- Home
- Entertainment
- మలైకాతో పెళ్ళిపై క్లారిటీ ఇచ్చిన అర్జున్ కపూర్, యంగ్ హీరోను ఇరకాటంలో పెట్టిన కరణ్ జోహార్
మలైకాతో పెళ్ళిపై క్లారిటీ ఇచ్చిన అర్జున్ కపూర్, యంగ్ హీరోను ఇరకాటంలో పెట్టిన కరణ్ జోహార్
బాలీవుడ్ లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ లవ్ కపుల్ అర్జున్ కపూర్.. మలైకా అరోరా. ఈ ఇద్దరు జంట పెళ్లి చేసుకుంటారా..? లేకలైఫ్ లాంగ్ ఇలా డేటింగ్ లో గడిపేస్తుంటారా అని.. బాలీవుడ్ జనాలు ఇంట్రెస్టింగా చూస్తున్నారు. అయితే ఈ విషయంలో అర్జున్ కపూర్ క్లారిటీ ఇచ్చాడు. ఇంతకీ ఆయన ఏమన్నారు.

బాలీవుడ్ స్టార్ కపుల్ అర్జున్ కపూర్, మలైకా అరోరా.. ప్రేమలో మునిగి తేలుతున్నారు. తన భర్త నుంచి విడాకులు తీసుకున్న మలైకా వెంటనే,, తనకంటే పదేళ్లుపైనే చిన్నవాడైన అర్జున్ తో మలైకా డేటింగ్ చేస్తుంది. ఇక చెట్టాపట్టాలు వేసుకుని ఈజంట తెగ ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు.

అయితే గత కొద్ది రోజులుగా ఈ ఇద్దరు స్టార్లు పెళ్లి చేసుకుంటారంటూ.. బాలీవుడ్ కోడై కూస్తోంది. ఇద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ బీటౌన్ లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఒక దశలో సీక్రేట్ గా పెళ్లి చేసుకున్నారంటూ వార్తలు కూడా వినిపించాయి. అయితే వాలికి కాఫీ విత్ కరణ్ షోలో సమాధానంచెప్పాడుఅర్జున్ కపూర్.
అయితే కాఫీ విత్ కరణ్ షోకి గెస్ట్ గా వచ్చిన అర్జున్ కపూర్ ఈ వ్యవహారంపై బాంబు పేల్చాడు. ఈ షోలో మలైకాతో అఫైర్, పెళ్లిపై ఆయనకు ప్రశ్నలు ఎదురయ్యాయి. తాను, మలైకా ఇప్పుడే పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేమని ఈ సందర్భంగా అర్జున్ చెప్పాడు.
కరోనా మహమ్మారి కారణంగా రెండేళ్లు సినిమాలు లేకుండానే గడిచిపోయాయని... ఇప్పుడు తాను కెరీర్ పై దృష్టి పెట్టాలనుకుంటున్నట్టు తెలిపారు. అంతే కాదు తన పని తనకు సంతోషాన్ని ఇస్తుందని... తాను సంతోషంగా ఉన్నప్పుడే తన భాగస్వామిని సంతోషపెట్టగలనని చెప్పాడు. ఇప్పటికైతే పెళ్లి ఆలోచనలు లేవని స్పష్టం చేశాడు.
ఇక అర్జున్ కపూర్ చెప్పిన ఆ ఆన్సర్ తో బాలీవుడ్ జనాలు ఆశ్చర్యంలో మునిగితేలుతున్నారు. అసలు వీరికి పెళ్ళిచేసుకునే ఉద్ధేశ్యం లేనట్టుందంటూ కామెంట్లుచేస్తున్నారు.