చేస్తూ ఆకట్టుకుంటోంది.

హీరోయిన్ షాలినీ పాండే (Shalini Pandey) ‘అర్జున్ రెడ్డి’తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందీ బ్యూటీ. ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్ సాధించడంతో షాలినీకి కూడా చిత్ర పరిశ్రమలో మంచి డిమాండ్ పెరిగింది. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత యంగ్ బ్యూటీ షాలిని పాండే సెన్సేషన్ గా మారిపోయింది.
తొలి చిత్రంతోనే బోల్డ్ పెర్ఫామెన్స్ తో అదరగొట్టడంతో వరుసగా మవీ ఆఫర్లు వచ్చాయి. ఇటు తెలుగు తో పాటు, అటు తమిళం, హిందీ చిత్రాల్లోనూ నటించే అవకాశాలను దక్కించుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఈ బ్యూటీ పాగా వేసింది. వరుస చిత్రాలను ప్రకటిస్తూ కేరీర్ లో దూసుకుపోతోంది. గత నెలలో షాలినీ నటించిన హిందీ చిత్రం ‘జయేష్ బాయ్ జోర్దార్’ (Jayeshbhai Jordaar) రిలీజ్ అయ్యింది. ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్సే వచ్చింది.
మూవీ ఇంకా థియేటర్ లో రన్ అవుతోంది. దీంతోపాటు మరో చిత్రం ‘మహారాజా’ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ చిత్రాలను ప్రమోట్ చేసుకునేందుకు షాలినీ లేటెస్ట్ ఫొటోషూట్లతో ఆకట్టుకుంటోంది. తాజాగా తను పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
ఈ పిక్స్ లో షాలినీ బ్లాక్ అండ్ వైట్ అందాలను వెదజల్లుతూ నెట్టింట రచ్చరచ్చ చేస్తోంది. గ్లామర్ షోతో అందరి చూపును తనవైపు తిప్పుకుంటోంది. ట్రెండీ వేర్ లో షాలినీ అందాలకు మంత్రముగ్ధులవుతున్నారు. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అంతేకాకుండా, షాలినీ పలు రిల్స్ చేస్తూ తన అభిమానులు, ఫాలోవర్స్ ను ఖుషీ చేస్తోంది. మరోవైపు బోల్డ్ ఫొటోషూట్లతోనూ పిచ్చెక్కిస్తోంది. షాలినీ గ్లామర్ షోలో హద్దులు చెరిపేస్తూ కుర్రాళ్లను తనవైపు తిప్పుకుంటోంది.
గతంలోనే బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ బోల్డ్ బ్యూటీ ప్రస్తుతం హిందీ చిత్రాల్లోనే నటించేందుకు మొగ్గుచూపుస్తోంది. ఇటు టాలీవుడ్ లోనూ క్రమంగా షాలినీ క్రేజ్ తగ్గుతూ రావడంతో హిందీ, తమిళం చిత్రాలకే పరిమితం అవుతోంది.