Brahmamudi: కళ్యాణ్ కోసం కన్నీరు పెట్టుకుంటున్న అప్పు.. రుద్రాణి గదిలో కనకం!
Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ మంచి కంటెంట్ తో టాప్ టి ఆర్ పి రేటింగ్ ని సొంతం చేసుకుంటుంది. కూతురికి సాయం కోసం వియ్యపురాలు ఇంటికి వచ్చిన ఒక తల్లి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు అక్టోబర్ 17 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
ఎపిసోడ్ ప్రారంభంలో అందరూ భోజనాలు చేస్తూ ఉండగా కనకం పడక ఆలోచించారా అంటుంది చిట్టి. ఇందులో ఆలోచించడానికి ఏముంది కూతురికి సాయం గా వచ్చింది కాబట్టి స్వప్న గదిలో పడుకుంటుంది అంటుంది రుద్రాణి. మరి రాహుల్ అంటుంది చిట్టి. నేను మమ్మీ గదిలో అడ్జస్ట్ అవుతాను అంటాడు రాహుల్. సీమంతం అయ్యాక స్వప్న ఎలాగో పుట్టింటికి వెళ్ళిపోతుంది, అప్పుడు మీ ఇద్దరూ విడిగా ఉండాలి అప్పటివరకు కలిసే ఉండండి అంటుంది చిట్టి.
అలా అయితే ఇంట్లో అందరూ జంటలుగా ఉన్నవారే ఇక మిగిలింది కిచెన్ ఒక్కటే అక్కడే పడుకోవాలి అంటుంది రుద్రాణి. అందరూ ఆమె వైపు సీరియస్ గా చూస్తారు. నిజమే ఇంట్లో అందరూ జంటలుగానే ఉన్నాం కానీ నువ్వు మాత్రం ఒంటరిగానే ఉన్నావు అంటుంది ధాన్యలక్ష్మి. అనవసరంగా కెలుక్కున్నాను అనుకుంటుంది రుద్రాణి. నిజమే కనకం రుద్రాణి గదిలో పడుకుంటుంది అంటుంది చిట్టి.
మనసులో ఇష్టం లేకపోయినా తన గదిలోకి పడుకోవటానికి ఆహ్వానిస్తుంది రుద్రాణి. ఆ తర్వాత రాజ్ గదిలోకి వచ్చేసరికి తన ఆత్మ మంచం మీద ఉంటుంది. నువ్వు ఎప్పుడో కళావతి ప్రేమలో పడిపోయావు. ఆమె ను ఇంప్రెస్ చేయాలని చూస్తున్నావు అంటాడు ఆత్మ. అలాంటిదేమీ లేదు, నేను గడువు పెట్టుకున్నాను దానికి దీనికి లింకు పెట్టను కానీ తాతయ్య ఆరోగ్యం బాగుంటే అంతే చాలు అంటాడు రాజ్.
నేను నీ డూప్ ని కాదు, నీకు ఆత్మని. నీ మనసులో ఏముందో నాకు తెలుసు నీ భార్య మీద ప్రేమ లేకుండానే అత్తగారిని వెనకేసుకుంటూ వస్తావా అని నిలదీస్తుంది ఆత్మ. అలాంటిదేమీ లేదు మూడు నెలల తర్వాత తను ఎవరో అంటాడు రాజ్. ఆత్మ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు కళ్యాణ్ తనని అందరిలాగే అర్థం చేసుకున్నాడు, అందరి మగవాళ్ళు వేరే,వీడు వేరే అనుకున్నాను కానీ తను కూడా నన్ను అపార్థం చేసుకున్నాడు.
ఎన్ని మాటలు అన్నాడో తెలుసా పెద్దమ్మ, తనని ప్రేమించాలని ఎప్పుడూ అనుకోలేదు కానీ నాకు తెలియకుండానే ఇవన్నీ జరిగిపోయాయి అని కన్నీరు పెట్టుకుంటుంది అప్పు. మనసు అంతే అప్పు మనకి తెలియకుండానే మనల్ని మోసం చేస్తుంది అని అప్పుని ఓదారుస్తుంది పెద్దమ్మ. మరోవైపు కనకం తన గదిలో పడుకోబోతున్నందుకు ఇరిటేట్ అవుతూ ఉంటుంది రుద్రాణి.
కిందన పక్క వేస్తూ ఉంటుంది.అప్పుడే అక్కడికి వచ్చిన కనకం ఏం చేస్తున్నారు, మీరు కింద పడుకుంటారా అని అడుగుతుంది ఈ పక్క నాకోసం కాదు నీ కోసమే అంటుంది రుద్రాణి.నాకు మంచం మీద పడుకునే అలవాటు అంటుంది కనకం. చేసేదేమీ లేక విసుగ్గా మంచం మీద పడుకుంటుంది రుద్రాణి. తర్వాత భర్త కి ఫోన్ చేసి అతనికి జాగ్రత్తలు చెప్తుందికనకం.ఆ మాటల్లో కనకానికి ఏసీ పడదు అనే విషయం అర్థం చేసుకుంటుంది రుద్రాణి.
అయితే ఏసీ ఎక్కువ పెట్టేసి తను నాకు గదిలోంచి పారిపోయేలాగా చేయాలి అనుకుని ఏసీ ఫుల్ లో పెట్టి దుప్పటి కప్పుకుని పడుకుంటుంది రుద్రాణి. మరోవైపు కావ్య బెడ్ రూమ్ లోకి వచ్చిన పెద్దగా పట్టించుకోడు రాజ్, చీమలకి, దోమలకి గుడ్ నైట్ చెప్తుంది కావ్య. ఎందుకలా అంటాడు రాజ్. మీరు మీ భార్యని అలాగే చూస్తున్నారు కదా అంటుంది కావ్య. దొరికిపోయేలాగా ఉన్నాను నటించక తప్పదు అనుకొని ఇప్పుడు నీకు ఏం కావాలి అంటాడు.
నాకు పాన్ తినాలని ఉంది అంటుంది కావ్య. అంతేనా అంటూ ఆన్లైన్లో ఆర్డర్ పెడదామని చూస్తాడు రాజ్. కానీ సర్వీసెస్ నాట్ అవైలబుల్ అని వస్తుంది. అయితే ఇప్పుడు నా కోరిక తీరదా అంటుంది కావ్య. ఇప్పుడు నువ్వు పాన్ తినాలి అంతే కదా పద తీసుకువెళ్తాను అంటాడు రాజ్. ఆ మాటలకి ఎంతో ఆనంద పడిపోతుంది కావ్య.
ఫోన్ తీసుకుంటుంటే ఇప్పుడు అది ఎందుకు మనం వెంటనే వచ్చేస్తాం కదా అని ఫోన్ తీసుకురానివ్వడు. ఇద్దరూ బైక్ మీద వెళ్తున్నామని తెలుసుకొని ఆనందపడుతుంది కావ్య. మరోవైపు ఏసి చలికి తట్టుకోలేక రుద్రాణి కప్పుకున్న దుప్పటిని లాక్కోబోతుంది కనకం. కానీ రుద్రాణి గట్టిగా పట్టుకోవడంతో ఆ పని చేయటం కుదరదు.
అప్పుడు రుద్రాణి బీరువాలో ఉన్న చీరలన్నీ తీసి చుట్టుకొని పడుకుంటుంది. మరోవైపునక్కి, నక్కి బయటికి వెళ్ళటానికి ప్రయత్నిస్తాడు రాజ్. అప్పుడే తను వెనుక డ్రెస్ లో వచ్చిన కావ్య ని చూస్తూ అలా ఉండిపోతాడు. తరువాయి భాగంలో పాన్ షాప్లు అన్నీ మూసి ఉంటాయి కానీ ఒక షాప్ ని వాళ్లే ఓపెన్ చేసి అందులో కిల్లీలు కట్టుకొని తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు.