MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అతడితో పెళ్లి కాకుండా రెండోసారి గర్భం..ఉన్మాది అంటూ నెటిజన్ కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన 'ఊపిరి' నటి

అతడితో పెళ్లి కాకుండా రెండోసారి గర్భం..ఉన్మాది అంటూ నెటిజన్ కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన 'ఊపిరి' నటి

ప్రముఖ బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్, అతడి ప్రేయసి హాట్ మోడల్ అయిన గాబ్రియల్లాతో కోనేళ్ళుగా సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jun 07 2023, 04:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ప్రముఖ బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్, అతడి ప్రేయసి హాట్ మోడల్ అయిన గాబ్రియల్లాతో కోనేళ్ళుగా సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. తన మొదటి భార్య మెహర్ తో దాదాపు 20 ఏళ్ల బంధాన్ని తెంచుకుని ఆమె నుంచి 2018లో విడాకులు పొందారు. అప్పటి నుంచి అర్జున్ రాంపాల్ గాబ్రియల్లాతో డేటింగ్ చేస్తున్నాడు. 

 

26

గాబ్రియల్లా గురించి చెప్పాలంటే ఆమె సౌత్ ఆఫ్రికాకి చెందిన మోడల్.ఇండియాలో మోడలింగ్ లో రాణిస్తూ నాగార్జున ఊపిరి చిత్రంలో అవకాశం అందుకుంది. ఆ మూవీలో ఓ డ్యాన్స్ సీన్ లో గాబ్రియల్లా మెరిసింది. అయితే అర్జున్ రాంపాల్ తో ఆమెకి అనుకోకుండా పరిచయం ఏర్పడడం.. ప్రేమలో పడడం జరిగింది. 

 

36

ఈ జంట ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. సహజీవనం చేస్తూనే ఆరిక్ రాంపాల్ అనే కొడుకుని కన్నారు. తాజాగా మరోసారి గాబ్రియల్లా గర్భవతి అయింది. ప్రస్తుతం గాబ్రియల్లా నిండు గర్భిణి. తన ప్రెగ్నన్సీకి సంబంధించిన ఫొటోస్ ని తరచుగా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. 

 

46

బేబీ బంప్ తో ఉన్న పిక్స్.. ప్రియుడు రాంపాల్, కొడుకుతో సరదాగా గడుపుతున్న పిక్స్ ని షేర్ చేస్తోంది. అయితే చాలా కాలంగా వీరిద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అని నెటిజన్లు చర్చించుకుంటూనే ఉన్నారు. తాజాగా గాబ్రియల్లా బేబీ బంప్ పిక్స్ షేర్ చేయగా ఓ నెటిజన్ ట్రోల్ చేస్తూ కామెంట్స్ చేశారు. 

 

56

'అసలు మీరెప్పుడు పెళ్లి చేసుకుంటారు.. నువ్వు ఉంటోంది విదేశాల్లో కాదు ఇండియాలో.. మీరు యువతని చెడగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారు అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టింది. అతడికి గాబ్రియల్లా ధీటుగా సమాధానం ఇచ్చింది. అవును నిజమే మేము తప్పు చేస్తున్నాం.. నీ లాంటి ఉన్మాదులకు జన్మనివ్వకుండా అందమైన చిన్నారులకు జన్మనివ్వడం మేము చేస్తున్న తప్పు' అంటూ చురకలంటించింది. 

 

66

మరికొందరు నెటిజన్లు మాత్రం గాబ్రియల్లాకి మద్దతు తెలుపుతున్నారు. మీరు ఇండియన్ కల్చర్ ని పాడు చేస్తున్నారు.. ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు.. పెళ్లి కాకుండా గర్భం ఏంటి ఇలాంటి ప్రశ్నలు అడిగేవాళ్లకు ఇండియా కల్చర్ గురించే తెలియదు అని అంటున్నారు. ఇండియా ఎవ్వరినైనా స్వాగతిస్తుంది. ఆమె గర్భంతో ఉంది కాబట్టి మంచి మనసుతో విష్ చేయండి అని నెటిజన్లు సపోర్ట్ చేస్తున్నారు. 

 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijay Devarakonda - Rashmika: విజయ్, రష్మికల నగల ధర ఎంతో తెలుసా.? ఏకంగా మూడు విల్లాస్ కొనొచ్చు..
Recommended image2
Chiranjeevi తండ్రి నటించిన మూవీస్‌ ఏంటో తెలుసా? మెగాస్టార్‌కి ముందే సినిమా ఎంట్రీ.. అల్లు రామలింగయ్య వల్లే
Recommended image3
Balakrishna: బాలకృష్ణ కెరీర్‌లో పెద్ద సెన్సేషన్.. అలాంటి రోల్‌లో నటించబోతున్న నందమూరి వారసుడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved