RRR సక్సెస్ సెలెబ్రేషన్స్ లో అనుష్క.. రాంచరణ్ తో కలసి రచ్చ షురూ..
మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలసి నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. దీనితో అన్ని ఏరియాలలో కాసుల వర్షం కురుస్తోంది.

Anushka Shetty
మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలసి నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. దీనితో అన్ని ఏరియాలలో కాసుల వర్షం కురుస్తోంది. మరోసారి రాజమౌళి ఇండియన్ సినిమాపై తన మార్క్ చాటారు. ఎన్టీఆర్, రాంచరణ్ తిరుగులేని పెర్ఫామెన్స్ తో అదరగొట్టారు.
Anushka Shetty
బాహుబలి 2 రికార్డులు బ్రేక్ చేస్తూ ఆర్ఆర్ఆర్ చిత్రం వసూళ్లు రాబడుతోంది. దీనితో ఆర్ఆర్ఆర్ టీం పార్టీ మూడ్ లోకి వెళ్ళింది. ఆర్ఆర్ఆర్ టీం సక్సెస్ సెలెబ్రేషన్స్ షురూ చేశారు. ఈ సక్సెస్ సెలెబ్రేషన్స్ లో ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ తో పాటు టాలీవుడ్ ప్రముఖులు కూడా పాల్గొన్నారు.
Anushka Shetty
సక్సెస్ సెలెబ్రేషన్స్ లో ఆర్ఆర్ఆర్ టీం ఫుల్ జోష్ లో కనిపిస్తున్నారు. అయితే ఓ స్టార్ సెలెబ్రిటీ ఆర్ఆర్ఆర్ సెలెబ్రేషన్స్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. ఆమె మరెవరో కాదు. లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి.
Anushka Shetty
ఆర్ఆర్ఆర్ టీం పార్టీలో అనుష్క కూడా జాయిన్ అయింది. వైట్ డ్రెస్ లో మెరిసిన దేవసేన సక్సెస్ పార్టీలో అందరిని ఆకర్షిస్తోంది. రాంచరణ్ తో కలసి అనుష్క సరదాగా కనిపించింది. ఇద్దరూ జోక్స్ వేసుకుంటూ కనిపించారు.
Anushka Shetty
ఇక రాంచరణ్ రాజమౌళిని సరదాగా గిల్లుతూ కనిపించాడు. ఆర్ఆర్ఆర్ సక్సెస్ సెలెబ్రేషన్స్ లో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా మెరిశారు. ఆర్ఆర్ఆర్ టీం సక్సెస్ సెలెబ్రేషన్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
Anushka Shetty
ఆర్ఆర్ఆర్ చిత్రం అన్ని ప్రాంతాల్లో బాహుబలి 2 రికార్డులని చెరిపివేసే విధంగా దూసుకుపోతోంది. తొలి రోజు ఈ చిత్రం 220 కోట్లకు పైగా ప్రపంచ వ్యాప్తంగా గ్రాస్ వసూలు చేసింది.