Brahmamudi: అప్పు దెబ్బకి చెమటలు కక్కుతున్న స్వప్న.. భర్తని ఓ ఆటాడుకుంటున్న కావ్య!
Brahmamudi: స్టార్ మా లో ప్రసారం అవుతున్న బ్రహ్మముడి సీరియల్ మంచి కంటెంట్ తో టాప్ సీరియల్స్ కి గట్టి పోటీని ఇస్తుంది. తప్పు చేయకపోయినా నిందల పాలవుతున్న ఒక కోడలి కధ ఈ సీరియల్. ఇక ఈరోజు ఏప్రిల్ 29 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో అందరితో పాటు రాజ్ కి కూడా టీ ఇస్తుంది కావ్య. కానీ రాజ్ కోపంగా తన రూమ్ లోకి వెళ్ళిపోతాడు. అందరి మధ్యలో నీ చేతి టీ తాగటానికి మొహమాటపడుతున్నట్లు ఉన్నాడు, వెళ్లి తన రూమ్ లోనే టీ ఇవ్వు అంటుంది రుద్రాణి. భయపడుతూనే రాజ్ రూంలోకి వెళ్తుంది కావ్య. నీవల్ల ఇల్లు రెండు వర్గాలుగా చీలిపోతుంది, తప్పు అని తెలిసినా అమ్మని ఎదిరించాల్సిన పరిస్థితి వచ్చింది.
కమ్మగా వంట చేసి అందర్నీ నీ బుట్టలో వేసుకుంటున్నావు. శాశ్వతంగా ఇక్కడే ఉండిపోవాలని ప్రయత్నించకు, జరిగిందాంట్లో నీ తప్పు ఉందని తెలిస్తే ఆ రోజే నేను ఇంట్లోంచి బయటికి పంపించేస్తాను అంటూ బెదిరిస్తాడు రాజ్. మరోవైపు వీధిలో ఆడవాళ్ళందరూ కనకం దగ్గరికి వచ్చి తనని ఇంట్లోకి ఎలా రానిచ్చావు, పెళ్లిలో వాళ్ళందరూ నిన్ను ఎంత అవమానించారు.
మర్చిపోయావా అంటూ కేకలు వేస్తారు. మీరెవరు నా గురించి మాట్లాడటానికి అంటూ గొడవకి దిగుతుంది స్వప్న. నోరు ముయ్యి నువ్వు పెళ్లి లోంచి వెళ్ళిపోతే వీళ్ళందరూ పూనుకొని కావ్య పెళ్లి చేశారు, వాళ్లనే అంటావా అంటూ స్వప్న మీద కేకలు వేస్తుంది కనకం. దీన్ని ఏ తలకు మాసినోడుకో కట్టపడితే దరిద్రం వదిలిపోతుంది అంటుంది. అలా అయితే చెప్పు మా చుట్టాల వాళ్ళు ఉన్నారు భార్యపోయి ముగ్గురు పిల్లలతో అవస్థలు పడుతున్నాడు అంటుంది ఒకావిడ.
అంతా తను అనుకున్నట్లే జరుగుతుండటంతో ఆనందపడుతుంది అప్పు. నేను రెండో పెళ్లి వాడిని చేసుకోవడమేంటి అంటూ చీదరించుకుంటుంది స్వప్న. నీ మొహానికి అంతకంటే ఎవడొస్తాడు, కావ్య పెళ్లి మీ చేతుల మీదుగానే చేసారు దీని పెళ్లి కూడా మీ చేతుల మీద గాని చేసి పుణ్యం కట్టుకోండి అంటూ కోపంగా చెప్తుంది కనకం. మరోవైపు కృష్ణుడు దగ్గర కూర్చొని బాధపడుతుంది కావ్య.
భగవంతుడివి నీకే తప్పులేదు అపనిందలు అలాంటిది నేను ఏమాత్రం కానీ నాకు నీలాగా అపనిందలు మాపుకొనే శక్తి లేదు దయచేసి అలాంటి ధైర్యాన్ని, సహనాన్ని ప్రసాదించు అంటూ కృష్ణుడిని వేడుకుంటుంది. ఇదంతా చిట్టి చూసి వచ్చి భర్తకి చెప్తుంది. గుర్రాన్ని చెరువు వరకు తీసుకు వెళ్ళగలం కానీ అంతకుమించి మనం మాత్రం ఏం చేస్తాం అంటాడు సీతారామయ్య.
అప్పుడే వచ్చిన రుద్రాణి మీరు తలుచుకుంటే ఏమైనా చేయగలరు అంటూ ఒక సలహా ఇస్తుంది. బానే ఉంది కానీ రాజ్ ఒప్పుకుంటాడా అంటుంది చిట్టి. అయ్యన్నీ నేను చూసుకుంటాను కదా అంటాడు సీతారామయ్య. మరోవైపు స్వప్నకి పెళ్లి సంబంధం తీసుకువస్తుంది అప్పు. ఆ పెళ్ళికొడుకు ఆటో అన్నకి బంధువు పైగా చేపల వ్యాపారం చేస్తుంటాడు. నేను ఇతన్ని పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నావు అంటుంది స్వప్న.
ఆ మాట నేను అనాలి లేచిపోయిన దాన్ని నేను పెళ్లి చేసుకోవడమేంటని కానీ మా బావ చెప్పాడు అందుకే వచ్చాను అంటాడు పెళ్లి కొడుకు. మా వారిని అడిగి ఏ విషయం చెప్తాను అంటుంది కనకం. ఎలా అయినా దీన్ని వదిలించుకోవాలని చూస్తున్నాడు నాన్న కచ్చితంగా ఒప్పుకుంటాడు, మీకెందుకు మీరు వెళ్ళండి శుభవార్తతో మిమ్మల్ని కలుస్తాను అంటుంది అప్పు.
కంగారుపడిన స్వప్న నా పెళ్లి విషయంలో తొందరగా నిర్ణయం తీసుకోవాలి అనుకుంటుంది. మరోవైపు పంతులు గారిని పిలిచి ముహూర్తాలు పెట్టిస్తూ ఉంటారు సీతారామయ్య దంపతులు. ఎందుకు పెట్టిస్తున్నారో అర్థం కాక ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు రాజ్, అపర్ణ. కావ్యకి రాజ్ కి పడటం లేదు కదా ఏమైనా దోషాలు ఉన్నాయేమో అని పంతులుగారి చేత జాతకం చూపిస్తున్నారు అంటుంది రుద్రాణి.అంతసేపు చూస్తున్నారు ఏమైనా దోషాలు ఉన్నాయా అంటుంది చిట్టి.
అలాంటిదేమీ లేదు అనుకున్న ముహూర్తానికి పెళ్లి అవ్వలేదు కదా దాని దోషమే ఇది అంటారు పంతులుగారు. తరువాయి భాగంలో రాజ్ దంపతులకు బ్రహ్మ మూడువేసి రోజంతా వెపకూడదు నోరు విప్పి మాట్లాడకూడదు అంటారు పంతులుగారు. రోజంతా ఒకరి వెంటే ఒకరు ఉంటారు కావ్య దంపతులు. రాజ్ వాష్ రూమ్ కి వస్తుంది అంటే అతనిని ఏడిపించడం కోసం నేను రాను అంటుంది కావ్య. బ్రతిమాలుకుంటాడు రాజ్.