అరియానా ఇంట్లో ఇనయ, సిరి, మెహబూబ్ పూజలు.. చీరలో కేక పెట్టిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ
బిగ్ బాస్ బ్యూటీ అరియానా సోషల్ మీడియాలో బిజీగా ఉంటూ అలరిస్తుంది. అందాల ఫోటోలు ఓ వైపు, తన షోస్ మరోవైపు ఇలా నిత్యం ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటుంది. నానా హంగామా చేస్తుంది.
తాజాగా అరియానా ఇంట్లో వినాయక చవితి సెలబ్రేషన్ నిర్వహించారు. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లు పాల్గొని సందడి చేశారు. ఇందులో సిరి హన్మంతు, మెహబూబ్, ఇనయ సుల్తానా, అవినాష్, జెస్సీ వంటి వారు పాల్గొనడం విశేషం.
అరియానా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ సమక్షంలో ఈ వినాయక చవితి పూజలు నిర్వహించారు. బుజ్జి గణపయ్యని తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేసింది అరియానా. దీక్షతో ఆమె ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం విశేషం.
ఆమెతోపాటు ఫ్రెండ్స్, మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్లు అందరు ఈ పూజలో పాల్గొని గణపయ్య ఆశిస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా అంతా ట్రెడిషనల్ లుక్‌లో కనిపిస్తూ ఆకట్టుకున్నారు. అలరిస్తున్నారు.
ఇక ఇందులో అరియానా స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఆమె సాంప్రదాయంగా కనిపించింది. చీర కట్టులో ఆకట్టుకుంటుంది. గ్రామీణ అమ్మాయి లుక్‌లోకి మారిపోయింది. ఇటీవల అరియానా బొద్దుగా మారిన విషయం తెలిసిందే. దీంతో అరియానా ఆంటీలా కనిపిస్తుంది.
బిగ్ బాస్ షో సమయంలో సన్నని తీగలా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు డబుల్ కా ధమాఖాలా మారిపోయింది. చాలా బరువెక్కి హాట్‌గా తయారైంది. ఆమె హాట్ నెస్ మరింత పెరిగిపోయింది. దీంతో ఈ బ్యూటీపై చాలా రకాల కామెంట్లు వస్తున్నాయి. అయినా వాటిని పట్టించుకోకుండా దూసుకుపోతుందీ బ్యూటీ.
ఇక గణపతి పూజల అనంతరం ఈ బిగ్ బాస్ గ్యాంగ్ అంతా సరదాగా గడిపింది. ఆద్యంతం నవ్వులు చిందుస్తూ తెగ ఎంజాయ్ చేశారు. ఆనందానికి అవదుల్లేవ్ అనేంతగా ఎంజాయ్ చేశారు. బెస్ట్ మెమొరీస్‌గా మార్చుకున్నారు. ఈ పిక్స్ ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది అరియానా. అందరికి చవితి శుభాకాంక్షలు తెలిపింది.
ఇటీవల అరియానా ఆస్ట్రేలియా టూర్‌కి వెళ్లింది. మెహబూబ్, ఇతర ఫ్రెండ్స్ తో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేసి వచ్చారు. అక్కడ ఎంజాయ్ చేసిన ఫోటోలను పంచుకుంటూ ఫ్యాన్స్ ని అలరించారు.
మరోవైపు ఇప్పుడు వినాయక చవితి సెలబ్రేషన్‌లోనూ మెహబూబ్‌తో కలిసి ఆమె పూజలో ప్రత్యేకంగా పాల్గొనడం ఆశ్చర్యపరుస్తుంది. ఇద్దరి కేవలం స్నేహితులేనా, ఇద్దరి మధ్య క్రష్ ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
బిగ్ బాస్ బ్యూటీ అరియానా సోషల్ మీడియాలో బిజీగా ఉంటూ అలరిస్తుంది. అందాల ఫోటోలు ఓ వైపు, తన షోస్ మరోవైపు ఇలా నిత్యం ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటుంది. నానా హంగామా చేస్తుంది.