సౌత్ స్టార్ హీరోయిన్ వల్ల వెక్కి వెక్కి ఏడ్చిన అనుష్క శర్మ, ఆమె వల్ల జరిగిన అన్యాయం ఇదే..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్, విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ హవా కాస్త తగ్గింది. కానీ ఇప్పటికీ ఆమె బాలీవుడ్ లో రాణిస్తూనే ఉంది. అనుష్క శర్మ రబ్ నే బనాది జోడి చిత్రంతో బాలీవుడ్ లోకి బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చింది.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్, విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ హవా కాస్త తగ్గింది. కానీ ఇప్పటికీ ఆమె బాలీవుడ్ లో రాణిస్తూనే ఉంది. అనుష్క శర్మ రబ్ నే బనాది జోడి చిత్రంతో బాలీవుడ్ లోకి బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చింది. ఏకంగా షారుఖ్ ఖాన్ తో నటించి క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఆ మూవీ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ఆ చిత్రంలో అనుష్క శర్మ ఎమోషనల్ గా, ఎనెర్జిటిక్ గా మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. డెబ్యూ హీరోయిన్ లా కాకుండా నటనలో అనుభవం ఉన్న నటిలాగా అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. రబ్ నే బనాది జోడి చిత్రానికి తనకి ఉత్తమ డెబ్యూ నటిగా అవార్డు వస్తుంది అని చాలా ఆశలు పెట్టుకుందట. కానీ ఒక సౌత్ హీరోయిన్ వల్ల తనకి అన్యాయం జరిగింది అని అనుష్క శర్మ ఓపెన్ గా కామెంట్స్ చేసింది. ఆ హీరోయిన్ పేరుని బహిరంగంగా చెబుతూ వ్యాఖ్యలు చేసింది.
అదే ఏడాది ఆసిన్ కూడా గజిని చిత్రంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అమీర్ ఖాన్, ఆసిన్ నటించిన గజినీ చిత్రం సంచలన విజయం సాధించింది. డెబ్యూ హీరోయిన్ల విషయంలో వీరిద్దరి మధ్య పోటీ నెలకొంది. చివరికి ఉత్తమ డెబ్యూ నటిగా ఫిలిం ఫేర్ అవార్డు ఆసిన్ ని వరించింది. దీని గురించి అనుష్క శర్మ మాట్లాడుతూ.. ఆసిన్ అప్పటికే తమిళ్, తెలుగు భాషల్లో నటిగా రాణించింది.
ఆ తర్వాత ఆమె బాలీవుడ్ లోకి వచ్చింది. నాకు ఎలాంటి నటనా అనుభవం లేదు. నేను నటించిన తొలి చిత్రం రబ్ నే బనాది జోడి. అంతకు ముందు ఏ భాషలోనూ నేను నటించలేదు. ఆసిన్ మాత్రం చాలా భాషల్లో నటిగా రాణించి ఆ తర్వాత బాలీవుడ్ లోకి వచ్చింది. మా ఇద్దరిలో కంపేర్ చేసుకుంటే డెబ్యూ నటిని నేనే. ఆమె కాదు.. ఆ అవార్డు ఇవ్వాల్సింది నాకే. కానీ ఆసిన్ ఆ అవార్డు ఎవరేసుకుని పోవడంతో చిన్న పిల్లలా వెక్కి వెక్కి ఏడ్చా అని అనుష్క శర్మ పేర్కొంది.