- Home
- Entertainment
- సీనియర్ డైరెక్టర్ పై చిరంజీవి, కృష్ణ సెటైర్లు.. ఆ హీరోయిన్ కి ఆస్తులు నిజంగానే రాసిచ్చారా ?
సీనియర్ డైరెక్టర్ పై చిరంజీవి, కృష్ణ సెటైర్లు.. ఆ హీరోయిన్ కి ఆస్తులు నిజంగానే రాసిచ్చారా ?
టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ పై చిరంజీవి, కృష్ణ ఎందుకు సెటైర్లు వేయాల్సి వచ్చింది ? ఆయన ఓ హీరోయిన్ కి ఆస్తులు రాసిచ్చారా ? ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు ? ఈ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

మూడు తరాల హీరోలతో పనిచేసిన రాఘవేంద్ర రావు
మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ కృష్ణ తమ కెరీర్ లో ఎందరో గొప్ప దర్శకులతో పని చేశారు. దాదాపు మూడు తరాల హీరోలతో పనిచేసే అదృష్టం కొందరు దర్శకులకే దక్కుతుంది. అలాంటి అరుదైన దర్శకులలో రాఘవేంద్ర రావు ఒకరు. రాఘవేంద్ర రావు తన దర్శకత్వ ప్రతిభతో ఎన్నో అద్భుతమైన చిత్రాలు తెరకెక్కించారు. సూపర్ స్టార్ కృష్ణ, సీనియర్ ఎన్టీఆర్ తరం నుంచి.. మహేష్ బాబు వరకు అందరికీ ఆయన సూపర్ హిట్లు ఇచ్చారు.
రాఘవేంద్ర రావు వల్లే స్టార్లు అయిన హీరోయిన్లు
అయితే రాఘవేంద్ర రావు ఎంతటి అద్భుతమైన దర్శకుడో అదే స్థాయిలో ఆయనపై సెటైర్లు కూడా ఉన్నాయి. హీరోయిన్ల నడుముపై పండ్లు వేసే దర్శకుడిగా గుర్తింపు ఉంది. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో నటిస్తే చాలు ఆ హీరోయిన్ స్టార్ అయిపోవడం ఖాయం అనే నమ్మకం ఇండస్ట్రీలో ఉండేది. శ్రీదేవి, రమ్యకృష్ణ, మీనా, రంభ, నగ్మా, జయప్రద లాంటి హీరోయిన్లంతా రాఘవేంద్ర రావు దర్శకత్వంలో నటించి స్టార్ లుగా ఎదిగిన వారే.
గోల్డెన్ టచ్ అనే గుర్తింపు
రాఘవేంద్ర రావు స్టార్ డైరెక్టర్ కాబట్టి తన వద్దకు వచ్చిన హీరోయిన్లు ఆయన్ని ఇంప్రెస్ చేయాల్సిందే అనే ప్రచారం ఉంది. దీని గురించి ఓ ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురు కాగా రాఘవేంద్ర రావు సమాధానం ఇచ్చారు. అవన్నీ గాలి మాటలు. ఎవరో మాట్లాడుకునే అంశాల గురించి నేను స్పందించను. కాకపోతే రాఘవేంద్ర రావుది గోల్డెన్ టచ్.. ఆయన దర్శకత్వంలో నటిస్తే స్టార్ అయిపోవడం ఖాయం అని హీరోయిన్లు భావించిన మాట వాస్తవమే.
కృష్ణ, చిరంజీవి సెటైర్లు
ఎందుకంటే నేను హీరోయిన్లని అందంగా చూపిస్తాను. అలా నా దర్శకత్వంలో నటించి స్టార్లుగా ఎదిగిన హీరోయిన్లతో ఇంటరాక్షన్ ఎక్కువగా ఉంటుంది. వారితో, వారి మేనేజర్లతో ఎక్కువగా మాట్లాడుతుంటాను అని రాఘవేంద్ర రావు తెలిపారు. మీ వల్లే స్టార్ హీరోయిన్లం అయ్యాం అని చాలా మంది నటీమణులు నాతోనే చెప్పారు అని రాఘవేంద్ర రావు గుర్తు చేసుకున్నారు. హీరోలని డామినేట్ చేసేలా కొన్నిసార్లు హీరోయిన్లని అందంగా చూపించేవాడిని. అలాంటి సందర్భాల్లో కృష్ణ, చిరంజీవి లాంటి హీరోలు నాపై సెటైర్లు కూడా వేసేవారు. హీరోయిన్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అనేవారు. కానీ హీరోయిన్ అందంగా కనిపించి సినిమా బాగా ఆడితే చివరికి పేరు వచ్చేది హీరోకే.. చిరంజీవి సినిమా, కృష్ణ సినిమా అనే అంటారు కానీ పలానా హీరోయిన్ సినిమా అనరు కదా అని వాళ్లకు చెప్పేవాడిని. చిరంజీవి, కృష్ణ కూడా నన్ను అర్థం చేసుకున్నారు అని రాఘవేంద్ర రావు గుర్తు చేసుకున్నారు.
హీరోయిన్ కి ఆస్తులు రాసిచ్చారా ?
ఓ హీరోయిన్ కి మీరు ఆస్తులు రాసిచ్చారు అంట కదా అనే ప్రశ్న ఎదురైంది. దీనితో రాఘవేంద్ర రావు బదులిస్తూ.. హీరోయిన్ కి రాసిచ్చేంత ఆస్తులు నా దగ్గర లేవు. ఎవరైనా హీరోయిన్ ఫ్లాపుల్లో ఉన్నప్పుడు నా దర్శకత్వంలో ఎలాగైనా నటించాలి అని కోరుకునే వారు. నాపై వాళ్ళకి అంత నమ్మకం. అలా నా సినిమాల్లో నటించి స్టార్లుగా ఎదిగి వాళ్ళంతట వాళ్ళు డబ్బు, ఆస్తులు సంపాదించుకున్నారు. కానీ నా గురించి ఇలా రూమర్స్ క్రియేట్ చేయడం కరెక్ట్ కాదు అని రాఘవేంద్ర రావు తెలిపారు.