నా కెరీర్‌లో చేసిన అతి పెద్ద తప్పు అదే.. అనుష్క శెట్టి షాకింగ్ కామెంట్స్..
Anushka Shetty: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి తన కెరీర్‌లో ఓ తప్పిదం చేశాననీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా తన ప్రొఫెషనల్ జీవితం గురించి బహిరంగంగా మాట్లాడని అనుష్క, ఈసారి మాత్రం ఓపెన్‌గా తన గతాన్ని గుర్తు చేసుకుంది.

అనుష్క శెట్టి షాకింగ్ కామెంట్స్
Anushka Shetty: టాలీవుడ్‌లో లేడీ సూపర్‌స్టార్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా, తనదైన నటనతో ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. కొన్ని సంవత్సరాలుగా సినిమాలు తగ్గించినప్పటికీ అనుష్క శెట్టికి ఉన్న ఫ్యాన్ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. బాహుబలి తర్వాత ఆమె ఎంచుకున్న పాత్రలు, సినిమాలు పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. లాంగ్ గ్యాప్ తర్వాత అనుష్క ఇటీవల ‘ఘాటి’మూవీతో ముందుకువచ్చింది. ఈ సినిమా విడుదలకు ముందు భారీ అంచనాలు నెలకొన్న రిలీజ్ తర్వాత సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ప్రేక్షకులు, విమర్శకులు రెండువర్గాల నుండి కూడా నెగటివ్ రివ్యూలే వచ్చాయి. ఫలితంగా, ‘ఘాటి’ అనుష్క కెరీర్‌లోనే ఒక పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది.
కెరీర్ ప్రారంభం నుంచి స్టార్‌డమ్ వరకూ
అనుష్క శెట్టి.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నాగార్జున సరసన వచ్చిన ‘సూపర్’ (2005) మూవీతో టాలీవుడ్ కు పరిచయమైంది. ఈ మూవీ సక్సెస్ కావడంతో అనుష్క వెనక్కి తిరిగి చూసుకోలేదు. గ్లామర్, నటన రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ.. తెలుగు పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి (Sweety)తన కెరీర్‌లో ఓ తప్పిదం చేశాననీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా తన ప్రొఫెషనల్ జీవితం గురించి బహిరంగంగా పెద్దగా మాట్లాడని అనుష్క, ఈసారి మాత్రం ఓపెన్‌గా తన గతాన్ని గుర్తు చేసుకుంది.
నా లైఫ్‌లో అతిపెద్ద తప్పు అదే
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అనుష్క షాకింగ్ కామెంట్స్ చేసింది. బాలకృష్ణతో కలిసి నటించిన ‘ఒక్క మగాడు’(2008)సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ సమయంలో తన కెరీర్ ప్రారంభంలో ఉండటంతో, వైవియస్ చౌదరి- బాలకృష్ణ కాంబోలో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్‌ను తాను పూర్తి అర్థం చేసుకోకుండానే అంగీకరించానని చెప్పింది. అందులోనూ తన పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేకపోవడం, సినిమాలోని ఒక సాంగ్‌లోని ప్రదర్శన కారణంగా ఎదురైన విమర్శలు, తనను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టాయని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ నిర్ణయం తన జీవితంలో అతిపెద్ద బ్లండర్ మిస్టేక అని పేర్కొంది. 2008 సంక్రాంతి కానుకగా విడుదలైన ఒక్క మగాడు సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. బాలయ్య కెరీర్‌లోనూ ఇది ఒక మాయని మచ్చలా మిగిలిపోయింది.
బాహుబలి తర్వాత జాగ్రత్త
అనుష్క కెరీర్‌లో గేమ్‌చేంజర్‌గా నిలిచింది ‘బాహుబలి’ సిరీస్. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ సరసన నటించిన ఈ సినిమా పాన్-ఇండియా స్థాయిలో బ్లాక్‌బస్టర్ అవడంతో, అనుష్క తన ఇమేజ్‌కు తగ్గ పాత్రలనే ఎంచుకుంటోంది. ‘భాగమతి’, ‘నిశ్శబ్దం’, ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’, తాజాగా ‘ఘాటి’ వంటి సినిమాల్లో నటించింది. అయితే, ‘ఘాటి’ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
ప్రభాస్–అనుష్క పెళ్లి రూమర్స్
ఇక మరోవైపు అనుష్క వ్యక్తిగత జీవితం తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. ముఖ్యంగా ప్రభాస్‌తో పెళ్లి చేసుకోబోతున్నారనే రూమర్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఇద్దరూ ఇప్పటికీ బ్యాచిలర్స్‌గా ఉండటంతో ఈ వార్తలకు మరింత ఊపిరి వస్తోందని ఫ్యాన్స్ అంటున్నారు. అయితే, వారి పెళ్లి విషయంలో ఎప్పటికీ అధికారికంగా ఎలాంటి ధృవీకరణ రాలేదు.