బాలయ్య వీరాభిమాని అనిపించుకున్న జగన్.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్
ప్రస్తుతం ఎక్కడ చూసినా భీమ్లా నాయక్ మ్యానియా కనిపిస్తోంది. శుక్రవారం రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది.

ప్రస్తుతం ఎక్కడ చూసినా భీమ్లా నాయక్ మ్యానియా కనిపిస్తోంది. శుక్రవారం రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. పవన్ అభిమానులు గత కొన్ని రోజుల నుంచి భీమ్లా నాయక్ ఫీవర్ తో ఊగిపోతున్నారు.
అయితే భీమ్లా నాయక్ రిలీజ్ నేపథ్యంలో సినిమా టికెట్ ధరల వ్యవహారం మరోసారి రాజుకుంది. చిరంజీవి వెళ్లి ప్రాధేయపడినా టికెట్ ధరలు ఇంకా పెరగలేదు. కమిటీ వేసాము.. రిపోర్ట్ వచ్చాక పెంచుతాం అని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఇక్కడ జగన్, పవన్ మధ్య పొలిటికల్ వైరం తెరపైకి వచ్చింది. అఖండ చిత్రం విడుదలైనప్పుడు ఏపీ ప్రభుత్వం చూసి చూడనట్టుగా వదిలేసింది.
దీనితో బెనిఫిట్ షోలు పడ్డాయి, అలాగే థియేటర్ యాజమాన్యాలు కూడా నార్మల్ రేట్లకే టికెట్స్ అమ్ముకున్నాయి. దీనితో అఖండ చిత్రానికి మంచి రెవెన్యూ వచ్చింది. పుష్ప చిత్రానికి బెనిఫిట్ షోలు పడలేదు కానీ.. టికెట్ ధరల విషయంలో చూసి చూడనట్లు వదిలేశారు. కానీ భీమ్లా నాయక్ కి మాత్రం ప్రభుత్వం జీవో 35ని కఠినంగా అమలు చేస్తోంది. ఇది కాస్త వివాదంగా మారింది.
దీనితో మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. భీమ్లా నాయక్ నిర్మాతలు జాయింట్ కలెక్టర్లకు లెటర్ పెట్టుకోలేదని అన్నారు. గౌతమ్ రెడ్డి మరణం వల్ల కొత్త జీవో రిలీజ్ ఆలస్యమవుతోందని చెప్పారు. ఈ క్రమంలో ఆయన ఒక ఆసక్తికర విషయాన్ని రివీల్ చేశారు.
ఇటీవల బాలయ్య.. తాను సీఎం జగన్ ని కలవను అంటూ స్టేట్మెంట్ ఇచ్చినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై పేర్ని నాని మాట్లాడుతూ.. బాలకృష్ణ అలా అని ఉంటారని నేను అనుకోను. స్వయంగా బాలకృష్ణ గారే సీఎం జగన్ ని కలవడానికి నన్ను అపాయింట్ మెంట్ అడిగినట్లు పేర్ని నాని రివీల్ చేశారు.
అఖండ విడుదలకు ముందు నూజివీడు ఎమ్మెల్యే రాయబారంతో అఖండ నిర్మాతలు నన్ను కలిశారు. అది కూడా బాలయ్య నిర్ణయించిన ముహూర్తానికి. బాలకృష్ణ మీతో ఫోన్ లో మాట్లాడాలని అంటున్నారు అని నిర్మాతలు చెప్పారు. అయితే ఫోన్ చేయండి అని అడిగాను. బాలయ్యగారే ముహూర్తం చూసుకుని చేస్తారు అని చెప్పారు. ఆ తర్వాత జగన్ గారిని కలవాలి.. అపాయింట్ మెంట్ ఇప్పించండి అని అడిగారు.
ఈ విషయాన్ని నేను సీఎం జగన్ గారి దృష్టికి తీసుకెళ్ళాను. బాలయ్య గారు మిమ్మల్ని కలవాలని అంటున్నారు అని జగన్ కి చెప్పను. ఎందుకు నాని అని అడిగారు. అఖండ సినిమా గురించి మీతో ఏదో మాట్లాడాలట సర్ అని చెప్పాను. వద్దు నాని అలా అయితే బాలయ్య క్యారెక్టర్ పోతుంది.. ఆయనకు ఏం కావాలో అడిగి చేసేయండి అని జగన్ తనతో చెప్పినట్లు పేర్ని నాని వివరించారు.
దీనితో జగన్ మరోసారి తాను బాలయ్య అభిమానిని అని నిరూపించుకున్నట్లు కామెంట్స్ వినిపిస్తున్నాయి. కాలేజ్ డేస్ లో వైఎస్ జగన్ బాలకృష్ణ అంటే అమితంగా ఇష్టపడేవారిని సన్నిహితులు చెబుతుంటారు.