- Home
- Entertainment
- అనుష్క కెరీర్ లో మచ్చగా మిగిలిపోయిన చిత్రం, ఆ చెత్త సినిమాకి ఒప్పుకుని తప్పు చేసిందట
అనుష్క కెరీర్ లో మచ్చగా మిగిలిపోయిన చిత్రం, ఆ చెత్త సినిమాకి ఒప్పుకుని తప్పు చేసిందట
అనుష్క శెట్టి సౌత్ లో లేడీ సూపర్ స్టార్. బాహుబలి 1, బాహుబలి 2 చిత్రాలతో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకోవడమే కాదు సోలో హీరోయిన్ గా అనేక చిత్రాల్లో నటించి సూపర్ హిట్స్ సొంతం చేసుకుంది. అనుష్క చిత్రాలు స్టార్ హీరోల సినిమాలకు ధీటుగా రాణించాయి.

Anushka Shetty
అనుష్క శెట్టి సౌత్ లో లేడీ సూపర్ స్టార్. బాహుబలి 1, బాహుబలి 2 చిత్రాలతో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకోవడమే కాదు సోలో హీరోయిన్ గా అనేక చిత్రాల్లో నటించి సూపర్ హిట్స్ సొంతం చేసుకుంది. అనుష్క చిత్రాలు స్టార్ హీరోల సినిమాలకు ధీటుగా రాణించాయి. ఒక వైపు కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ ప్రదర్శిస్తూ, మరోవైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో రాణించడం అనుష్కకి మాత్రమే చెల్లింది.
గ్లామర్ క్వీన్ గా వెలుగు వెలిగిన అనుష్క కెరీర్ లో మాయని మచ్చ కూడా ఉందట. ఒక చిత్రానికి ఒప్పుకుని తప్పు చేశానని అనుష్క ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. అనుష్కకి కెరీర్ లో చాలా ఫ్లాప్ చిత్రాలు ఉన్నాయి. కానీ ఎప్పుడూ ఆమె గిల్టీగా ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే సినిమాల్లో హిట్లు ఫ్లాపులు సహజం. ఒక్క సినిమాకి మాత్రం అనుష్క అసలు ఎందుకు ఒప్పుకున్నాను అని ఫీల్ అయిందట.
Anushka Shetty
ఆ చిత్రం పేరు ఒక్క మగాడు. నందమూరి బాలకృష్ణ వైవిఎస్ చౌదరి కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రం ఘోరమైన పరాజయంగా నిలిచింది. ఈ చిత్రంలో తన పాత్ర ఎందుకుందో కూడా అర్థం కాలేదని అనుష్క పేర్కొంది. వైవిఎస్ చౌదరి భారతీయుడు తరహాలో ఒక్కమగాడు చిత్రాన్ని తెరకెక్కించాలని అనుకున్నారు. కానీ ఆ ఆలోచన పూర్తిగా బెడిసికొట్టింది.
ఒక్క మగాడు (Okka magadu)
ఆ చిత్రం అనుష్క కెరీర్ లో ఒక మచ్చగా మిగిలిపోయింది. ఈ చిత్రంలో అనుష్కతో పాటు సిమ్రాన్, ప్రియాంక కొఠారి కూడా నటించారు. బాలకృష్ణ తాను ఈ చిత్రాన్ని కథ వినకుండా ఒకే చేసానని ఆ తర్వాత చెప్పారు.