- Home
- Entertainment
- మేకప్ లేకుండా సహజమైన అందాలతో అనుపమా పరమేశ్వరన్ క్యూట్ పోజులు..ఆలోచింపచేస్తున్న పోస్ట్
మేకప్ లేకుండా సహజమైన అందాలతో అనుపమా పరమేశ్వరన్ క్యూట్ పోజులు..ఆలోచింపచేస్తున్న పోస్ట్
క్యూట్ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ చిలిపిగా కవ్విస్తూ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది. నటిగా నిలబడేందుకు ప్రయత్నిస్తున్న ఈ అందాల ముద్దుగ్గుమ్మ లేటెస్ట్ గా గ్లామర్ డోస్ పెంచుతూ షాకిస్తుంది.

లేటెస్ట్ గా అనుపమా పరమేశ్వరన్(Anupama Parameswaran) మరింత క్యూట్ లుక్‌లోకి మారిపోయింది. ఆమె మేకప్ లేకుండా దర్శనమివ్వడం విశేషం. సహజమైన అందాలతో కనువిందు చేస్తూ ఆకట్టుకుంటుంది. లేటెస్ట్ ఆమె పంచుకున్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
ఇటీవల కాలంలో గ్లామర్ డోస్ పెంచుతూ కనిపించింది అనుపమా పరమేశ్వరన్. నటిగా ఎక్కువ కాలం నిలబడాలంటే ఏం చేయాలో అవన్నీ చేస్తుంది. అందుకు అందాల షో కూడా ఓ ఆయుధంగా వాడుకుంటుంది అనుపమా. అందులో భాగంగా తరచూ గ్లామర్ ఫోటో షూట్లు, హాట్ పిక్స్ ని పంచుకుంటూ సోషల్ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. నిత్యం నెటిజన్లని ఎంగేజ్ చేస్తుంది.
అయితే మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తూ సహజమైన ఫోటోలతోనూ ఆకట్టుకుంటుంది అనుపమా. అందులో భాగంగానే ఈసారి కూడా తన క్యూట్ పిక్స్ ని షేర్ చేసింది. ఉదయాన్ని తన గార్డెన్‌లో దిగిన రెండు పిక్స్ ని షేర్ చేసుకుంది. ఇందులో మరింత క్యూట్‌గా కనిపించడం విశేషం.
అయితే ఈ ఫోటోలను పంచుకుంటూ గొప్ప అర్థంతో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఆలోచింప చేస్తుంది. `ఇప్పుడు సరళంగా ఉన్న రోజులను కోల్పోతున్నాను` అని తెలిపింది. ఆమె పంచుకున్న ఫోటోలకు పర్‌ఫెక్ట్ గా సూట్ అయ్యేలా పోస్ట్ పెట్టడంతో అనుపమా పోస్ట్ లని నిగూడ అర్థాన్ని అర్థం చేసుకుంటున్నారు నెటిజన్లు.
ఒకప్పుడు లైఫ్ చాలా తేలికగా, ఈజీగా ఉండేది. కానీ ఇప్పుడు చాలా సంక్లిష్టంగా, బిజీగా గడిచిపోతుంది. ప్రతి చిన్న విషయానికి స్ట్రెస్ ఫీలవ్వడం జరుగుతుంది. దీని కారణంగా రోజు ప్రతి ఒక్కరికి చాలా కష్టంగా జరిగిపోతుంది. అలానే తన లైఫ్ కూడా జరుగుతుందనే మీనింగ్‌లో అనుపమా ఈ పోస్ట్ పెట్టిందంటున్నారు ఆమె అభిమానులు. ప్రస్తుతం ఆ పిక్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అఉవతున్నాయి.
మలయాళ ముద్దుగుమ్మ అనుపమా పరమేశ్వరన్ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి చాలా రోజులే అవుతుంది. కానీ అనుకున్న స్థాయిలో గుర్తింపు దక్కడం లేదు. అడపాదడపా హిట్లు పడ్డా ఆ స్థాయి గుర్తింపు రాలేదు. స్టార్ హీరోయిన్ అయ్యే లక్షణాలున్నప్పటికీ, ఆ ఇమేజ్ ఇంకా రాలేదు. ఇంకా కెరీర్ పరంగా ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. పెద్ద హిట్లు పడకపోవడం, పెద్ద సినిమాలో ఛాన్స్ లు రాకపోవడం వల్లే ఈ బ్యూటీ కెరీర్ ఇంకా స్ట్రగులింగ్‌లోనే సాగుతుంది.
ప్రస్తుతం ఆమె తెలుగులో మూడు సినిమాలు చేస్తుంది. `కార్తికేయ2`, `18పేజెస్`తోపాటు `బట్టర్‌ఫ్లై` చిత్రాలు చేస్తుంది. ఈ సినిమాలు విజయం సాధిస్తే అనుపమా కెరీర్ నెక్ట్స్ లెవల్‌కి చేరుకుంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మంచి నటన, అందం ఆమె సొంతం కానీ, లక్కు,హిట్ కలసి రావడం లేదు. అందుకే మేకర్స్ ని ఆకట్టుకునేందుకు, ఫాలోయింగ్‌ని పెంచుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తుంది అనుపమా.
గ్లామర్ ఫోటో షూట్లతో తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. క్రేజ్‌ని దక్కించుకుంటుంది. క్రేజ్ వచ్చినా ఆఫర్లు వస్తేనే కెరీర్ ముందుకు సాగుతుంది. ఆ దిశగా అడుగులు వేస్తూ, అందాల ఆరబోతకు డోస్ పెంచుతూ అలరిస్తుంది. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది.