- Home
- Entertainment
- బిగ్ బాస్ తెలుగు 9 విన్నర్ ఎవరో తేలిపోయింది, ఆమె చెబితే తిరుగులేనట్లే.. వాళ్ళ కష్టం మొత్తం వృధానేనా?
బిగ్ బాస్ తెలుగు 9 విన్నర్ ఎవరో తేలిపోయింది, ఆమె చెబితే తిరుగులేనట్లే.. వాళ్ళ కష్టం మొత్తం వృధానేనా?
Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విజేత ఎవరు అనే అంశం పై ఇప్పటి నుంచే ఊహాగానాలు మొదలయ్యాయి. ఇటీవల ఎలిమినేట్ అయిన దివ్వల మదురు సీజన్ 9 విజేత ఎవరో తేల్చేశారు.

బిగ్ బాస్ షోపై మాధురి కామెంట్స్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రసవత్తరంగా మారుతోంది. చివరి వీక్ లో దివ్వల మాధురి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. బయటకి వచ్చాక దివ్వల మాధురి బిగ్ బాస్ షోపై సంచలన వ్యాఖ్యలు చేసింది. బిగ్ బాస్ లో జరుగుతున్న ఓటింగ్ ఫేక్ అని దివ్వల మాధురి తేల్చేసింది. హౌస్ లో ఉన్నప్పుడు ఆమె.. రీతూ, డిమాన్ పవన్ రిలేషన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
పవన్, రీతూ రిలేషన్ అన్ హెల్దీ ఎందుకంటే..
పవన్, రీతూ రిలేషన్ అన్ హెల్దీ రిలేషన్ అని మాధురి ఆరోపించింది. అలా ఎందుకు అనాల్సి వచ్చింది.. మరి దువ్వాడ శ్రీనివాస్ తో మీ రిలేషన్ ఏంటి అంటూ ఓ ఇంటర్వ్యూలో మాధురికి సూటి ప్రశ్న ఎదురైంది. దీనికి మాధురి సమాధానం ఇస్తూ.. నేను నా రాజా(దువ్వాడ శ్రీనివాస్) కోసం ఏమైనా వదులుకుంటాను. ఇప్పటి వరకు చాలా వదులుకున్నాను కూడా. రీతూకి ఒక వేళ బిగ్ బాస్ టైటిల్ గెలిచే ఛాన్స్ వస్తే.. పవన్ కోసం దాన్ని వదులుకుంటుందా.. వదులుకోదు కదా.. అందుకే వాళ్ళది అన్ హెల్దీ రిలేషన్ అంటూ మాధురి ఆరోపించింది.
ఆమె చిన్న పిల్ల ఏంటి..
రీతూ చౌదరి మీతో పోల్చితే చాలా చిన్న అమ్మాయి. ఆమెతో గొడవ ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది అని ప్రశ్నించగా.. రీతూ చిన్న అమ్మాయి ఏంటి, ఆమెకి ఆల్రెడీ పెళ్లి అయి డివోర్స్ కూడా అయ్యాయి. అలాంటప్పుడు చిన్న అమ్మాయి ఎలా అవుతుంది అని ప్రశ్నించింది.
బిగ్ బాస్ తెలుగు 9 విజేత ఎవరంటే
ఇక ఈ సీజన్ లో బిగ్ బాస్ టైటిల్ గెలిచేది ఎవరు అనే ప్రశ్నకు మాధురి ఆసక్తికర సమాధానం ఇచ్చింది. వారం వారం పరిణామాలు మారిపోతుంటాయి. కానీ తనూజ విజేత అవుతుందని నమ్మకంగా చెప్పగలను. ముందుగా ఆమె సీరియల్ యాక్టింగ్ చేస్తోందని తప్పుగా అనుకున్నాను. కానీ ఆమెతో ఉన్నప్పుడు తనూజ చాలా జెన్యూన్ అని అర్థం అయింది.
వాళ్ళ కష్టం వృధానేనా
ఈ సీజన్ విజేత తనూజనే. చాలా బాగా గేమ్ ఆడుతోంది. బలమైన పాయింట్స్ పెడుతోంది అని దివ్వల మాధురి తేల్చేసింది. మాధురి చెబితే తిరుగులేదని నెటిజన్లు అంటున్నారు. హౌస్ లో కష్టపడుతూ, ఆడియన్స్ ని ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తున్న ఇమ్మాన్యుయేల్ పరిస్థితి ఏంటి ? అతడి కష్టం మొత్తం వృధానేనా అని మరికొందరు ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇమ్మాన్యుయేల్ తో పాటు, కళ్యాణ్, పవన్, రీతూ కూడా టాస్క్ లలో బాగా కష్టపడుతున్నారు. ఇప్పుడు ఇంకా ఇది 8వ వారమే కాబట్టి విజేత ఎవరనే విషయంలో ఒక క్లారిటీకి రాలేమని అంటున్నారు. బిగ్ బాస్ షోలో ఓటింగ్ జెన్యూన్ గా జరగడం లేదు. కానీ నేను ఎలిమినేట్ అయినందుకు బాధపడడం లేదు. తనూజకి నన్ను సేవ్ చేసే అవకాశం ఉందని నాకు తెలుసు. కానీ నన్ను సేవ్ చేయొద్దని తనూజకి ముందే చెప్పా. గౌరవ్ ఎంతో భవిష్యత్తు ఉన్న కుర్రాడు. నన్ను సేవ్ చేస్తే అతడికి అన్యాయం జరుగుతుంది అని తనూజకి తాను వద్దని చెప్పినట్లు మాధురి తెలిపింది.