- Home
- Entertainment
- తారక్ బర్త్ డేకు అదిరిపోయే సర్ ప్రైజ్ లు.! ఫ్యాన్స్ కు పండగే.. ఎన్టీఆర్ 30, 31 నుంచి క్రేజీ బజ్..
తారక్ బర్త్ డేకు అదిరిపోయే సర్ ప్రైజ్ లు.! ఫ్యాన్స్ కు పండగే.. ఎన్టీఆర్ 30, 31 నుంచి క్రేజీ బజ్..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో అలరించాడు. ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ స్థాయి మరింతగా పెరిగింది. ప్రస్తుతం తన అప్ కమింగ్ ఫిల్మ్స్ ఎన్టీఆర్ 30, ఎన్టీఆర్ 31 నుంచి క్రేజీ బజ్ వినిపిస్తోంది.

ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’తో దేశవ్యాప్తంగా ఆడియెన్స్ ను తన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ చిత్రం తర్వాత తారక్ ఫ్యాన్స్ బేక్, మార్కెట్ కూడా అంతకంతకూ పెరిగాయి. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ తన రాబోయే రెండు ప్రాజెక్ట్‌ల నుంచి వరుసగా అప్డేట్స్ ను అందించేందుకు రెడీ అవుతున్నారు. కొరటాల శివ, ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఎన్టీఆర్ 30, ఎన్టీఆర్ 31 చిత్రాల నుంచి అభిమానులకు షాకింగ్ సర్ ప్రైజ్ అందించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
అయితే ఇప్పటికే చిత్రాలపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల ‘ఆచార్య’తో వచ్చిన దర్శకుడు కొరటాల శివ ప్రేక్షకులను కొంత డిజపాయింట్ చేశారు. కానీ తారక్ తో చేస్తున్న సినిమా కచ్చితంగా బ్లాక్ బాస్టర్ హిట్ కొడుతుందని గట్టిగా చెప్పారు శివ.
దీంతో NTR30పై అంచనాలు పెరిగాయి. మరోవైపు కేజీఎఫ్ ఛాప్టర్ 1, 2తో కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఆయన దర్శకత్వంలో ఎన్టీఆర్ తో వస్తున్న చిత్రం NTR31గా తెలుస్తోంది. ఈ రెండు చిత్రాల కోసం అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా సోషల్ మీడియాలో రెండు భారీ చిత్రాల గురించి పలురకాల అప్డేట్స్ అందుతున్నారు. ఈ రెండు ప్రాజెక్ట్‌ల మేకర్స్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20న చిత్రాలపై అధికారిక ప్రకటన చేయనున్నట్టు క్రేజీ బజ్ వినిపిస్తోంది. అయితే ఈ మూవీల నుంచి పోస్టర్‌లను రిలీజ్ చేసేందుకు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ అప్డేట్స్ కొన్ని నెలలుగా ఎన్టీఆర్ అప్ కమింగ్ ప్రాజెక్ట్‌ల అప్‌డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానుల్లో జోష్ ను పెంచుతున్నాయి.
తాజా సమాచారం ప్రకారం.. ఎన్టీఆర్ కొరటాల శివ మరియు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఎన్టీఆర్ 30, ఎన్టీఆర్ 31 చిత్రాల ప్రాథమిక పనిని ప్రారంభించనున్నారు. అయితే ఇప్పటికే తారక్ ఈ రెండు చిత్రాల లుక్ టెస్ట్ కోసం ఫోటోషూట్ కూడా పూర్తి చేశారని టాక్ వినిపిస్తోంది.
ఏదేమైనా మే 20న తారక్ పుట్టిన రోజు ఫ్యాన్స్ ఫుల్ మీల్స్ రెడీ అవుతోందనే చెప్పాలి. వరుస అప్డేట్స్ తో ఎన్టీఆర్ సందడి చేయనున్నారు. ఇప్పటికే జూన్ లో 30, అక్టోబర్ లో ఎన్టీఆర్ 31 చిత్రాలు సెట్స్ పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో చెప్పిన విషయం తెలిసిందే.